
కూలిన భవనం: నలుగురి మృతి
పశ్చిమ బెంగాలు డార్జిలింగ్లో శనివారం ఓ భవనం కుప్పకూలింది.
కోల్కతా : పశ్చిమ బెంగాలు డార్జిలింగ్లో శనివారం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.