పెళ్లి అయిన నెలకే ఆ ఇంట శుభవార్త.. కడుపు పండిందన్న వార్తతో ఆ రెండు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఐదో నెలలో మెట్టినింట సంతోషాల మధ్య సీమంతం నిర్వహించారు. వేడుక పూర్తి అయిన తరువాత పుట్టింటికి తిరుగు ప్రయాణమైన ఆ గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఆమెతోపాటు కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు.