ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి | A suicide bomb attack at Turkish city of Istanbul | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి

Published Sat, Mar 19 2016 4:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి - Sakshi

ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి

ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ పట్టణంలో ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వారాంతాల్లో పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.

 

టర్కీ రాజధాని అంకారాలో గత ఆదివారం కుర్థిష్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్ధులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన మిలటరీ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఈ దాడికి పాల్పడ్డామని ఉగ్రవాదులు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement