
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్‌లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది.
Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A
— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024
తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్‌కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్‌తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్‌లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..
స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)
పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)
ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)
నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7)