'దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు' | 'We Walked On Top Of People,' Says Istanbul nightclub Attack | Sakshi
Sakshi News home page

'దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు'

Published Sun, Jan 1 2017 4:20 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

'దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు' - Sakshi

'దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు'

టర్కీ: టర్కీలో జరిగిన కాల్పుల దుర్ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వివరించాడు. ఆ సమయంలో దాడి జరిగిన చోట ఎంతటి భయానక వాతావరణం నెలకొందో, ప్రజల పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందో స్పష్టం చేశాడు. ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా టర్కీలో ఇస్తాంబుల్‌లో గల నైట్‌ క్లబ్‌లో ఓ సాయుధుడు చొరబడి దొరికిన వారిని దొరికినట్లే పిట్టల్లా కాల్చి చంపాడు. దాదాపు 35మందిని బలితీసుకోవడమే కాకుండా మరో 40మందినిపైగా తీవ్రంగా గాయపరిచాడు. ఈ భయానక దాడి నుంచి బయటపడిన సెఫా బాయ్‌ దాస్‌ అనే ఓ ప్రొఫెషనల్‌ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ తన అనుభవాన్ని చెప్పాడు.

'దాదాపు మేం 500మందిమి నైట్‌ క్లబ్‌లో న్యూఇయర్‌ వేడుకల్లో ఉన్నాం. ఆ సమయంలో అనూహ్యంగా తుపాకీ చప్పుడు వినిపించింది. జనాలంతా భయంతో పరుగులు పెట్టడం ప్రారంభించారు. కానీ, సాయుధుడు మాత్రం ఎంత వీలైతే అంతమందిని చంపేయాలన్నంత కసితో కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భయపడి తమ ఎదుటివారు పరుగులు పెట్టే క్రమంలో కిందపడగా వారిపై నుంచి ఇంకొంతమంది తొక్కుకుంటూ ముందుకురికారు. మేం కూడా పరిగెడుతూ కొంతమందిని తొక్కుకుంటూ వెళ్లి ఓ డోర్‌ పక్కనే దాక్కున్నాం. ఆ సమయంలో మాకు సమీపంగా మరోసారి కాల్పుల శబ్దం వినిపించింది. అమ్మాయిల కేకల చప్పుల్లే బాగా వినిపించాయి. ఆ సమయంలో నేను నా స్నేహితురాలు తొలుత తప్పించుకున్నాం. కానీ, ఆమె సోదరి అక్కడే స్పృహతప్పి పడిపోవడం చూసి అక్కడికి వెళ్లిన ఆమె కూడా చనిపోయింది. ఆ సమయంలో గట్టిగా కేక వేసినప్పటికీ ఎవరూ వినిపించుకోని పరిస్థితి ఎందుకంటే ఆ సమయంలో వందలమంది భయంతో పెద్దగా కేకలు పెడుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంకాగానే నేను అందులోకి వెళ్లాను. అలా వెళ్లిన పది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. నాజీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేనేమో' అంటూ ఆయన తన అనుభవాన్ని చెప్పాడు.

గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement