pregnentdead
-
విషాదంలో అద్భుతం..లారీ తొక్కి గర్భిణీ మృతి.. సజీవంగా శిశువు జననం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విషాదంలో అద్భుతం జరిగింది. లారీ టైర్ల కిందపడి ఎనిమిది నెలల గర్భిణీ మృతి చెందగా ఆమె పొట్టలోని శిశువు మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడింది. ఆ పసికందును హుటాహుటిన ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ పాపకు కేవలం సాదారణ చికిత్స అవసరమని తెలిపారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని బర్తపారా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలు ఆగ్రాకు చెందిన కామిని(26)గా పోలీసులు గుర్తించారు. తన తల్లిగారింటికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బాధితురాలి భర్త లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కామిని రోడ్డుపై పడిపోయిందని, లారీ ఆమెపై నుంచి వెళ్లినట్లు చెప్పారు. తల్లి పొట్టలోంచి బయటపడిన చిన్నారి ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం శిశువు, ఆమె తండ్రి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు లారీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఎస్హెచ్ఓ. త్వరలోనే లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామన్నారు. సంఘటన జరిగిన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. లారీ టైర్ల కింద పడి తల్లి నుజ్జునుజ్జయినా.. పొట్టలోని శిశువు ప్రాణాలతో బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు. ఇది ఒక అద్భుతంగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృత్యువాత
-
సీమంతం రోజునే తిరిగిరాని లోకాలకు..
యడ్లపాడు (చిలకలూరిపేట)/గుంటూరు రూరల్: పెళ్లి అయిన నెలకే ఆ ఇంట శుభవార్త.. కడుపు పండిందన్న వార్తతో ఆ రెండు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఐదో నెలలో మెట్టినింట సంతోషాల మధ్య సీమంతం నిర్వహించారు. వేడుక పూర్తి అయిన తరువాత పుట్టింటికి తిరుగు ప్రయాణమైన ఆ గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఆమెతోపాటు కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం యడవల్లికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెం దిన తంగేళ్ల శ్రీనివాసరావు, అనసూర్య కుమార్తె జయశ్రీ (19)తో ఆగస్టులో వివాహమైంది. జయశ్రీ 5 నెలల గర్భవతి కావడంతో ఆమెకు సీమంతం నిర్వహించడానికి తల్లి అనసూర్య (40), బంధువు సుంకర రమాదేవి (37), ఆమె కుమార్తె రమ్య (18) సోమవారం వెళ్లారు. పండుగ వాతావరణంలో సీమంతం నిర్వహించారు. వారిని తీసుకువచ్చేందుకు రమాదేవి కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45కు కారులో వెళ్లారు. జయశ్రీని వెంటబెట్టుకుని గోరంట్లకు వస్తుం డగా తిమ్మాపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. 12.30కు జరిగిన ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న జయశ్రీ, అనసూర్య అక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, అతని పక్కన కూర్చున్న ఫ్రాన్సిస్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల, ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో పండుగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి. అతివేగం.. విపరీతమైన మంచు.. ట్రాక్టర్ ట్రాలీకి వెనుక భాగంలో రేడియం స్టిక్కరు లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బస్సు బీభత్సం
డాబాగార్డెన్స్: నగరంలోని జడ్జికోర్టు రోడ్డులో ఆర్టీసీ సిటీ బస్సు అదుపు తప్పి బీభత్సం సష్టించింది. ఈ సంఘటనలో ఒక నిండు గర్భిణి అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఒక ఆటో నుజ్జునుజ్జు కాగా, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక తోపుడు బండి ధ్వంసమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి వస్తున్న 20ఎ నెంబర్ సిటీ బస్సు జడ్జికోర్టు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద పూర్తిగా అదుపు తప్పింది. రోడ్డుకు ఎడమవైపు నుంచి వెళ్తున్న ఒక్కసారిగా కుడివైపునకు తిరిగి అక్కడి బస్టాపులో ఉన్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది. మధురవాడ స్వతంత్రనగర్‌కు చెందిన తొమ్మిది నెలల నిండు గర్భిణి నూకరత్నం కడుపుపైకి ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే కన్ను మూసింది. అదే ఊపులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక తోపుడు బండిపైకి దూసుకుపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మతి చెందిన నూకరత్నం ఆడపడుచు బి.లక్ష్మి, అక్కడే తోపుడు బండి వ్యాపారి కె.మహేష్, పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వచ్చిన పి.మాధవరావు, సీతంపేటకు చెందిన జి.వరలక్ష్మి, విద్యార్థినీ బి.కరుణ గాయపడ్డారు. ఆటో డ్రైవర్ చెల్లుబోయిన కష్ణమూర్తి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన వారిని 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. నూకరత్నం మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వాల్సిన తరుణంలో.. మరో మూడు నాలుగు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నూకరత్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భర్త కనకరాజు భోరున విలపించాడు. కళ్లేదుటే భార్య ప్రమాదానికి గురై మరణించినా ఏమీ చేయలేకపోయానంటూ రోదించాడు. తన రెండేళ్ల కుమారుడు లిఖిత్‌ను పట్టుకుని కనకరాజు రోదిస్తున్న తీరును చూసిన వారు కంటతడిపెట్టారు. కనకరాజు చెంగల్రావుపేటలో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట మధురవాడ స్వతంత్రనగర్‌కు చెందిన నూకరత్నంతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు లిఖిత్ ఉన్నాడు. నూకరత్నం గర్భిణి కావడంతో స్వతంత్రనగర్లోని పుట్టింటికి వెళ్లింది. ప్రతి నెలా ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆస్పత్రికి పరీక్షల కోసం వచ్చి వెళ్తోంది. అదేమాదిరిగా శుక్రవారం ఉదయం ఆడపడుచు లక్ష్మిని వెంట పెట్టుకుని ఘోషాసుపత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో మూడు, నాలుగు రోజుల్లో డెలివరీ కావచ్చని చెప్పారు. అక్కడి నుంచి చెంగల్రావుపేటలో ఉంటున్న భర్త కనకరాజు ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం కనకరాజు తన ఆటోలో మధురవాడలో ఉన్న అత్తింటికి బస్సులో పంపేందుకు వారిని జగదాంబ జంక్షన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ రద్దీగా ఉండడంతో జడ్జికోర్టు వద్దకు తీసుకొచ్చాడు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో దారుణం జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు నూకరత్నంతోపాటు గర్భస్థ శిశువు పాలిట మత్యువుగా మారింది. ఈ ప్రమాదంలో నూకరత్నం రెండేళ్ల కుమారుడు లిఖిత్, ఆమె ఆడపడుచు లక్ష్మి, కుమారుడు జస్వంత్ సురక్షితంగా బయటపడ్డారు. లక్ష్మి తన కుమారుడ్ని, కనకరాజు తన కుమారుడు లిఖిత్‌ను ఎత్తుకోవడంతో పిల్లలిద్దరూ దక్కారు. ఆటో లేకపోతే.. ఆ సమయంలో అక్కడ ఆటో లేకపోయి ఉంటే ఐదారుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. బస్సు స్పీడును చాలా వరకు ఆటో ఆపగలిగింది. ఆటో వెనుక ఉన్న పలువురు ప్రయాణికులు దూసుకొస్తున్న బస్సును గమనించి వెనుక ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు