పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఎంపీ మిథున్‌ రెడ్డి | MP Mithun Reddy speech at UN Climate Change Conference, Istanbul | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఐరాస సదస్సులో ఎంపీ మిథున్‌ రెడ్డి

Published Mon, Nov 11 2024 12:24 PM | Last Updated on Mon, Nov 11 2024 3:25 PM

MP Mithun Reddy speech at UN Climate Change Conference, Istanbul

ఢిల్లీ, సాక్షి: పరిశ్రమల అనుమతుల కోసం మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలకు తిరిగే బదులుగా ఉమ్మడిగా ఒకే శాఖ ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ మినిస్ట్రీ ద్వారా అనుమతులు ఇచ్చి పెట్టుబడులకు సులభతరం చేశామని తెలిపారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న  ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సుకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 

40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు భారత్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడారు.  ‘‘ పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రధాన సవాళ్లు వస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీలు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అంశాలను సులభతరం చేయాలి. అనుమతులకు సంబంధించి ఒకే మంత్రిత్వ శాఖ ఉండాలి’’ అని అన్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులు,అనుసరించాల్సిన వ్యూహాలపై ఇస్తాంబుల్ గ్రీన్ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సదస్సు నిర్వహించారు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల ద్వారా సమీకరణకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిపారు. గ్రీన్ ఇన్‌వెస్ట్‌మెంట్లు చేసే దిశగా పారిశ్రామికవేత్తలను ఎంపీలు ప్రోత్సహించాలని సదస్సు లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు టార్చ్ బేరర్లుగా గ్రీన్ ఇన్‌వెస్ట్‌మెంట్ల దిశగా పనిచేయాలని సదస్సు పిలునిచ్చింది.

ఇస్తాంబుల్ లో గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement