
గడ్డం దారుఢ్యం...
తిక్క లెక్క
శరీరంలో దారుఢ్యం ఉండేది ఎముకలకు, కండరాలకు మాత్రమే కదా.. అనుకుంటున్నారా..? అయితే, తప్పులో కాలేసినట్లే! ఈ ఫొటోను చూస్తే మీకు విషయం కొంత అర్థమైపోతుంది. తెగబారెడు గడ్డమే ఆధారంగా అందమైన అమ్మాయిని ఉయ్యాల ఊపుతున్న ఈ పెద్దమనిషి పేరు అంటానస్ కోంట్రిమాస్. లిథువేనియా దేశానికి చెందినవాడు.
రెండేళ్ల కిందట టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఏర్పాటైన ఒక ప్రదర్శనలో తన గడ్డం దారుఢ్యాన్ని ఇలా ప్రదర్శించాడు. ఇతగాడి గడ్డానికి ఊయ్యాల కట్టుకుని ఊగుతున్న అమ్మాయి బరువు 63.80 కిలోలు. గడ్డంతో ఇంతటి బరువు ఎత్తగల వాళ్లెవరూ ప్రపంచంలోనే లేకపోవడంతో, ఇతగాడి పేరు గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది.