న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
అయితే ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగానే భనం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల కారణంగా పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిధిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
Delhi | A house collapsed in Karol Bagh area. A total of 5 fire tenders rushed to the site. Some portion of the building collapsed and some persons are suspected to be trapped under the debris. Further details awaited: Delhi Fire Services
(Source: Delhi Fire Services) pic.twitter.com/7NbRmqn2yN— ANI (@ANI) September 18, 2024
Comments
Please login to add a commentAdd a comment