దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జరీచేసింది. ఆగస్టు 22 ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలో ఆగస్టు 20 నుండి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
VIDEO | Delhi: Heavy rainfall lashes parts of the national capital. Visuals from Janpath.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/4XCCXwHrBN— Press Trust of India (@PTI_News) August 20, 2024
Comments
Please login to add a commentAdd a comment