థీమ్ పార్కులో ప్రమాదం.. నలుగురి మృతి
ఆస్ట్రేలియాలోని అతిపెద్ద థీమ్ పార్కులోని వాటర్ రెయిడ్‌లో ప్రమాదం సంభవించి, నలుగురు మరణించారు. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని గోల్డ్ కోస్ట్ టూరిస్ట్ జిల్లాలోని డ్రీమ్‌వరల్డ్ థీమ్ పార్కులో ఈ ప్రమాదం జరిగింది. 'థండర్ రాపిడ్స్ రివర్ రెయిడ్' అనే నీటి రెయిడ్‌లో అందరూ ఉండగా.. ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రమాదం జరగడంతో అక్కడున్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ రెయిడ్‌లో కన్వేయర్ బెల్టు, ఆరుగురు వ్యక్తులు ఒకేసారి కూర్చోగల సర్క్యులర్ రాఫ్టులు ఉపయోగిస్తారు. అయితే కన్వేయర్ బెల్టు తెగిందా.. లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మిగిలిన వివరాలను మీడియా సమావేశంలో తెలియజేస్తామని పోలీసులు అన్నారు.