
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు.
అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment