four dead
-
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
కుప్పకూలిన డైమండ్ విమానం : నలుగురు మృతి
అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్‌కు చెందిన డైమండ్ ఎయిర్ క్రాష్ట్ఖు చెందిన విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్న ఈ బుల్లి విమానం దుబాయ్‌లో కూలిపోయింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యమైనాయి. ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందనీ, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారి మళ్లించామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచింది. దుబాయ్‌లో ఫ్లైట్ కాలిబ్రేషన్ సర్వీసెస్ నిమిత్తం డీఏ42 విమానాన్ని అద్దెకు తీసుకున్నామని హనీ వెల్ తెలిపింది. ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సంస్థ బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటించింది. Government of Dubai Media Office: The small plane, a diamond 43 owned by Honeywell, had four passengers on board, when it crashed due to a technical malfunction. — Dubai Media Office (@DXBMediaOffice) May 16, 2019 -
అతివేగం ప్రాణాలు తీసింది
సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్/గుంటూరు ఈస్ట్: అప్పటివరకూ ఆనందంగా గడిపిన స్నేహితులు కొన్ని క్షణాల్లో మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సరదాగా షాపింగ్‌కు వెళదామని ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.కళాశాలకు వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన తమ కుమారులను మృత్యువు కబళించింది అని తెలిసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. కొన్ని నిమిషాల ముందు తరగతి గదిలో తమకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన స్నేహితులు ఇక తిరిగిరారని తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. మితిమీరిన వేగం.. తరగతులకు తిరిగి హాజరవ్వాలనే ఆతృత నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం శివారు ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం పాలుకాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం (ఈసీఈ) చదువుతున్న గుంటూరు విద్యానగర్‌కు చెందిన సాదినేని వెంకట సుబ్బారావు కుమారుడు సాదినేని ధనుష్ (18), శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామ శివారు తుమ్మలగుంట గ్రామ మాజీ సర్పంచ్ గుంటూరు సాంబశివరావు కుమారుడు కోటేశ్వరరావు (19), పెదకూరపాడు మండలం, కంభంపాడు గ్రామానికి చెందిన చిరుమామిళ్ల రమేశ్ కుమారుడు సాయిరాం(18), పిడుగురాళ్లకు చెందిన షేక్ బాలసైదా కుమారుడు షేక్ గఫూర్ (18) మృతి చెందగా, గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఆలోకం తారక్ హీరేంద్ర, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దొప్పలపూడి సత్య కౌశిక్, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఆళ్ల శివాజీ గాయపడ్డారు. సంఘటన జరిగిందిలా... ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ క్లాస్ లేకపోవడంతో గుంటూరు నగరంలో న్యూఇయర్ షాపింగ్ చేసుకుని తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వేరే క్లాస్‌కు హాజరవుదామని తోటి విద్యార్థి దొప్పలపూడి సత్య కౌశిక్‌కు చెందిన ఏపీ27 బీటి 0567 నంబర్ గల ఐ–20 కారులో బయల్దేరారు. అయితే కారు గుంటూరు నగర శివారులోని బైపాస్ చేరుకోగానే విజయవాడలో షాపింగ్ చేద్దామని నిర్ణయించుకుని కారు ఎన్‌హెచ్16 మీదుగా అటువైపు మళ్లించారు. హైవే రెండు కిలోమీటర్లు ప్రయాణించాక ముందు వెళ్తున్న మున్సిపల్ చెత్త తరలించే లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ వెనుక భాగంలో కారు బలంగా ఢీ కొంది. అప్పటికే 160 కి.మీ వేగంలో ఉన్న కారు పక్కనే ఉన్న డివైడర్ ఎక్కి సుమారు 30 మీటర్లు దూసుకెళ్లి డివైడర్‌లోని స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం సుమారు 20–30 అడుగుల ఎత్తులో గాలిలో పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. కారు ఢీకొట్టడంతో లారీ సైతం బైపాస్ ఎడమ వైపునున్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో లారీ డ్రైవర్ దేవరపల్లి కిరణ్‌కుమార్, క్లీనర్ దూపాటి రాంచరణ్, మున్సిపల్ కార్మికుడు భూపతి రుద్రయ్య గాయపడ్డారు. వీరికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం డిశ్చార్జి చేశారు. ఘటనా స్థలంలో ముగ్గురి మృతి... కారు నుజ్జునుజ్జు కావడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. కారు వేగానికి వీరి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన షేక్ గఫూర్ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తీవ్ర గాయాలపాలైన తారక్ హీరేంద్రను మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్ నుంచి స్థానిక రమేశ్ హాస్పిటల్‌కు తరలించారు. సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న సత్య కౌశిక్ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, ఏఎస్పీ వైటీ నాయుడు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సౌత్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నాగిరెడ్డి జీజీహెచ్‌కు వచ్చి విచారణ జరిపారు. జీజీహెచ్ వద్ద మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదం ఘటన సమాచారం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, సహ విద్యార్థులు, మిత్రులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్‌కు చేరుకున్నారు. మృతిచెందిన, గాయపడిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గఫూర్ తండ్రి బాలసైదా, తల్లి సైదాబి, బంధువులు తమ కుమారుడి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. తాము ఇంకెవరి కోసం జీవించాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. ధనుష్ తండ్రి వెంకటసుబ్బారావు ఇంటి వద్దే కుప్పకూలి పడిపోయారు. కోటేశ్వరరావు తండ్రి సాంబశివరావు, తల్లి మల్లేశ్వరి మార్చురీలోని కుమారుడి మృతదేహం చూసి పడిన వేదన వర్ణనాతీతం. చిరుమామిళ్ల సాయిరామ్ తండ్రి రమేష్‌బాబు గుండెలవిసేలా రోదించి స్పృహ తప్పిపడిపోగా, ఆయన్ను వాహనంలో కంభంపాడుకు తరలించారు. రోడ్డు ప్రమాదాల్లోనే ఇద్దరు కుమారులను కోల్పోయిన ధనుష్ తల్లిదండ్రులు పట్నంబజారు (గుంటూరు): ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు కుమారులినీ రోడ్డు ప్రమాదాలే బలితీసుకున్నాయి. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిన పెద్ద కుమారుడి స్మృతులను మరువలేకుండా ఉన్న సాధినేని వెంకట సుబ్బారావు, జ్యోతి దంపతులకు ఇప్పుడు చిన్న కుమారుడు ధనుష్ మృతి అంతులేని విషాధాన్ని మిగిల్చింది. బిల్డర్ అయిన వెంకటసుబ్బారావు ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు శ్రీకళ్యాణ్ (24), చిన్నకుమారుడు ధనుష్. చెన్నైలో బీటెక్ నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్న సమయంలో 2017 డిసెంబర్ 16న శ్రీకళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితమే శ్రీకళ్యాణ్ సంవత్సరీకం జరిగింది. ఆ బాధను మరువక ముందే.. చిన్నకుమారుడు ధనుష్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని విషయం తెలిసి ఆ దంపతులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మృత్యువాత పడ్డ షేక్ గఫూర్ తండ్రి బాల సైదా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి తన కుమారుడిని బీటెక్ చదివిస్తున్నాడు. చిన్నతనం నుంచే గఫూర్ చదువులో ప్రతిభ చూపేవాడని ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించాడని బంధువులు తెలిపారు. సివిల్స్ లక్ష్యమని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి చెందారన్న విషయం తెలిసి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృత్యువాత
-
సీమంతం రోజునే తిరిగిరాని లోకాలకు..
యడ్లపాడు (చిలకలూరిపేట)/గుంటూరు రూరల్: పెళ్లి అయిన నెలకే ఆ ఇంట శుభవార్త.. కడుపు పండిందన్న వార్తతో ఆ రెండు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఐదో నెలలో మెట్టినింట సంతోషాల మధ్య సీమంతం నిర్వహించారు. వేడుక పూర్తి అయిన తరువాత పుట్టింటికి తిరుగు ప్రయాణమైన ఆ గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఆమెతోపాటు కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం యడవల్లికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెం దిన తంగేళ్ల శ్రీనివాసరావు, అనసూర్య కుమార్తె జయశ్రీ (19)తో ఆగస్టులో వివాహమైంది. జయశ్రీ 5 నెలల గర్భవతి కావడంతో ఆమెకు సీమంతం నిర్వహించడానికి తల్లి అనసూర్య (40), బంధువు సుంకర రమాదేవి (37), ఆమె కుమార్తె రమ్య (18) సోమవారం వెళ్లారు. పండుగ వాతావరణంలో సీమంతం నిర్వహించారు. వారిని తీసుకువచ్చేందుకు రమాదేవి కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45కు కారులో వెళ్లారు. జయశ్రీని వెంటబెట్టుకుని గోరంట్లకు వస్తుం డగా తిమ్మాపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. 12.30కు జరిగిన ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న జయశ్రీ, అనసూర్య అక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, అతని పక్కన కూర్చున్న ఫ్రాన్సిస్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల, ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో పండుగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి. అతివేగం.. విపరీతమైన మంచు.. ట్రాక్టర్ ట్రాలీకి వెనుక భాగంలో రేడియం స్టిక్కరు లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
భారీ వర్షాలకు వణికిన ముంబై
సాక్షి, ముంబై / న్యూఢిల్లీ / కోల్‌కతా: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం ఒక్కరోజులో 231.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ప్రభావంతో ముంబై, థానేలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరేల్, దాదర్, హిందుమాత, భైకళ, కింగ్ సర్కిల్ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. థానేలోనూ 229.8 మీల్లిమీటర్ల భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పశ్చిమ, సెంట్రల్, హార్బర్ 3 మార్గాల్లో లోకల్ రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి. దక్షిణ ముంబైలోని మెట్రో థియేటర్ వద్ద చెట్టు కూలడంతో ఆదివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో థానేలోని వాడోల్లో ఇంటి పక్కనున్న గోడ కూలిపోవడంతో కిరణ్ గైక్వాడ్(13) అనే బాలుడు చనిపోయాడు. నవీముంబైలోని మలాద్‌లోని మురికికాలువలో పడిపోవడంతో నాగేందర్ అనే యువకుడు మృతి చెందాడు. ముంబైలోని వడాలా ప్రాంతంలో ఓ పెద్ద ప్రహరి గోడ కూలిపోవడంతో 15 కార్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ కార్లలో ప్రజలెవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రవాహంతో ఇక్కడి రోడ్డు సైతం కుంగిపోయింది. కాగా, రాబోయే 24 నుంచి 48 గంటల్లో ముంబైలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు పురూలియాలో ఓ బాలుడు, 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఇద్దరు, 24 దక్షిణ పరగణాల జిల్లాలో మరొకరు చనిపోయారు. కూచ్‌బెహార్ జిల్లాలో వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న సుతుంగా నదిలో మునిగిపోయి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అస్సాంలోని చఛర్ జిల్లాలో ఇద్దరు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వరద తాకిడికి చనిపోయిన ప్రజల సంఖ్య 26కు చేరుకుంది. ఓవైపు ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తుండగా.. మరోవైపు వేడి కూడా రికార్డు స్థాయిలో నమోదయింది. ఆదివారం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రంకల్లా ఆకాశం మేఘావృత్తం కావడంతో పాటు గాలిదుమారం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా నగరంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. రాబోయే 2–3 రోజుల్లో తూర్పు యూపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందన్నారు. చండీగఢ్‌లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
ఏసీ ఫెయిల్..ఐదుగురి మృతి
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్‌ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్‌లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు. -
శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
గడ్చిరోలిలో మరో ఎన్కౌంటర్
నాగ్‌పూర్/చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్ షెలార్ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం నలుగురు మరణించారని చెప్పారు. కాగా ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే కూంబింగ్ ఆపరేషన్‌కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోల మృతి సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. -
అమెరికా రెస్టారెంట్లో కాల్పులు
వాషింగ్టన్: అమెరికాలోని రెస్టారెంట్లోకి ఓ దుండగుడు నగ్నంగా ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలోని వాఫెల్ హౌస్ రెస్టారెంట్లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు సామూహిక కాల్పులకు పాల్పడేందుకు ఉపయోగించే ఏఆర్–15 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు పోలీసులకు తెలిపాడు. చిన్నపాటి జుట్టుతో ఉన్న అతడు శ్వేతజాతీయుడని పేర్కొన్నాడు. నగ్నంగా రెస్టారెంట్లోకి ప్రవేశించిన అతడు కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. గత అక్టోబర్‌లో లాస్వేగాస్లో 58 మంది మృతిచెందిన కాల్పుల ఘటనతోపాటు ఫిబ్రవరిలో ఫ్లోరిడా స్కూల్లో 17 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఘటనలోనూ ఏఆర్–15 రైఫిల్నే దుండగులు ఉపయోగించారు. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్‌ను నిషేధించాలని కోరుతున్న వారి సంఖ్య 62 శాతానికి పెరిగింది. -
దేవుడా..!
నల్లటి చీకటిని కమ్మేసిన తెల్లటి మంచు పొరలు తెలతెలవారుతుండగా ఎర్రటి రక్తపు చారికలయ్యాయి. కొద్ది గంటల క్రితం గోవిందా గోవిందా.. అని స్మరించిన గొంతుకలు ‘ఎంత పనిచేశావు దేవుడా..’ అంటూ బోరున విలపించాయి. ఆదివారం వేకువజామున అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిలో అన్నవరప్పాడు వద్ద ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. దైవ దర్శనానికి వెళ్లి మరికొద్ది గంటల్లో గమ్యం చేరాల్సిన వీరి జీవితాలు విధి ఆడిన వింత నాటకంలో అర్ధంతరంగా ముగిసిపోయాయి. తెల్లవారుజామున సుప్రభాత గీతాలు వినిపించాల్సిన మృతుల ఇళ్లలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విషాద గీతికలై దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగాయి. రొంపిచర్ల (నరసరావుపేట): చిన్నారి చెవులు కుట్టించుకునేందుకు బంధువులంతా కలిసి సంతోషంగా తిరుపతికి వెళ్లి వస్తూ అరగంటలో ఇంటికి చేరే సమయంలో వారిని మంచుతోపాటు ఆయిల్ ట్యాంకర్ మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందులో ఇద్దరు మహిళలతోపాటు ఓ యువకుడు, చిన్నారి ఉన్నారు. ఈ దుర్ఘటన రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు జరిగింది. పిడుగురాళ్లకు చెందిన మన్విత, క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన పొత్తూరి ఝాన్సీ (40), ఆమె కుమారుడు రోహిత్ కుమార్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. కనిగిరి లెనిన్‌కుమారి, కొదమగుండ్ల త్రివేణి, కనిగిరి సహశ్రీ, కూన మంగతాయారు, కపిలవాయి భాగ్యం, కొదమగుండ్ల శరణ్, కొదమగుండ్ల ఏడుకొండలు, హనుమంతరావు, గౌతం, కొదమగుండ్ల మోతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పిడుగురాళ్లకు చెందిన మోతి (40) మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం:డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కే నాగేశ్వరరావు మాట్లాడుతూ రాత్రి వేళల్లో వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. ట్యాంకర్‌ను రోడ్డుపై పార్కింగ్ చేయటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. సీఐ ప్రభాకర్, ఎస్ఐ వెంకటరావు తమ సిబ్బందితో రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మేమెట్టా బతకాలి ? క్రోసూరు: తల్లీ, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీకొడుకులు ఝాన్సీ, రోహిత్‌కుమార్ మృతదేహాలను స్వగ్రామమైన గుడిపాడుకు చేర్చారు. మృతురాలికి భర్త గోపాలకృష్ణ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమారుడైన రోహిత్‌కుమార్ అన్న సోమశేఖర్‌తోపాటు మండలంలోని బృగుబండ జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కూలీనాలి చేసుకుంటూ పిల్లలిద్దరినీ చదివించుకుంటున్న ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ‘ఇక మేమెట్టా బతకాలం’టూ ఆ తండ్రీకొడుకులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు. గుండెలవిసేలా.. పిడుగురాళ్లటౌన్ : పట్టణానికి చెందిన కనిగిరి శ్రీనివాసరావుకు కొదమగుండ్ల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఏడుకొండలు బావమరుదులు. వీరంతా పట్టణంలోనే బావ శ్రీను వద్ద వివిధ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. కొదమగుండ్ల ఏడుకొండలు కుమార్తె యతిశ్రీకి చెవులు కుట్టించేందుకు తిరుపతికి ఈ నెల 22వ తేదీ రాత్రి రెండు వాహనాల్లో సుమారు 20 మంది బంధువులు బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఓ వాహనం ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో వాహనంలో ఉన్న వెంకటేశ్వర్లు భార్య మోతి, రామకృష్ణ కుమార్తె మాన్విత చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రలో నిండిపోయింది. వారం క్రితం గుడిపాడు నుంచి చెల్లెల్ని చూసేందుకు పిడుగురాళ్లకు వచ్చిన పొత్తూరి ఝూన్సీని ఈ కార్యక్రమానికి రావాలని పిలిచారు. దీంతో ఆమె కొడుకు రోహిత్‌కుమార్‌ను కూడా తీసుకొచ్చింది. ఇద్దరూ మృత్యువాత పడ్డారు. శ్రీను భార్య కాలు తీసేయడం, మొదటి బావమరిది భార్య, రెండో బావమరిది కుమార్తె చనిపోవడం, మూడో బావమరిది భార్య గర్భిణి గాయపడటంతో ఆ కుటుంబాల బాధ వర్ణణాతీతంగా ఉంది. చిన్నారి మాన్విత మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తనను ఒంటరిని చేసి వెళ్లడంతో మౌతి భర్త గుండెలవిసేలా రోదిస్తున్నాడు. -
నిర్లక్ష్యం ఖరీదు నలుగురి ప్రాణాలు
గిద్దలూరు: డ్రైవర్ నిర్లక్ష్యంగా తన సెల్‌కు రీచార్జి పెట్టుకుంటుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడంతో పాటు 41 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో తంబళ్లపల్లె క్రాస్ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన సాథిలి, దేవగానిపల్లి, ఉప్పకుంటహల్లి గ్రామాల భక్తులు శివరాత్రి సందర్భంగా పలు ఆలయాలు దర్శించుకునేందుకు ఈ నెల 11వ తేదీన ఓ ట్రావెల్స్ నిర్వాహకుడి లారీలో బయల్దేరారు. కదిరి, తుమ్మలకొండ కోన, బ్రహ్మంగారి మఠం ఆలయాలు దర్శించుకుని శ్రీశైలం వెళ్తున్నారు. మార్గమధ్యంలో నల్లగుంట్ల సమీప మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ రాళ్లను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. 61 మంది ఉండటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా 41 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలో 10 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. మృతుల్లో సాథిలి గ్రామానికి చెందిన నల్లవోలు నారాయణమ్మ (48), తలారి నారాయణప్ప ఆదెమ్మ (58), దేవగానిపల్లెకు చెందిన వెంకట నరసయ్యప్ప (50), ఉప్పుకుంటహల్లికి చెందిన జూలెపల్లి మారప్ప (60) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో నరహల్ల మనిరత్నమ్మ, బి.జయమ్మ, పాపన్న అనసూయమ్మ, నాగరాజప్ప, తిప్పన్న, బాబన్నగారి మునికృష్ణ, కదిరపు రఘు ఉన్నారు. పోలీసుల సేవలు భేష్ అర్ధరాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. కొమరోలు ఎస్ఐ అబ్దుల్ రహమాన్ తక్షణమే సీఐ శ్రీరామ్‌కు విషయం చేరవేశాడు. ఆయన గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలతో పాటు సిబ్బందిని పిలిపించి సంఘటన స్థలంలోని క్షతగాత్రులను తమ వాహనాల్లోనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందింపజేశారు. అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు మినహా గాయపడిన అందరనీ సకాలంలో ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో ఇరుక్కున్న భక్తులను చాకచక్యంగా బయటకు తీసి వారికి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడటంతో స్థానికులు పోలీసులను అభినందించారు. స్వగ్రామాలకు క్షతగాత్రులు నల్లగుంట్ల వద్ద జరిగిన రోడు ప్రమాదంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించిన అనంతం స్వగ్రామాలకు చేర్చేందుకు పోలీసులు చొరవ తీసుకున్నారు. ఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి స్వల్పగాయాలైన వారిని, వారి బంధువులను ఎక్కించారు. మృతులకు ప్రత్యేకంగా అంబులెన్స్, తీవ్రంగా గాయపడిన వారిలో కొందరికి ఒక అంబులెన్స్ చొప్పున కేటాయించి వారి వారి గ్రామాలకు చేర్చేలా పోలీసు సిబ్బందిని పంపించారు. కేసు నమోదు డ్రైవర్, లారీ యజమానికిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీ అనంతపురం జిల్లా లేపాక్షికి చెందినదిగా గుర్తిం చామని చెప్పారు. టూరిస్టు నిర్వాహకుడు సహదేవప్పపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరంతా సహదేవప్పకు రూ.1,500 చొప్పున చెల్లించి దైవ దర్శనం కోసం వచ్చారని తెలిపారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్, భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. ఆయనతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్ఐలు కె.మల్లికార్జున, షేక్ అబ్ధుల్రహమాన్, శశికుమార్, నాగశ్రీను ఉన్నారు. జిల్లా అధికారులకు కృతజ్ఞతలు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో సపర్యలు చేసి ఓదార్చి ధైర్యం చెప్పిన జిల్లా అధికారులను కర్ణాటకలోని గుడిబండ తాలూకా పంచాయతీ అధ్యక్షుడు రామాంజి అభినందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆదెమ్మ తన అత్త అని, సమాచారం తెలియగానే తాను గిద్దలూరు వచ్చానని, ఇక్కడ తమ ప్రాంతానికి చెందిన క్షతగాత్రులకు పోలీసులు, వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. -
కారును ఢీకొన్న బైక్
కూడేరు: కూడేరు–ముద్దలాపురం గ్రామాల మధ్య సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో కారును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి బళ్లారికి ముగ్గురు వ్యక్తులు కారులో బయలుదేరారు. కూడేరు మండలం అరవకూరుకు చెందిన నలుగురు వ్యక్తులు బొమ్మనాల్ మండలం దర్గా హొన్నూరులో ఉరుసుకు వెళ్లి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. శివారెడ్డి తోట వద్ద రహదారి తగ్గు ఉండడం, మరోపక్క చీకటి కావడంతో అదుపుతప్పిన ద్విచక్ర వాహనం కారును ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జుకాగా, దానిపై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురిని చిరంజీవి, కిరణ్, కుళ్లాయప్పలుగా గుర్తించారు. మరొకరి సమాచారం తెలియాల్సి ఉంది. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతినింది. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. విషయం తెలియగానే డీఎస్పీ వెంకటరావ్, సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐ రాజులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రున్ని పోలీసు వాహనంలోనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. -
కశ్మీర్లో మంచు తూఫాన్ నలుగురు మృతి
-
మలుపులో మహా విషాదం
వారంతా వివిధ పనులపై బయలుదేరారు. సమయానికి టాటా ఏస్ వాహనం రావడంతో అందులో ఎక్కారు. ఆ వాహనం ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి వెళ్తోంది. కోటేకల్ కొండల మలుపులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపు.. ఏం జరుగుతోందో ప్రయాణికులు తెలుసుకునేలోపే కంటైనర్ లారీ వచ్చి ఢీకొట్టింది. అదే వేగంతో రోడ్డుపక్కనున్న కల్వర్టు గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామసమీపంలోని కొండల మలుపు దగ్గర మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ నుంచి పొక్లెయిన్‌ను తీసుకుని గుంటూరుకు వెళ్తున్న కంటైనర్ లారీ (ఏపీ 16టీఎక్స్ 8339).. ఎమ్మిగనూరు నుంచి ప్రయాణికులతో ఆదోనికి బయలుదేరిన టాటా ఏస్ వాహనాన్ని(ఏపీ02 టీవీ 0771) ఎదురుగా ఢీకొట్టింది. మలుపులో లారీ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీ కొట్టిన వెంటనే కంటైనర్ పక్కనే ఉన్న కల్వర్టు గుంతలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న కోటేకల్కు చెందిన హరిజన కర్రెమ్మ(58), బోయ అంజినమ్మ(50), బనవాసి ఫారానికి చెందిన ఖాదర్‌బాషా(45), డ్రైవర్ భీమలింగారెడ్డి(37) అక్కడికక్కడే మృతి చెందారు. అంజనయ్య, శివరామాచారి, సాల్మన్‌రాజు, అన్వర్‌బాషా, ఈరన్న, శివమ్మ, జయమ్మ, నూర్‌మహమ్మద్, విజయలక్ష్మీ, దేవదాస్, ఉపా«ధ్యాయుడు ప్రభుదాస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ప్రాంతాలకు చెందినవారు. క్షతగాత్రులను వెంటనే పోలీసు రోడ్ సేఫ్టీవాహనం, 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ జీ.ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ కూడా హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చారు. వాహనంలో ముందు కూర్చొని ప్రాణాలతో బయటపడిన ఉపాధ్యాయుడు ప్రభుదాసుతో ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. వాహన డ్రైవర్ మృతదేహం స్టీరింగ్ దగ్గర ఇరుక్కుపోవటంతో పోలీసులు, స్థానికులు కలసి డోర్ తొలగించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. ముంబాయికి వలస వెళ్తూ.. కోటేకల్ గ్రామానికి చెందిన హరిజన కర్రెమ్మ సోమవారం నూతన సంవత్సర వేడుకలు చేసుకుంది. రెండు రోజుల తరువాత వెళ్దువులే అని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా ముంబాయికి బతుకు దెరువుకోసం బయలుదేరింది. తల్లిని రైలు ఎక్కించేందుకు కుమారుడు దేవదాస్ కూడా ఆ వాహనంలోనే ఆదోనికి బయలుదేరాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావటంతో కర్రెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు దేవదాసుకు తీవ్రగాయాలయ్యాయి. 12 సార్లు రక్తదానం చేసిన భీమలింగారెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీకి చెందిన టాటా ఏస్ డ్రైవర్ భీమలింగారెడ్డి(38) ఇప్పటి వరకు 12 సార్లు రక్తదానం చేశాడు. బీ–నెగిటివ్ గ్రూప్ రక్తం అవసరమని ఎవరు ఫోన్ చేసినా..ఏ సమయంలోనైనా వెళ్లి ఇచ్చేవాడని స్నేహితులు లక్ష్మణ్సాగర్, తిరుమల్ తెలిపారు. వాహనాన్ని ఎమ్మిగనూరు–ఆదోని మధ్య తిప్పేవాడు. భీమలింగారెడ్డి మృతితో భార్య సంధ్య స్పృహతప్పి పడిపోయింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అలాగే బనవాసిఫారానికి చెందిన ఖాదర్బాషాకు భార్య హసమత్బాను, నలుగురు సంతానం. ఇతను ఫారంలో చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. పనినిమిత్తం ఆదోనికి వెళ్తూ ప్రమాదంలో మృతిచెందాడు. బోయ అంజినమ్మ(50)ది కూడా పేదకుటుంబం. ఈమె కూడా సొంత పని నిమిత్తం ఆదోనికి బయలుదేరి..ప్రమాదానికి బలైంది. బాధితులను పరామర్శించిన నేతలు క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జగన్మోహన్రెడ్డి, ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఖర్చుల కోసం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆర్థిక సాయం అందించారు. -
విహారంలో ఘోర విషాదం
-
విహారంలో ఘోర విషాదం
గంగావతి: సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు... ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా గంగావతి నగరంలో వారి సమీప బంధువులైన మాజీ కౌన్సిలర్ సీ.మోహన్‌రావు నివాసానికి వస్తుంటారు. మృతులందరూ మోహన్‌రావు సోదరుడు, సోదరిల పిల్లలు. ఏటా కార్తీకంలో కుటుంబ సభ్యులతో కలసి హేమగుడ్డ దుర్గమ్మ దేవస్థానానికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం బంధువులు ఇంట్లో వంటలు చేసేపనిలో నిమగ్నమై ఉండగా, వారికి చెప్పకుండా చెరువుకు స్నానా నికని వెళ్లారు. నీటిలో ఆడుకుంటుండగా లోతైన ప్రాంతంలో మునిగిపోయారు. మధ్యాహ్నమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో బంధువులు చెరువు వద్దకు వెళ్లి వెతగ్గా మృతదేహాలు కనిపించాయి. బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీరని విషాదం కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు బాలలతో పాటు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి కార్తీక ఉత్సవాల కోసం బంధువుల ఇంటికి వచ్చి జలసమాధి అయ్యారు. ఒడిలో మృతదేహాలతో విలపిస్తున్న మహిళ. -
వ్యూహం మార్చిన ఉగ్ర సంస్ధ
-
విద్యుదాఘాతంతో నలుగురి మృతి
వలిగొండ/పెద్దవూర/మొయినాబాద్: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో బుధవారం నలుగురు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన రైతు రుద్రగోని భూమయ్య (65)కు వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. మంగళవారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగి పొలం గట్టుపై పడింది. భూమయ్య పొలంగట్ల మీద నడుస్తుండగా విద్యుత్ తీగ కాళ్లకు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కొమటికుంటతండాలో కొత్త ఇంటికి నీరు కొట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతంతో నరేష్(22) మృతిచెందాడు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామంలో బొలిగిద్ద గోపాల్ (55), కుమారుడు రవికుమార్ (23) బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లారు. బోరు మోటారు నడవకపోవడంతో రవికుమార్ స్టార్టర్ డబ్బాను తెరిచి చూశాడు. ఫ్యూజు పోవడంతో దాన్ని వేసే క్రమంలో అతనికి కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన తండ్రి గోపాల్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. -
భారీ భూకంపం.. 15 మంది మృతి
ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవుల్లో సంభవించిన భారీ భూకంపంతో 15 మంది మృతిచెందగా సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైన ఈ భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. సురిగావో నగరానికి 13 కిలోమీటర్ల తూర్పుదిశలో ఇది ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు మాత్రం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. భారీ భూకంపం తర్వాత 89 వరకు ఆఫ్టర్ షాక్స్ వచ్చాయని ఫిలిప్పీన్స్ సిస్మిక్ ఏజెన్సీ అధిపతి రెనాటో సోలిడమ్ తెలిపారు. మరిన్ని ఆఫ్టర్ షాక్స్ రావచ్చని అన్నారు గానీ, వాటివల్ల నష్టం అంత ఎక్కువ ఉండకపోవచ్చని అంచనా వేశారు. 1879లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత.. తాజాదే అత్యంత శక్తిమంతమైనది. భూకంపం కారణంగా ప్రజలు అర్ధరాత్రి బయటకు వచ్చి.. పార్కులు, షెల్టర్లలోనే రాత్రంతా గడిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, నీటి సరఫరా ఆగిపోయింది. ఒక బ్రిడ్జి, ఒక హోటల్ కూడా కుప్పకూలాయి. సురిగావో విమానాశ్రయం రన్‌వే మీద పగుళ్లు రావడంతో దాన్ని మూసేశారు. -
జగిత్యాలలో ఘోరం... నలుగురు మృతి
-
థీమ్ పార్కులో ప్రమాదం.. నలుగురి మృతి
ఆస్ట్రేలియాలోని అతిపెద్ద థీమ్ పార్కులోని వాటర్ రెయిడ్‌లో ప్రమాదం సంభవించి, నలుగురు మరణించారు. క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని గోల్డ్ కోస్ట్ టూరిస్ట్ జిల్లాలోని డ్రీమ్‌వరల్డ్ థీమ్ పార్కులో ఈ ప్రమాదం జరిగింది. 'థండర్ రాపిడ్స్ రివర్ రెయిడ్' అనే నీటి రెయిడ్‌లో అందరూ ఉండగా.. ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రమాదం జరగడంతో అక్కడున్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రెయిడ్‌లో కన్వేయర్ బెల్టు, ఆరుగురు వ్యక్తులు ఒకేసారి కూర్చోగల సర్క్యులర్ రాఫ్టులు ఉపయోగిస్తారు. అయితే కన్వేయర్ బెల్టు తెగిందా.. లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మిగిలిన వివరాలను మీడియా సమావేశంలో తెలియజేస్తామని పోలీసులు అన్నారు. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు విశ్రాంత ఉద్యోగుల దుర్మరణం.. మృతులు హైదరాబాద్ వాసులు చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న నాగార్జున అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు రంగరాజు, కనకరాజు, రామకృష్ణరాజు, సుబ్బరాజులతోపాటు స్నేహితులు కృష్ణారావు వీఎన్ మూర్తిరాజు, రామ్మోహన్‌రాజు ఈనెల 11న స్కార్పియో వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు. వివిధ ప్రాంతాల్లో దర్శనాలు ముగించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున చాగలమర్రి సమీపంలో కూలూరు రస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగరాజు (64), కనకరాజు (72), రామకృష్ణరాజు (58), సుబ్బరాజు (60) దుర్మరణం చెందగా.. కృష్ణారావు, వీఎన్ మూర్తి, రామ్మోహన్‌రాజులకు తీవ్ర గాయాలయ్యారుు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో
-
కూలిన భవనం: నలుగురి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాలు డార్జిలింగ్‌లో శనివారం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. -
టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం
హ్యూస్టన్: టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న 'పైపర్ పీఏ-32' రకానికి చెందిన విమానం వెస్ట్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్పోర్ట్ సమీంపలోని చెట్ల పొదల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నేలను తాకగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో విమానం తునాతునకలైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతిచెందిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానం కూలిపోవటానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
పెద్దదోర్నాల(ప్రకాశం): ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చెంచుకుంట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ పట్టణంలో ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వారాంతాల్లో పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. టర్కీ రాజధాని అంకారాలో గత ఆదివారం కుర్థిష్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్ధులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ దాడికి పాల్పడ్డామని ఉగ్రవాదులు ప్రకటించారు. -
జైల్లోంచి లాక్కొచ్చి కొట్టి చంపారు
పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో దారుణం చోటుచేసుకుంది. బంగారం వ్యాపారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు నిందితులను ప్రజలు జైల్లోంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపారు. గినియాలోని కురోస్సా అనే చిన్న పట్టణంలో కబా కమరా అనే వ్యక్తి బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. పోలీసులు హత్య కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 16 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఇంతలోనే హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణంలో వదంతులు వ్యాపించాయి. అంతే.. ప్రజలు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. జైలుపై దాడి చేసి.. హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న నలుగురిని బయటకు లాక్కొచ్చారు. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు నలుగురిని చావబాదారు. నలుగురిలో ముగ్గురు దెబ్బలకు తాలలేక మృతి చెందగా, ఒకరిని ప్రాణాలతో ఉండగానే తగులబెట్టారు. నలుగురి మృతదేహాలు బహిరంగ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని గినియా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
గణపవరంలో లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం
నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామంలోగల చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ గణపవరం వద్దకు రాగానే రోడ్డు మలుపు దగ్గర ఒక్కసారిగా పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న బి. భాస్కర్ రావు(70), ఆయన సతీమణి పుణ్యవతి(60) తోపాటు అక్కడే టీ తాగుతున్న మరో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. లారీ డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బీభత్సం: నలుగురి దుర్మరణం
-
రెండు కార్లు ఢీ.. నలుగురి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి నలుగురి మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మన్నీల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ధర్మవరంలోని పీఆర్టీ కాలనీకి చెందిన బిక్కేశ్వరరావు, అతడి చిన్నాన్న పామిశెట్టి గోపాల్, శ్రీనివాసులు ఆదివారం ఉదయం అనంతపురంలో వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. మన్నీల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఆ కారు డ్రైవర్ భాస్కర్‌తో పాటు ముగ్గురూ మృతి చెందారు. ఇదే ఘటనలో బాలవెంకటరెడ్డి, ఆయన కుమారుడు ఆనంద్‌రెడ్డి, మనమళ్లు వరుణ్‌కుమార్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు గాయపడ్డారు. వీరు పీర్ల పండగ కోసం ధర్మవరం నుంచి వెళ్తుండగా..ప్రమాదం జరిగింది. మృతుల్లో గోపాల్ మగ్గం నేస్తుండేవాడు. బిక్కేశ్వరరావు, శ్రీనివాసులు చీరల వ్యాపారం చేసేవారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ వైర్ తగిలి కూలిన హెలికాప్టర్
బ్రటిస్లావా: హెలికాప్టర్ ప్రోపెల్లర్ కరెంట్ తీగలకు తగిలి నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ఘటన తూర్పు స్లోవేకియా హర్బుసికా గ్రామ సమీపంలో హర్నాడ్ నదిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సోవేకియా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి శనివారం వెల్లడించారు. మృతులలో హెలికాప్టర్ పైలెట్, వైద్యుడు, ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు ఉన్నారని తెలిపారు. 10 ఏళ్ల బాలుడికి తలకు బలమైన గాయమైందని... అతడికి చికిత్స అందించేందుకు వెళ్తున్న క్రమంలో రెస్క్యూ హెలికాప్టర్‌కు ఈ ప్రమాదం జరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి చెప్పారు. -
రెండు బస్సులు ఢీ: నలుగురు మృతి
- మరో 15 మందికి తీవ్ర గాయాలు - క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మహేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ధర్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలోని ధన్వాడ మండలం మరికల్ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడికి చెందిన సుంకరి బాలమ్మ (28), కొడుకు అజయ్ (4 నెలలు)తో కలసి బస్సు ఎక్కింది. వీరితో పాటు మరికల్‌కు చెందిన విద్యార్థి సోహైల్ (14) జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ఎక్కాడు. వీరితో పాటు మక్తల్‌కు చెందిన మరికొందరు బస్సులో ఉన్నారు. మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కర్ణాటక బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకరి బాలమ్మ, అజయ్, సోహైల్, మరో ప్రయాణికురాలు హసీనాబేగం (45) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు. అలాగే జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి విరిగి రోడ్డుపై పడింది. ఈయనతో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.ఐదు వేల చొప్పున అందజేస్తామని, మెరుగైన వైద్యసేవలు అందించాలని స్థానిక వైద్యులకు సూచించారు. -
హెలికాప్టర్ కూలి నలుగురు మృతి
బ్రెజిల్: నిర్మాణంలో ఉన్న భవనంపై హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని కర్పీక్యుబా పట్టణ శివారు ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని ద బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. మృతులను గుర్తించవలసి ఉందని పేర్కొంది. -
లోయలో పడ్డ బస్సు.. నలుగురి మృతి
పండగపూట దారుణ ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని సతార్ నుంచి ముంబై వెళ్లే బస్సు ఒకటి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, లోయ చాలా లోతులో ఉండటం, బస్సు పైనుంచి పడిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పుణెగావ్ ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎంతమంది బతికి బయటపడతారన్న విషయం ఏమాత్రం చెప్పలేమని స్థానిక అధికారులు అంటున్నారు. బస్సును పైకి తీసేందుకు సహాయ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. -
విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం
-
విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం
విశాఖ: భారీ వర్షంతో పాటు, చిన్నపాటి నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు బలిగొన్నాయి. విశాఖ సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతరాత్రి భారీ వర్షం కురవటంతో గోడ కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరి గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పది అడుగుల లోతు ఉన్న...గుంతలో అయిదుగురు కార్మికులు పని చేస్తుండగా...ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలింది. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేష్, సోమేష్ గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు ఒడిశా వాసులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.