విమానంలో మొబైల్ ఫోన్ కలకలం
ముంబై: వారం వ్యవధిలోనే ముంబై నుంచి బయల్దేరిన మరో విమానం మార్గమధ్యంలో వెనుదిరిగి వచ్చింది. సోమవారం ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీ ఎయిర్లైన్స్ విమానాన్ని మధ్యలో వెనక్కుమళ్లించారు. విమానంలో ఓ మొబైల్ ఫోన్ తెగ మోగుతున్నా.. ఎవరూ దాన్ని ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. సెల్‌ఫోన్లను కూడా బాంబులకు ట్రిగ్గర్లుగా వాడే అవకాశం ఉండటంతో.. విమానంలో ఎక్కడైనా బాంబు పెట్టారేమోనన్న భయంతో దాన్ని మళ్లీ ముంబై మళ్లించారు.
ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేసి క్షుణ్నంగా తనిఖీ చేశారు. విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత టర్కీ విమానం బయల్దేరేందుకు అధికారులు అనుమతిచ్చారు. గతవారం ముంబై-లండన్ విమానంలో ఎలుక కనిపించడంతో వెనుదిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.