Darjeeling
-
జానపద కళాకారులతో నృత్యం చేసిన సింగపూర్ రాయబారి
పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్‌లో జరిగిన జీ20 సమావేశంలో అక్కడ జానపద కళాకారులతో కలిసి సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ డ్యాన్స్ చేశారు. ఈ మేరకు డార్జిలింగ్‌లో మూడు రోజుల జీ20 వర్కింగ్ సమావేశాలు సందర్భంగా భారత్‌లోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో జానపద కళకారులతో కలిసి కాలు కదిపారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే సంవత్సరాలలో టీ టూరిజం మరింత పెరుగుతుందన్నారు. పర్యాటకం కోసం మా రెండో సమావేశం డార్జిలింగ్‌లో జరిగింది. ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా దీని ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అని అన్నారు. మొదటి రోజు ఈవెంట్లో భాగంగా ప్రతినిధులు టీ తీయడం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీ20 ఛీఫ్ కో ఆర్టినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశం గురించి తెలియజేయాలన్న మోదీ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. జీ20 సమావేశాలు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదని, భారత్‌లని మిగతా ప్రదేశాల్లోని వారసత్వం, సంస్కృతి, అందం, గొప్పతనం గురించి కూడా విదేశీ ప్రతినిధులు తెలసుకోవాలని ష్రింగ్లా చెప్పారు. ఈ క్రమంలో సింగపూర్ రాయబారి ట్విట్టర్ వేదికగా నాటి కార్యక్రమాన్ని ఉద్దేశిసస్తూ.. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అది ఒక అద్భుతమైన సాయంత్రం. రాత్రి చందుడి వెలుగులో టీని కోయడం అనేది హైలెట్‌గా నిలిచిందని అన్నారు. కాగా, భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3, 2023 వరకు రెండో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది. దాదాపు 130 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మూడు రోజుల సమావేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే మార్గాలపై జీ20 సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. (చదవండి: రేపే జైలు శిక్షను సవాలు చేస్తు రాహుల్ పిటిషన్!) -
మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్ నేత రాజీనామా!
దేశంలో రాజకీయ సమీకరణాలు జెట్ స్పీడ్‌లో మారుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీకి మారుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకయ్యారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రక్ మోర్చా (బీజీపీఎం) ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడంపై మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ ఆయన పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, డార్జిలింగ్ మున్సిపాలిటీలో ఓట్లేసిన ప్రజలను అవమానించేలా అక్రమంగా అధికార మార్పిడి జరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే బీజీపీఎం తీరును తీవ్రంగా ఖండించారు. కాగా, అంతకుముందు.. తృణమూల్ మిత్రపక్షం, అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం బుధవారం.. అమ్రో పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేసింది. అనంతరం.. మున్సిపాలిటీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. దీన్ని బినోయ్ తమాంగ్ తప్పుబట్టారు. ఈ సందర్బంగా డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సంచలన కామెంట్స్ చేశారు. టీఎంసీ తనపై ఎలాంటి చర్యలు తీసుకున్న ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో డార్జిలింగ్ మున్సిపాలిటీలో అజయ్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని అమ్రో పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దానికి విరుద్దంగా నేడు బీజీపీఎం అధికారాన్ని కైవసం చేసుకుంది. Binoy Tamang says that he has "secluded" himself from All India Trinamool Congress from today. "Democracy in Darjeeling is under great threat now...I am ready to accept any disciplinary action if the party impose on me at anytime," he writes in his statement. (file pic) pic.twitter.com/hzeRdbvMOO — ANI (@ANI) December 28, 2022 -
అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?
ఇటీవల ఆస్కార్ వేడుకలలో నటుడు విల్ స్మిత్ భార్య జాడా స్మిత్ పై వేసిన జోక్ ఎదురు తిరిగింది. స్త్రీలకు వచ్చే అరుదైన సమస్య బట్టతల. జాడా స్మిత్ ఆ సమస్యతో బాధ పడుతోంది. ఇండియాలో కూడా ఈ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్థితిని స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న వారు ఉన్నారు. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల పరోతిమ గుప్తా తమ జీవితం ఎదుటి వాళ్లకు జోక్ కాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఆమె కథ. ఆడుతూ పాడుతూ ఉండే పదేళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచే సరికి దిండంతా ఆ అమ్మాయి జుట్టుతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? పరోతిమ గుప్తాకు అలా జరిగింది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. డార్జిలింగ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. వాళ్ల నాన్న, అమ్మలది కోల్కటా. నాన్న టీ ప్లాంటేషన్లలో పని చేసేవాడు కాబట్టి ఒక్కోసారి ఒక్కోచోట ఉండాలి కాబట్టి పరోతిమను, ఆమె చెల్లెల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచి చదివించేవారు. పరోతిమ క్లాసులు బాగా చదివేది. డిబేట్లు గెలిచేది. స్టేజ్ మీద భయం లేకుండా ఉండేది. అలాంటిది ఒక ఉదయం ఇలా జరిగే సరికి బెంబేలెత్తిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు. డాక్టర్ల దగ్గరకు తిరిగారు. ‘ఇలా టైఫాయిడ్ వల్ల జరుగుతుంది’ అన్నాడో డాక్టరు. కాని అప్పటికి పరోతిమకు టైఫాయిడ్ రాలేదు. మరేంటి? చివరకు సిలిగురిలో ఒక డాక్టరు దీనిని ‘అలోపేసియా అరెటా’ (పేనుకొరుకుడు/ఆటోఇమ్యూన్ డిసీజ్) అని కనిపెట్టి వైద్యం మొదలెట్టాడు. అలా పదేళ్ల వయసు నుంచి పరోతిమ జీవితంలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది. మందే లేని జబ్బు అలోపేసియా వల్ల హఠాత్తుగా జుట్టు రాలిపోతుంది. ఇది తల మీద కొన్ని ప్రాంతాల్లో జరగొచ్చు. పూర్తిగా కూడా జరగొచ్చు. కొన్నిసార్లు కొన్నాళ్ల తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. కొందరికి రాదు. ‘పదేళ్ల వయసు నాకు. ఏమీ అర్థం కాలేదు. డాక్టరు ఎన్నో మందులు రాశాడు. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు పొడిచాడు. కొందరేమో ఆయుర్వేద తైలాలు అని, హోమియోపతి మందులు అని. ఎప్పుడూ నా తల మీద అల్లం, వెల్లుల్లి గుజ్జు రాసి ఉండేవారు. ఇంకేవో కంపు కొట్టే నూనెలు. ఎప్పుడూ వాసన కొడుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు స్కూలుకు వెళ్లాను. అది ఇంకా ఘోరమైన అనుభవం. పిల్లలు నన్ను వెక్కిరించేవారు. కొందరు నాకొచ్చింది అంటువ్యాధి ఏమోనని దగ్గరకు వచ్చేవారు కాదు. స్టేజ్ ఎక్కి నేను ఏదైనా మాట్లాడాలంటే వెళ్లలేకపోయేదాన్ని. మగపిల్లలు నాతో అసలు మాట్లాడేవాళ్లు కాదు. ఇంట్లో బాత్రూమ్లో దూరి గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్, టీచర్లు నాకు గట్టి ధైర్యం చెప్పారు. వాళ్ల వల్ల నిలబడ్డాను’ అంటుంది పరోతిమ. ఇంటర్లో వెలుగు అయితే పరోతిమ ఇంటర్‌కు వచ్చేసరికి జుట్టు మళ్లీ రావడం మొదలెట్టింది. లోపల ఒకటి రెండు పాచెస్ ఉన్నా కొంచెం కవర్ చేసుకునే విధంగా ఉండేది. పరోతిమ కోల్కటాలో డిగ్రీ, పి.జి. చేసింది అక్కడే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ వైద్యం కఠినతరంగా ఉండేది. ఇంజెక్షన్లు ఉండేవి. వాటన్నింటిని ఆమె భరించింది. ఇప్పుడు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా మారింది. కొత్త ఉద్యోగం. స్ట్రెస్. 2007లో మళ్లీ పూర్తిగా జుట్టు రాలడం మొదలయ్యింది. ‘ఇక ఈ హింస చాలు. నాకు జట్టు లేదు... రాదు అనే స్థితిని నేను స్వీకరించి మిగిలిన జీవితం సాధారణం గా గడపడానికి నిశ్చయించుకున్నాను’ అంటుంది పరోతిమ. ‘నేను నా చెల్లెల్ని తోడు పిలిచాను. పద నేను గుండు గీయించుకోవాలి అన్నాను. శిరోజాలు లేని నా ముఖాన్ని చూసి తట్టుకోవడానికే నా చెల్లెల్ని తోడు చేసుకున్నాను. కాని శిరోముండనం అయ్యాక నాకు హాయిగా అనిపించింది. ఇక మీదట ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను.’ అందామె. అయితే ఈ ఆకారాన్ని చూసి సానుభూతి, అనవసర ప్రశ్నలు రాకుండా ఉండేందుకు తాను పని చేసే చోటులో అందరికీ ఈమెయిల్ ద్వారా తన అరుదైన జబ్బు గురించి తెలిపి ఆ చర్చను ముగించింది. ‘ఇప్ప టికీ కొందరు వింతగా చూస్తారు. గాంధీలా ఉన్నావ్ అంటారు. ఇలా ఉన్నా నీ లుక్స్ బాగున్నాయి అంటారు. కొందరు నీ తల తాకి చూడమంటావా అంటారు. అందరికీ తగిన సమాధానం చెప్పి ముందుకు పోతుంటాను’ అంటుంది పరోతిమ. ఆస్కార్ అవార్డ్స్‌లో జాడా స్మిత్ మీద జోక్ వేయడాన్ని ఆమె తప్పు పట్టింది. ‘మా జీవితం ఏ మాత్రం జోక్ కాదు’ అంది. ఎదుటి వాళ్ల వెలితిని హాస్యం చేయకూడని సంస్కారం అందరం అలవర్చుకోవాలి. -
గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర సాధన కోసం దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఎట్టకేలకు తన ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. నేపాలీ మాట్లాడే గూర్ఖాలు అధికంగా నివసించే పశ్చిమబెంగాల్లోని పర్వత ప్రాంత సమ్మిళిత అభివృద్ది కోసం ‘రాజకీయ’ పరిష్కారం చూపాలని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి డిమాండ్‌చేశారు. ‘ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వదులుకుంటున్నాం. బెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాలు ఇకపై మమేకం అవుతారు. పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారు’ అని రోషన్ చెప్పారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న సీఎం మమతా బెనర్జీతో హమ్రో పార్టీ సభ్యులతో కూడిన జీజేఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. జీజేఎం నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. ప్రజా మద్దతు కోల్పోయే జీజేఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని కుర్సేంగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్ శర్మ అన్నారు. జీజేఎంకు ఆయువుపట్టు లాంటి డార్జిలింగ్ ప్రాంతంలో హమ్రో పార్టీ హవా పెరిగిందని, ముఖ్యంగా డార్జిలింగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జీజేఎం పంథా మారిందని శర్మ వ్యాఖ్యానించారు. -
Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..
సైకిల్ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో. బీహార్ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్ మీదుగా హిమాలయన్ సైక్లింగ్ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అడగడుగునా ఆహ్వానాలు.. సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్ ప్రయాణంలో నేను బీహార్ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది. పేదరికంలో పెరిగినా.. సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్ వేసుకొని సైకిల్ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత. శ్రుతి రావత్‌తో కలిసి.. డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్ రైడింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్ రైడర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది. ‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్ అటు నుంచి ట్రాన్స్ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి. -
ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు!
మార్పు అనేది ఓ కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే హోటల్ రంగంలో కూడా ఆ మార్పు మొదలైంది. మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వివిధ పనులపై వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. దీంతో చిన్న చిన్న హోటల్స్ నుంచి ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు వచ్చేశాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా గడిచిన కాలాన్ని అంత తొందరగా మరచిపోనివ్వదు చరిత్ర. అలాగే కొన్ని భారతీయ హోటల్స్‌కు ఓ వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. వాటి వివరాల ఏంటో ఓ సారి చూద్దాం.. పర్వతాలను చూస్తూ.. ఓ పట్టు పట్టొచ్చు! పశ్చిమ బెంగాల్‌లోని గ్లెనరీ అనే రెస్టారెంట్ డార్జిలింగ్‌లోని కొండ పట్టణ ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటి. దీనికి 130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి భోజనం అద్భుతంగా ఉంటుదని వినికిడి. విందు ఏర్పాటు కోసం ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా గ్లెనరీలో బేకరీ కూడా ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో పర్వతాలను చూస్తూ విందు ఆరగించడానికి ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాల చరిత్ర ముంబైలోని లియోపోల్డ్ కేఫ్ రెస్టారెంట్, బార్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగ్రవాదులు 2008 వ సంవత్సరంలో జరిపిన ముంబై దాడుల లిస్టులో ఈ రెస్టారెంట్ ఉండటంలో దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆ భయంకరమైన దాడులకు సంబంధించి భద్రపరిచిన బుల్లెట్ గుర్తులను రెస్టారెంట్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులకు, స్థానికులకు ఎంతో ఇష్టమైనది. ప్రసిద్థ వ్యక్తులు చేతుల మీదుగా.. కోల్‌కతాలోని ఈ ఇండియన్ కాఫీ హౌస్‌ను ప్రసిద్థ వ్యక్తులు సత్యజిత్ రే, మృణాల్ సేన్, అమెరికన్ కవి అలెన్ గిన్స్బర్గ్ 1876లో స్థాపించారు. అయితే ఆల్బర్ట్ హాల్ అనే పేరు గల ఈ రెస్టారెంట్‌ను 1947 తర్వాత కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ టుండే కబాబీ తినుబండాగారానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ టుండే కబాబీ 115 సంవత్సరాల పురాతనమైనది. దీన్ని 1905లో ప్రారంభించారు. ఇక్క 125 రకాల వంటకాలు దొరుకుతాయని చెబుతారు. ఇక్కడి కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయని ప్రతీతి. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
రారండోయ్.. డార్జిలింగ్ పిలుస్తోంది!
సాక్షి ప్రతినిధి, డార్జిలింగ్ : డార్జిలింగ్.. పశ్చిమబెంగాల్లో సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం. హిమాలయ పర్వత పాదాల్లో ఉండే ఈ ప్రాంతం.. బ్రిటీష్ కాలం నుంచే కాఫీ, టీ, పర్యాటకానికి, విడిదికి ప్రసిద్ధి. ఊటీ, కొడైకెనాల్, కర్ణాటక పశ్చిమ కనుమలు, సిమ్లా, కశ్మీర్‌కు.. ఇక్కడి భౌగోళిక వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలు ఏటవాలుగా ఉంటే.. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లకు మధ్యలో ఉంటుంది. భారతదేశ చికెన్ నెక్‌ను కలిపే సిలిగురి, డార్జిలింగ్ చాలా దగ్గరగా ఉంటాయి. వేసవిలో రాత్రిపూట కనిష్టంగా 6 డిగ్రీలు.. పగలు గరిష్టంగా 28 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ వారు ఏనాడో గుర్తించారు ఈ ప్రాంతానికి 1814 దశకంలోనే బ్రిటీష్ వారు చేరుకున్నారు. తర్వాత గుర్ఖా రాజును ఓడించి ఈస్టిండియా కంపెనీ తమ వలస ప్రాంతంగా మార్చుకుంది. ఈ ప్రాంతం బ్లాక్ ఫర్మెంటెడ్ టీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ లాంటి అరుదైన రకాలకు డార్జిలింగ్ చిరునామా. ఈ రకాలకు యురోప్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఇక్కడ తేయాకు తోటల పెంపకాన్ని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉండే గుర్ఖా, షేర్పా ప్రజలు, మరికొందరు తెగల ప్రజలను కూలీలుగా నియమించుకుని విస్తారంగా సాగు చేసేవారు. దాదాపు 200 ఏళ్లుగా తేయాకు తోటల వ్యాపారం నిరి్వరామంగా కొనసాగుతోంది. రోడ్డు రైలు మార్గాలు అద్భుతం.. సాగుచేసిన తేయాకు తరలింపు ప్రారంభంలో కష్టమయ్యేది. దీంతో రైలు, రోడ్డు మార్గాలను నిర్మించారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ అని పిలుస్తారు. ఇది ఇండియన్ రైల్వేలో అంతర్భాగం. కానీ నేటికీ ఇది మీటర్ గేజ్‌గా ఉండటంతో దీన్ని టాయ్ ట్రైన్ అని ముద్దుగా పిలుస్తారు. మైదాన ప్రాంతమైన న్యూ జపాలాయ్, సిలిగురి నుంచి శిఖరపు అంచున్న ఉన్న డార్జిలింగ్ వరకు 79 కి.మీ. దూరం ఈ రైల్వే ఇప్పటికీ పనిచేస్తూ పర్యాటకులను అలరిస్తోంది. ఇందులో ‘గుమ్’రైల్వే స్టేషన్ 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ కావడం గమనార్హం. యునెస్కో దీన్ని గుర్తించింది. ఇండియాలో బొగ్గుతో నడిచే ఏకైక రైలు ఇదే. పాములా మెలికలు తిరిగిన రోడ్డు అంచు నుంచి వేల మీటర్ల లోతులో ఉండే లోయలను చూస్తే కలిగే ఆ ఆనందమే వేరు. ఇంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నా.. ఏ వాహనం కూడా పట్టు తప్పకుండా రోడ్డు నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ విలువలు, టైర్లు జారిపోకుండా ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు చూసి ఆశ్చర్యపోతాం. ప్రతి మూల మలుపు వద్ద వాహనాలు ప్రమాదవశాత్తూ జారిపోయినా లోయలోకి పడిపోకుండా.. 50 మీటర్ల వరకు ఏపుగా పెరిగే దృఢమైన దేవదారు వృక్షాలు పెంచారు. నేషనల్ హైవే 55గా ఈ రోడ్డు మార్గాన్ని పిలుస్తారు. సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతం నేపాల్‌కు చాలా సమీపంలో ఉంటుంది. పర్వతం అంచుకు వెళ్తే నేపాల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ దాదాపు గుర్ఖాలే ఉంటారు. వీరి మాతృభాష నేపాలీనే. మెజారిటీ హిందువులు, తర్వాతి స్థానంలో బౌద్ధులు ఉంటారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో 99 శాతం వ్యాపారులే. హోటల్, వాహనాలు, రిటైల్, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతం నుంచి నీరు, కూరగాయలు, సరుకులు, గ్యాస్ ప్రతిరోజూ పర్వతంపైకి రవాణా చేస్తారు. అందుకే ఇక్కడ ధరలు కాస్త అధికంగానే ఉంటాయి. గణపతి, శివుడి ఆలయాలు అధికం. బౌద్ధ దేవాలయాలు, అక్కడక్కడా బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన చర్చీలు కన్పిస్తుంటాయి. ఇక్కడ ఉండే ప్రధాన వర్గం నేపాలీ గుర్ఖాలు, షెర్పాలు తదితర వర్గాలు ఉంటాయి. భారత సైన్యంలో వీరికి ప్రత్యేక రెజిమెంట్లు ఉంటాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వీరిదే కీలక పాత్ర. ఒక సందర్భంలో బోస్‌ను కాపాడేందుకు బ్రిటీష్ యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వీరే మానవబాంబులుగా మారారు. అందానికి అధిక ప్రాధాన్యం! ఈ ప్రజలు సాధారణ ఎత్తు ఐదున్నర అడుగల ఎత్తు. గుండ్రటి ముఖాలు. విశాలమైన నుదురుతో తెల్లగా, అందంగా ఉంటారు. అందానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుంటారు. మహిళలు జుట్టుకు, ముఖానికి, పెదాలకు రంగు లేకుండా కనిపించరు. ఈ విషయంలో మగవారూ తక్కువేమీ కాదు. అన్నీ లేటెస్ట్‌వే వాడతారు. తమ ఇంటికి ఇంధ్రధనస్సు రంగులతో తోరణాలు ఉంటా యి. వీరి ఇళ్లపైనా రంగురంగుల జెండాలు ఎగురుతుంటాయి. డార్జిలింగ్‌లో రోడ్డుకు సమాంతరంగా ఐదు లేదా ఏడో అంతస్తు ఉంటుంది. ఏడో అంతస్తు నుంచి కిందికి వెళ్తుంటారు. ఎందుకంటే ఇంటి లోయలో పునాదులు ఉంటాయి. అందుకే, రోడ్డుకు సమాంతరంగా కట్టుకుంటూ వచ్చేసరికి అది ఐదు లేదా ఏడవ అంతస్తు అవుతుంటుంది. ఎలా చేరుకోవచ్చు? హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో శంషాబాద్ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయం వరకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి డార్జిలింగ్ తేయాకు తోటలకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాగ్డోగ్రాలో డార్జిలింగ్ కొండలపైకి చేరుకునేందుకు ట్యాక్సీలు ఉంటాయి. ఒంటిరిగా వెళ్లేవారు, ఔత్సాహికుల కోసం బైకులు కూడా కిరాయికి లభిస్తాయి. ఘాట్‌రోడ్డు అందాలు చూసుకుంటూ నిట్టనిలువునా 80 కిలోమీటర్ల దూరం ఉన్న డార్జిలింగ్ చేరుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇస్తుంది. కాగా, నగరాల్లో బోటనీ, అగ్రికల్చర్, జువాలజీ, ఆయుర్వేదం, ఎంబీబీఎస్, వెటర్నరీ, సోషియాలజీ తదితర విద్యనభ్యసించే విద్యార్థులకు డార్జిలింగ్ ఓ అద్భుత అధ్యయన కేంద్రం. అలాంటి విద్యార్థులకు సబ్సిడీతో ఇక్కడికి వచ్చేలా చేస్తే వారికి క్షేత్రస్థాయి విజ్ఞానం పెరుగుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. హోం స్టే పర్యాటకంలో భాగం చేసేలా చూస్తామని పేర్కొన్నారు. అరుదైన వృక్ష, జంతు జాలాలు.. డార్జిలింగ్‌లో కాఫీ, టీ తోటలతో పాటు ఎన్నో వేల అరుదైన వృక్ష, జంతు జాలాలకు నిలయం. ఇక్కడ ఉండే వృక్షజాతులు ఇండియాలో మరెక్కడా కనబడవు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ల ముందు అందమైన పూలు పూసే గుల్మాలు, ఆర్కిడ్స్‌ను పెంచుకుంటారు. గోడలపై అరుదైన శైవలాలు, శిలీంధ్రాలు, పరాన్న జీవి మొక్కలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు అధికంగా ఉంటాయి. వీటి రాకను తెలుసుకునేందుకు ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటారు. -
10 కి.మీ. జాగింగ్ చేసిన సీఎం!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారన్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున ట్రెడ్‌మిల్‌పై నడకతో రోజును ప్రారంభించే మమత... తొలిసారిగా డార్జిలింగ్ కొండలపై ఉత్సాహంగా జాగింగ్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్’ సందర్భంగా ఏకంగా పది కిలోమీటర్ల పాటు జాగింగ్ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. డార్జిలింగ్‌లోని కూర్సేయాంగ్ నుంచి పరుగెత్తుతూ మధ్య మధ్యలో స్థానికులను పలకరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలను మమత ప్రస్తావించారు. ఇక జాగింగ్ చేస్తున్న సమయంలో మమత వెంట ఆమె భద్రతా సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మమత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్ సందర్భంగా మన భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిఙ్ఞ చేద్దాం. పచ్చదనాన్ని కాపాడండి. పరిశుభ్రంగా ఉండండి’అని ఆమె పిలుపునిచ్చారు. -
డార్జిలింగ్‌లో జంగ్: గూర్ఖా వర్సెస్ గూర్ఖా
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ లోక్‌సభ స్థానంలో తొలిసారి ఇద్దరు గూర్ఖా నేతలు తలపడుతున్నారు. 21వ శతాబ్దం ఆరంభంలో గూర్ఖా ఆందోళన నడిపిన గూర్ఖా జన ముక్తి మోర్చా (జీజేఎం)లోని రెండు చీలిక వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో పాలక పక్షమైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. జీజేఎంలో సీనియర్ నేత, డార్జిలింగ్ ఎమ్మెల్యే అమర్‌సింగ్ రాయ్ తృణమూల్ తరఫున, మరో జీజేఎం నేత రాజూ సింగ్ బిస్తా బీజేపీ టికెట్‌పై పోటీ పడుతున్నారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ వర్గం, ఆయన పూర్వ అనుచరుడు బినయ్ తమాంగ్ వర్గం బీజేపీ, తృణమూల్ తరఫున పరస్పరం తలపడుతున్నాయి. బిమల్ గురుంగ్ వర్గం బీజేపీతో, తమాంగ్ వర్గం తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. ఇక్కడ గూర్ఖాలు, తేయాకు తోటల్లో పనిచేసే ఇతర ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పాగా వేసేందుకు తృణమూల్ ఎత్తులు.. మణిపూర్ నుంచి వచ్చి స్థిరపడిన యువనేత రాజూ బిస్తాను బీజేపీ అభ్యర్థిగా ఈసారి నిలబెట్టారు. గత రెండు ఎన్నికల్లోనూ డార్జిలింగ్ సీటును తృణమూల్ కైవసం చేసుకోలేదు. ఈ రెండు పార్టీలూ ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటుకు అనుకూలం కాదు. వాటి లక్ష్యాలు వేరు. గూర్ఖాల భూమి హక్కులకు గుర్తింపు, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం పోరాడతానని తృణమూల్ అభ్యర్థి అమర్‌సింగ్ రాయ్ చెబుతున్నారు. గూర్ఖాల ఆత్మగౌరవం కోసం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి బిస్తా ప్రచారం చేస్తున్నారు. 2009లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజస్థాన్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్, 2014లో ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా గెలిచారు. ఈసారి తప్పక డార్జిలింగ్‌లో పాగా వేయాలనే పట్టుదలతో తృణమూల్ పనిచేస్తోంది. గతంలో వరుసగా రెండుసార్లు బీజేపీ గెలిచిన కారణంగా కాషాయపక్షం ఈసారీ డార్జిలింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీకి, బీజేపీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. -
ఎనిమిది సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు కానీ...
డార్జిలింగ్ : ఆయన ఎనిమిది సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు ఓ హిమనీనదిలో పడి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పెంబా శెర్పా (47) పర్వతారోహకులలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతాన్ని 8 సార్లు అధిరోహించాడు. మకాలు, కాంచనగంగ వంటి పర్వతాలను కూడా ఎక్కాడు. కొన్ని రోజుల క్రితం పర్వత శిఖరం మీద నుంచి కిందకు దిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ససెర్ కంగ్రి అనే హిమనీనదిలో పడిపోయాడు. అప్పటినుంచి అతని జాడలేకుండా పోయింది. ఐటీబీపీ జవాన్లు, సెర్పాస్ ప్రజలు పెంబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంబా భార్య మాట్లాడుతూ.. ‘‘ఆయన జూన్ 19న మనాలికి వెళ్తునట్లు తెల్సింది. పెంబా లోయలో పడిపోయినట్లు అతని చిన్న తమ్ముడికి శనివారం ఫోన్ వచ్చింద’’ని ఆమె తెలిపింది. -
పోలీసులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర బలగాలా..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పోలీసులకు ప్రత్యామ్నాయంగా పారామిలిటరీ భద్రతా బలగాలను వినియోగించుకోవడం పట్ల కేంద్ర హోం మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులకు బదులుగా కేంద్ర బలగాలను వినియోగించుకోవద్దని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారి సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేసింది. అలాగే అంతర్గత భద్రత, నిఘా సమాచారం తదితర విషయాలపై కేంద్ర సాయుధ బలగాల అవసరంపై కమిటీ ఏర్పాటుచేసి పరిశీలించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర సాయుధ బలగాల విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్‌ఓపీఎస్)ను రూపొందించామని.. దీని ప్రకారం సరిహద్దుల భద్రత, తిరుగుబాటు, దేశ వ్యతిరేక కార్యకలపాల లాంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరార్థం కేంద్ర బలగాలను వాడుకోవాలని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయమై డార్జిలింగ్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో విధుల్లో ఉన్న సీఏపీఎఫ్ బలగాల్ని కేంద్రం ఉపసంహరించుకుంది. దీనిపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. -
డార్జిలింగ్‌లో ఉద్రిక్తత
-
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం
సాక్షి, డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ పోరాటంలో ఇకపై ఉద్యమాలు, సమ్మెలు, హర్తాల్ వంటివి చేయమని గూర్ఖా జనముక్తి మోర్చా ఆదివారం ప్రకటించింది. మూడు నెలలుగా డార్జిలింగ్‌లో నిర్వహిస్తున్న సమ్మె, బంద్‌ల వల్ల ఎటువంటి ఫలితం రాకపోవడంతో.. ఇకపై పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్లు జీజేఎం నేత బిన్నీ తమాంగ్ ప్రకటించారు. బంద్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మినహా సాధించేదేమీ లేదని చెప్పారు. దీపావళి తరువాత ఆరు ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. -
'ప్రాణాలైనా ఇస్తా, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను'
చోప్రా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభజనకు తాను ఎన్నడూ మద్దతునివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం పోరాడుతున్న డార్జిలింగ్ కొండప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో కొనసాగుతున్న నిరవధిక బంద్ 48వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఏదిఏమైనా కానివ్వండి.. నా ప్రాణాలైనా ఇస్తాను కానీ, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు మద్దుతునివ్వను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జిల్లా మన ఆస్తి. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. భారతదేశం అంటే ఇదే. దీనిని కాపాడుకోవాలి కానీ విడగొట్టకూడదు. బెంగాల్‌లోని ఇతర జిల్లాల మాదిరిగానే కొండప్రాంతాన్ని ప్రేమిస్తాను. డార్జిలింగ్ హిల్స్ పశ్చిమ బెంగాల్లో భాగం. భవిష్యత్తులోనూ అదే కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి' అని దినాజ్‌పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో జరిగిన సభలో మమత అన్నారు. డార్జిలింగ్ అభివృద్ధి కోసం తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు. -
గతాన్ని గుర్తు చేస్తున్న మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ ప్రజలు వామపక్షాలను గుర్తుచేసుకునేలా చేస్తున్నారు. సుదీర్ఘకంగా రాష్ట్రాలన్ని పాలించిన వామపక్షాల హయాంలో రానురాను అభివద్ధి కుంటుపడినప్పటికీ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండేవని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హిందు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగి, ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతుండగా, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు నిరవధిక సమ్మెను ప్రారంభించి శుక్రవారం నాటికి సరిగ్గా 30 రోజులయ్యాయి. డార్జిలింగ్ రైల్వే భద్రతా దళం కార్యాలయాన్ని, పోలీసు పోస్ట్‌ను, రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఇంటర్నెట్ సర్వీసులు మూగపోయి దాదాపు 27 రోజులు గడిచాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముస్లింలను మెప్పించేందుకు మమతా బెనర్జీ తీసుకుంటున్న చర్యలతో మండిపడుతున్న హిందూ శక్తులు రాష్ట్రంలో మత ఘర్షణలను మరింత రెచ్చగొట్టేందుకు కాచుకు కూర్చున్నాయి. తప్పుడు వార్తలకు ప్రచారం కల్పిస్తున్నాయి. ముస్లింలకు సాధికారికత కల్పించేందుకు కాకుండా, కేవలం వారిని మెప్పించేందుకే మమతా బెనర్జీ చర్యలు తీసుకుంటుడాన్ని ఇప్పటికే కలకత్తా హైకోర్టు మూడుసార్లు మందలించినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రావడం లేదు. సమాజంలో వెనకబడిన ముస్లింలకు సాధికారికత కల్పించాలంటే విద్యా, ఉద్యోగావకాశాల్లో వారికి రిజర్వేషన్ల లాంటివి కల్పించాలి. కానీ మసీదుల్లో పనిచేసే ముల్లాలకు జీతభత్యాలు ఇవ్వడమంటే ముస్లింలను మంచి చేసుకోవడానికి మాత్రమేనని సామాజిక శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1990 నాటికి చల్లబడిన గూర్ఖాలాండ్ ఉద్యమాన్ని మమతా బెనర్జీ అనవసరంగా తట్టిలేపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే భాషా విధానం ఉండాలంటూ సర్క్యులర్ జారీ చేయడం ద్వారా నేపాల్ భాష మాట్లాడే గూర్ఖాలను రెచ్చగొట్టారు. 29 శాతం ముస్లింలతో కలిపి 40 శాతం ఓటర్లు తనపక్కనున్నారని భావిస్తున్న మమతా బెనర్జీ పది శాతం కూడా లేని గూర్ఖాలను (12 లక్షల మంది) పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లున్నారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ మొత్తం బెంగాల్ రాష్ట్రం మీదకన్నేసి గూర్ఖాలాండ్పై శీతకన్నేసింది. -
కిలో టీపొడిః రూ.లక్ష
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే, ముఖ్యంగా యూరప్ దేశాల్లో డార్జిలింగ్ తేయాకుకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పశ్చిమ బెంగాల్‌లోని గూర్ఖాలాండ్ ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుండడంతో తేయాకు రెండో పంట పూర్తిగా దెబ్బతిన్నది. తేయాకును కోసే కూలీలు ఆందోళనలు చేస్తుండడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సాధారణ కిలోకు రూ.ఐదు వేల ధర ఉండే డార్జిలింగ్ టీ పొడి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.20 లక్షలు పలుకుతోంది ! మరికొంతకాలం అయితే అసలు టీపొడే దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అసోం తేయాకుకన్నా డార్జిలింగ్‌లో పండే తేయాకు ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అసోం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది. -
ప్రత్యేక గుర్ఖాల్యాండ్ డిమాండ్‌కు సీఎం మద్దతు!
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న గూర్ఖాల్యాండ్ ప్రజలకు అనూహ్య మద్దతు లభించింది. పొరుగున ఉన్న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ గురువారం ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికారు. సిక్కిం అధికార పార్టీ ఎస్డీఎఫ్ కూడా గూర్ఖాల్యాండ్ ఉద్యమానికి సంఘీభావం పలికింది. గూర్ఖాల్యాండ్ ఏర్పాటు కోసం గత ఎనిమిది రోజులుగా జీజేఎం నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. గూర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వవధిక బంద్‌తో డార్జిలింగ్ లోయ ప్రాంతంలో ప్రజాజీవనం దాదాపు స్తంభించిపోయింది. అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు సైతం నిలిపివేయడం, టీవీ కేబుళ్ల ప్రసారాలు ఆగిపోవడంతో డార్జిలింగ్ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. -
రణరంగంగా డార్జిలింగ్
► ఆందోళనల్లో ఒకరి మృతి... ► బెంగాల్ సమైక్యత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: మమత డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న గొడవలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. డార్జిలింగ్‌లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు.జూన్ 8న ఘర్షణలు మొదలైన తర్వాత నమోదైన తొలి మరణం ఇది. లెబోంగ్కార్ట్ రోడ్, చౌక్ బజార్, ఘుమ్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. 35 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ)కి చెందిన అధికారి కిరణ్ తమంగ్ సహా మొత్తం 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏడుగురు జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆందోళనలపై మమత కోల్‌కతాలో మాట్లాడుతూ ‘ఇది ఎన్నో రోజుల క్రితమే పన్నిన కుట్ర. ఒక్క రోజులో ఇన్ని బాంబులు, ఆయుధాలను ఆందోళనకారులు సమకూర్చుకోలేరు. వారి వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశాలు ఉన్నాయి. నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ బెంగాల్‌ను విడదీయనివ్వను’ అని అన్నారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు ఉద్యమం కారణంగా సింగమారిసహా డార్జిలింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. సింగమారిలో శనివారం జీజేఎం కార్యకర్తలు త్రివర్ణపతాకం, వారి పార్టీ జెండాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వెళ్లిపోవాలని కోరారు. అందుకు నిరాకరించిన జీజేఎం కార్యకర్తలు.. సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి, లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. -
డార్జిలింగ్ రగులుతోంది..
డార్జిలింగ్: ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో గుర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక బంద్ శనివారం ఆరో రోజుకు చేరింది. శుక్రవారం రాత్రి జీజేఎం ఎమ్మెల్యే అమర్ రాయ్ కుమారుడు విక్రమ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో డార్జిలింగ్‌లో జీజేఎం మద్దతుదారులు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. బిజోన్బరిలో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. జీజేఎం మద్దతుదారులు పోలీసులపై రాళ్లు, బాటిల్స్ విసరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఆందోళనకారులతో పాటు పోలీసులు సైతం గాయపడ్డారు. మరోవైపు జీజేఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమాంగ్.. తన ఇంటిపై శుక్రవారం రాత్రి పోలీసులు, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు రూట్ మర్చ్లు నిర్వహించాయి. -
గుర్ఖా లొల్లి లోగుట్టు
వేసవిలోనూ చల్లగా ఉండే పర్వతప్రాంతం ‘డార్జిలింగ్’ వానాకాలం వచ్చేసినా... ఉడుకుతోంది. ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ఇక్కడి ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపినివ్వడం... మరోవైపు శాంతిభద్రతల నిమిత్తం బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రప్పించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజానికి గూర్ఖాలాండ్ డిమాండ్ కొత్తదేమీ కాదు... వందేళ్లుగా ఉన్నదే. మరిప్పుడు ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే... రాజకీయ ఆధిపత్య పోరే కారణం. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బెంగాలీని తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ఆధిపత్యంలోని డార్జిలింగ్‌లో హింసాత్మక ఆందోళనలకు దిగారు.. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగం కూడా జరిగింది. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ప్రకటించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని ప్రకటించారు. మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఆరు పటాలాల సైన్యం, ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులను పెద్ద సంఖ్యలో డార్జిలింగ్‌లో మొహరించింది బెంగాల్ ప్రభుత్వం. కేంద్రం మంగళవారం మరో 600 మంది పారా మిలటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు తరలించింది. ► పైచేయి సాధించాలనే ఆరాటం... నిజానికి ప్రస్తుతం డార్జిలింగ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. ప్రతిపాదిత గూర్ఖాలాండ్ ప్రాంతంలో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. అయితే మమత ఈ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇతర ఆదివాసీలైన లెప్చాలు, తమంగ్స్, భూటియాలు, షెర్పాలు, మంగర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించారు. కలింపాంగ్‌ను జిల్లాగా చేస్తున్నట్లు ప్రకటించారు. గతనెల 14న నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా... మిరిక్ మున్సిపాలిటీని తృణమూల్ గెలుచుకుంది. పర్వతప్రాంతాల్లో తమకు పెట్టని కోటలుగా ఉన్నచోట్ల తృణమూల్ ఖాతాలు తెరవడం, మిరిక్‌కు కైవసం చేసుకోవడాన్ని... తన ఆధిపత్యానికి సవాల్‌గా గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరి అనే మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సెంటిమెంటును తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన. ► బీజేపీకి చెక్ పెట్టడమే దీదీ వ్యూహం.. ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో (కూచ్ బెహార్, అలీపూర్దౌర్, జల్పాయ్గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్) 2014– 2016 మధ్యకాలంలో బీజేపీ బాగా బలపడింది. 42 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిలాల్లో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉంటుందని, మైదాన ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారు కాబట్టి వీరి మద్దతు తృణమూల్‌కు లభిస్తుందని మమత లెక్క. బెంగాల్ విభజనకు మమత మొదటి నుంచి వ్యతిరేకమే. ఎన్డీయే భాగస్వామి అయిన జీజేఎం మద్దతుతోనే 2014లో బీజేపీ డార్జిలింగ్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూర్ఖాలాండ్‌ను బీజేపీ ప్రస్తావించింది. కాబట్టి బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి... ఈ జిల్లాల్లో కమలం పార్టీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైతే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. బెంగాల్ బీజేపీ నేతలు విభజనను బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం జేజీఎం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గూర్ఖాలాండ్‌కు మొగ్గితే ఉత్తరప్రదేశ్‌లో, మహారాష్ట్రలో విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయి కాబట్టి బీజేపీ ఏమీ తేల్చదు. పైగా బెంగాల్లో బలపడాలని కమలనాథులు చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే గూర్ఖాలాండ్ విభజనను ఇప్పట్లో పట్టించుకోరు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. ► 110 ఏళ్ల డిమాండ్ డార్జిలింగ్ పర్వత ప్రాంతంతో పాటు సిలిగురి, జల్పాయ్గురిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనేది డిమాండ్. భారతీయులమైనప్పటికీ... తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనందువల్ల ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా తమకూ ఒక రాష్ట్రం ఉండాలని వీరు బలంగా కోరుకుంటున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వినతిపత్రం అందింది. 1952లో నాటి భారత ప్రధాని నెహ్రూకు ఆలిండియా గూర్ఖా లీగ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం ఏర్పాటైన తొలి ఎస్సార్సీ తలుపుతట్టినా ఫలితం శూన్యం. తర్వాత ఇందిరాగాంధీ ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్ ఘీషింగ్ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్ ఉద్యమించింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. 1988 ఆగష్టు 22న ఉద్యమకారులకు, కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి... ఈ ప్రాంత పరిపాలన చూడటానికి డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటైంది. షీఘింగ్ 2008 దాకా డీజీహెచ్ఎస్కు నేతృత్వం వహించారు. బిమల్ గురుంగ్ నేతృత్వంలోని జీజేఎం బలమైన శక్తిగా ఎదగడంతో ఘీషింగ్ డార్జిలింగ్‌ను వదిలి వెళ్లారు. మరో ఉద్యమం తర్వాత గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనావిభాగం (జీటీఏ) ఏర్పాటైంది. ఆరో షెడ్యూల్లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్ తిరిగి ఎత్తుకున్నారు.– సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కడప రాయుడిని దర్శించుకున్న డార్జిలింగ్ యువతులు
కడప కల్చరల్ : కడప నగరం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని శుక్రవారం డార్జిలింగ్‌కు చెందిన పలువురు యువతులు దర్శించుకున్నారు. దాదాపు 10 మంది యువతులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాము డార్జిలింగ్ నుంచి కడప నగరంలో బీఈడీ పరీక్షలు రాసేం దుకు వచ్చామని, శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వామికి కల్యాణోత్సవం జరుగుతుందని తెలుసుకుని వచ్చామన్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం తమకెంతో ఆనందం కలిగిందని, ఇది అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. -
కూలిన భవనం.. ఏడుగురు మృతి..
డార్జలింగ్ః పశ్చిమ బెంగాల్ లో భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. డార్జలింగ్ పట్టణంలోని ఓ మూడంతస్థుల పురాతన భవనం కుప్పకూలిన ప్రమాదంలో మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ.. అమిత్ జవల్గీ తెలిపారు. పురాతన భవనం కుప్పకూలడంతో పశ్చిమబెంగాల్ డార్జలింగ్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో శిథిలాల కింద పడి ఏడుగురు మరణించగా, ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిని స్థానిక డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శిథిలాలకింద పడి చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు మహిళలే ఉన్నట్లు తెలిపారు. 1968 లో సదరు భవనం నిర్మాణం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. ఇన్నేళ్ళుగా భవనానికి ఎటువంటి రిపేర్లు చేయించలేదని, పునాదులు కూడా బాగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నాళ్ళుగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలిపోయినట్లు చెప్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికీ 2 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి వైద్యం నిమిత్తం 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాక మృతి చెందినవారి అంత్య క్రియలకోసం వారి కుటుంబాలకు ప్రత్యేకంగా 10,000 రూపాయలు వెంటనే అందించే ఏర్పాటు చేసింది. -
వరదల్లో భవనం కూలి ముగ్గురి మృతి
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో సంభవించిన వరదల్లో ఒక భవంతి కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డార్జిలింగ్ ఏరియాలోని హుస్సేన్ మురికివాడలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు నాలుగంతస్థుల భవంతి కుప్పకూలింది. ఇందులో మరి కొంతమంది చిక్కుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఉదయం అధికారులు ఆర్మీ సహాయం కోరారు. -
వరదల్లో భవనం కూలి నలుగురు మృతి
-
కూలిన భవనం: నలుగురి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాలు డార్జిలింగ్‌లో శనివారం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. -
సెక్స్ ముఠాను పట్టించిన విద్యార్థినులు
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను డార్జింలింగ్ పోలీసులకు పట్టించేందుకు ఓ పాఠాశాల విద్యార్థులు సాయం అందించారు. డిల్లీ కేంద్రంగా చేసిన ఈ ఆపరేషన్ ‘కింగ్ పిన్‘ పేరుతో అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్-పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ముగ్గురు ట్రాఫికర్స్ ను అరెస్టు చేయగా.. డార్జిలింగ్ లో నుంచి ఢిల్లీ బయలుదేరిన మరో టీమ్ రాకెట్ లో ఉన్న మిగతా వారిని అరెస్టు చేశారు. డార్జిలింగ్ లో ఓ పదిహేనేళ్ల బాలిక కొద్ది రోజులుగా కనిపించకుండా పోవడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు తీగ లాగడంతో అంతర్జాతీయ రాకెట్ గురించిన వివరాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం డార్జిలింగ్, సిక్కిం, నేపాల్ ల నుంచి ముఠా ఉద్యోగం పేరుతో బీదరికంలో ఉన్న అమ్మాయిలకు అక్రమంగా ఆధార్ కార్డులను సృష్టించి నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని బార్ లలో డాన్సర్లుగా మారుస్తూ వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నిందితులు వర్మ, సున్నీలను అరెస్టు చేయడానికి వెళ్లగా వారు నేపాల్ వైపు రోడ్డు మీదుగా తప్పించుకు పారిపోయినట్లు వివరించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నట్లు చెప్పారు. డార్జిలింగ్ లో అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసే 12 మంది అమ్మాయిలతో కూడిన పాఠశాల ఎన్జీవో బృందం నిందితులను పట్టుకోవడంలో సాయపడినట్లు తెలిపారు. గిరిజన అమ్మాయిల్లా వీరు ముఠా వద్ద నటించి వారిని బురిడీకొట్టించారని వివరించారు. వారితో పాటు బార్లలో పనిచేయడానికి ఇల్లు వదిలేసి ఢిల్లీ వచ్చినట్లు వారిని మొదట నమ్మించారని చెప్పారు. ఆ తర్వాత 15,000వేల జీతానికి బార్ లో డాన్స్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు లేవని చెప్పడంతో నిందితులు 20 నిమిషాల్లో ఆధార్ కార్డులను సృష్టించి పంపినట్లు తెలిపారు. మొదట ఓ వ్యక్తి, మహిళ ఢిల్లీలోని పనిటంకీ వద్దకు వీరిని తీసుకువెళ్లడానికి వచ్చారని వీరిని పట్టుకుని సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఆ సమాచారంతో అసలు ముఠా హెడ్ ను నేపాల్ బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
చల్ల‘ధనం’
డార్జిలింగ్ : టూర్‌దర్శన్ మండించే వేసవిలో మంచులాంటి చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? విసుగెత్తే సెలవుల్లో ఉల్లాసాన్ని కలిగించే వినోదం ఎక్కడ లభిస్తుంది? కుటుంబంతో కలిసి వెళ్లాలి. పిల్లల సరదా తీరాలి. పెద్దల మనసులు ఆధ్యాత్మిక తీరాలను తాకాలి. యువకులు ప్రకృతి కన్య సొగసుకు పరవశించిపోవాలి. మహిళలు తనివి తీరా షాపింగ్ చేయాలి. శరీరం అలసిపోకూడదు. మనసు మాత్రం మైమరచిపోవాలి. ఇవన్నీ జరగాలంటే... డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్) వెళ్లాలి. సంవత్సరమంతా ధనం సంపాదించడానికి ఆఫీసుల చుట్టూ పరుగులు తీస్తాం. కానీ వేసవిలో మాత్రం డార్జిలింగ్కి పరిగెట్టాలి. ఎందుకంటే అసలు సిసలు ధనం అక్కడే దొరుకుతుంది. అదే... చల్ల‘ధనం’! మరి వెళ్లి మూటగట్టుకోండిక... ఏం చూడాలి? డార్జిలింగ్ వెళ్లగానే మొదట చూడాల్సింది కాంచన్‌జంగా పర్వతాన్ని. ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తై పర్వతం. ఇక్కడ స్నో లెపర్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పర్వతం చుట్టుపక్కల ఉండే జలపాతాలు, తోటల అందాలు కళ్లను చెదర గొడుతుంటాయి. దాని దగ్గరే ఉన్న డార్జిలింగ్ వార్ మెమోరియల్, టైగర్ హిల్ మంచి సందర్శనీయ స్థలాలు. ఉదయం నాలుగు గంటలకు టైగర్ హిల్ మీది నుంచి సూర్యోదయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతి. డార్జిలింగ్‌లో పార్కులు ఎక్కువ. ముఖ్యంగా పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు పిల్లలను బాగా ఆకట్టు కుంటాయి. పద్మజా నాయుడు పార్కు 67 ఎకరాల విస్తీర్ణంలో, మైదానం మీది నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దేశంలో అత్యంత ఎత్తై ప్రదేశంలో ఉన్న పార్కుగా దీనికి గొప్ప పేరుంది. చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం 960.31 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ 16- సెప్టెంబర్ 15) ఈ పార్క్‌ను మూసి వేస్తారు. మిగతా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది. * డార్జిలింగ్ మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ముఖ్యంగా మహాకాల్ మందిరం. హిందూ, బౌద్ధం... రెండు మత సంప్రదాయాలనూ ఈ మందిరంలో చూడవచ్చు. ఇందులో మూడు గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలుంటాయి. వాటిని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా కొలుస్తారు భక్తులు. అలాగే పీస్ పగోడా అనే బౌద్ధాలయంలో బంగారు పూత పూసిన బుద్ధుని విగ్రహం ఉంటుంది. అక్కడ గోడలపై ఉండే రాతి శిల్పాలు బుద్ధుని జీవిత చరిత్ర చెబుతుంటాయి. * డార్జిలింగ్కి అతి పెద్ద ఆకర్షణ టీ ఎస్టేట్స్. మొత్తం 86 టీ తోటలు ఉన్నాయి. ఉత్తమజాతి తేయాకును పండిస్తారు. టీపొడి అక్కడే అమ్ము తారు కూడా. రుచి చూశాకే కొనుక్కో వచ్చు. * డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేనే ‘డార్జిలింగ్ టాయ్ ట్రెయిన్’ అంటారు. ఈ రైల్లో నుంచి హిమాలయాల అందాలను వీక్షిస్తే జన్మలో మర్చిపోలేరు. ఇది వివిధ స్టేషన్లలో ఆగుకుంటూ వెళ్తుంది. ఓ చోట 360 డిగ్రీలు తిరుగుతుంది. అప్పుడు ప్రపంచాన్నే చుట్టేసిన అనుభవం కలుగుతుంది. బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో ఈ టాయ్ ట్రెయిన్‌ను బాగా ఉపయో గించుకుంటారు. టికెట్ మనిషికి రూ.360 ఉంటుంది. ఉదయం 9:00 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ట్రెయిన్లో ప్రయాణించొచ్చు. * రోప్‌వేపై కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ డార్జిలింగ్ ఓవర్వ్యూ చూస్తుంటే... ఆ అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు! ఏం కొనాలి? డార్జిలింగ్‌లో షాపింగ్ భలే సరదాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భారతీయ వస్తువులు, దుస్తులతో పాటు టిబెట్, నేపాల్, భూటాన్ ప్రాంతాలకు చెందిన వస్తువులు, దుస్తులు కూడా విరివిగా దొరుకుతాయి. చౌరస్తా అనే ప్రాంతం షాపింగ్‌కి ప్రసిద్ధి. ఇక్కడ లేని వస్తువు ఉండదు. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, సిల్క్ దుస్తులు, ఉన్ని వస్త్రాలు రకరకాల మోడళ్లలో దొరుకుతాయి. వెదురుతో చేసిన వస్తువులైతే మతి పోగొడుతుంటాయి. ఇక్కడ దొరికే టిబెటన్ కార్పెట్లు చూస్తే కొనకుండా వదిలి పెట్టబుద్ధి కాదు. ట్రెక్కింగ్ షాప్స్ కూడా ఉంటాయి. వాటిలో ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్ వంటి వాటికి అవసరమయ్యే దుస్తులు, షూస్, రోప్స్ లాంటివి అమ్ముతారు. ‘గుడ్రికీ’ అన్న దుకాణాన్ని ద హౌస్ ఆఫ్ టీ అంటారు. ఇక్కడ రకరకాల టీపొడి అమ్ముతారు. రేట్లు మరీ ఎక్కువేమీ ఉండవు. అతి తక్కువ ధర నుంచీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, పటాలు వంటివి అమ్మే షాపులూ ఎక్కువే! ఏం చెయ్యాలి? డార్జిలింగ్‌లో పర్వతాలు ఎక్కువ. దాంతో ట్రెక్కింగ్ ప్రియులకు బోలెడంత టైమ్‌పాస్. ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్పే కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతాలన్నీ అందమైన పూల మొక్కలతో నిండి ఉంటాయి. ఆ పూల అందాలను చూస్తూ, వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేయడంలో ఉండే అనుభూతే వేరు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హిమాలయాలను అధిరోహించడానికి చాలామంది ముచ్చట పడుతుంటారు. ఎక్కగలిగినంత మేర ఎక్కి ముచ్చట తీర్చుకుంటారు. అలాగే అటవీ ప్రాంతంతో అడ్వెంచరస్ యాత్రలు చేయడం కూడా మంచి అనుభవం. అయితే దట్టమైన అడవుల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ ఉండే గైడ్స్‌ని వెంట తీసుకెళ్లడం మర్చిపోకూడదు. ఏం తినాలి? డార్జిలింగ్‌లో నేచర్ బ్యూటీనే కాదు... టేస్టీ టేస్టీ ఫుడ్‌ని కూడా చూసి రావాలి. ముఖ్యంగా మామోస్ని తినకుండా వచ్చారంటే మంచి స్నాక్‌ని మిస్సైపోయినట్టే. కూరగాయల ఫిల్లింగ్తోటీ, మాంసం ఫిల్లింగ్తోటీ కూడా చేసే ఈ స్నాక్ డార్జిలింగ్ స్పెషల్. అలాగే థుప్కా అనే టిబెటన్ నూడుల్ సూప్ కూడా చాలా ఫేమస్. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్టే పచ్చళ్లు సూపర్బ్‌గా ఉంటాయి. దోసకాయలతో పెట్టే పచ్చడి అయితే నోటిలో నీళ్లు ఊరేలా చేస్తుంది. ఆవుపాలతో చేసే చుర్పీ, మాంసంలో బ్రెడ్ పెట్టి చేసే షఫలాయ్, వెదురు బొంగుల్లో సర్వ్ చేసే తోంగ్బా అనే బీర్ లాంటి పానీయం, డార్జిలింగ్‌లో పండే స్వచ్ఛమైన తేయాకుతో చేసే టీ... వీటన్నిటినీ ఒక్కసారైనా రుచి చూడకుండా మాత్రం రాకండి. ఎలా వెళ్లాలి? ఫ్లయిట్లో: హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌లోని బాగ్దోగ్రా విమానాశ్రయానికి ఫ్లయిట్లో వెళ్లవచ్చు. రాను పోను కలిపి పదహారు వేల పైన ఉంటుంది టిక్కెట్ వెల. ప్యాకేజీ తీసుకుంటే రానుపోను విమాన ఖర్చులతో పాటు మూడు రాత్రులు, నాలుగు పగళ్లకు వసతి, భోజనం, విహార ఖర్చులన్నీ కలిపి ముప్ఫై వేల వరకూ అవుతాయి. డార్జిలింగ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చూపించే ప్యాకేజీలు ఉన్నాయి. రైల్లో: హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు నేరుగా రైళ్లు లేవు. కోల్‌కతాకు వెళ్లి, అక్కడ్నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జల్పాయ్గూర్ వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. బస్సులో: డెరైక్ట్ బస్సులు కూడా లేవు. హైదరాబాద్ నుంచి బెంగలూరు వెళ్లి, అక్కడ్నుంచి రైల్లో కానీ విమానంలో కానీ బాగ్దోగ్రా వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటికీ ఇరవై గంటల పైనే పడుతుంది. -
కొంప కూల్చేసింది.. రోడ్డు చిత్తడి చేసింది
డార్జిలింగ్: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఓ భారీ కొండచరియ వారి ఇంటిని నేలమట్టం చేసింది. దాని దాటికి ఇళ్లు నామరూపాల్లేకుండా పోయింది. దీనికితోడు ఆ ఇంటి పక్కనే ఉన్న ప్రధాన రహదారి కూడా ధ్వంసమైంది. డార్జిలింగ్ జిల్లాలోని కలింపాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిక్కింను కలింపాంగ్ ప్రాంతానికి కలిపే ఏకైక రహదారి ఇదే కావడంతో భారీ స్థాయిలో విరుచుకుపడిన కొండచరియల కారణంగా దాదాపు 300 మీటర్ల ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, నష్టం భారీ స్థాయిలో కనిపిస్తున్న ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
కొండచరియలు పడి 45 మంది మృతి
-
కొండచరియలు పడి 38 మంది మృతి
బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం 20 మందికి గాయాలు, 15 మంది గల్లంతు; ప్రధాని సంతాపం డార్జిలింగ్/సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, కలింపాంగ్, కర్సెవోంగ్ సబ్ డివిజన్లలో 38 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడగా 15 మంది గల్లంతయ్యారు. ఒక్క మిరిక్ ప్రాంతంలోనే 21 మంది మృతిచెందగా, 13 మంది గల్లంతయ్యారు. కలింపాంగ్, లావా, సుఖియా బ్లాక్, గోరుబతన్‌లలో మరో 17 మంది చనిపోయారని రాష్ట్ర విపత్తు సహాయక శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిని, బురదలో కూరుకుపోయాయి. 10వ, 55వ నంబరు జాతీయ రహదారులు దెబ్బతినడంతో సిలిగురి, మటిగరా, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. 55వ నంబర్ జాతీయ రహదారిపై నింబుజోరా వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోయింది. సెవోక్, కాలిబరి తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై చిక్కుకుపోయారు. సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) సహాయక చర్యలు చేపడుతోంది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది రోడ్లపై పడిన కొండచరియలను తొలగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్ఘటన ప్రాంతాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున, విపత్తులో నష్టపోయిన వారికి రూ. 1.25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలన మండలి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని, వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. పరిస్థితిని సమీక్షించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును రాష్ట్రానికి పంపారు. -
తేనీటీ తోటల్లో...
ఈ నెల 15న టీ డే తేయాకు తోటల స్వర్గం... డార్జిలింగ్! భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్‌స్టేషన్ డార్జిలింగ్! ఈ ప్రాంతం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే తేయాకుతోటల సౌందర్యం కళ్లారా చూసి తీరాల్సిందే! సందర్శన కోసం: ‘హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్’ డార్జిలింగ్ ఉత్తర పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 1854లో ఆంగ్లేయులు తేయాకు తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత కలకత్తాలోని ధనికులైన కొంతమంది ఈ తోటల పెంపకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సముద్రమట్టానికి 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద టీ గార్డెన్. మంగళవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఈ తేయాకు తోటల సందర్శనకు వెళ్లవచ్చు.ఎప్పుడు వెళ్లవచ్చంటే: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు అధికం కాబట్టి ఈ మాసాలలో ఈ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిది. మార్చ్ నుంచి నవంబర్ వరకు తేయాకు సేకరణలో మునిగిపోతారు. కాబట్టి ఈ మాసాలు అనుకూలం. తేయాకు తోటలకు రాజధాని... అస్సాం... మన దేశంలోని ఉత్తర ఈశాన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బ్రహ్మపుత్ర లోయలో అతి విస్తారమైన తేయాకు తోటలు ఉన్నాయి. అస్సాంలో ముఖ్య ప్రాంతమైన జొర్హాట్ లోయ మధ్య ప్రాంతాన్ని ‘ప్రపంచపు తేయాకు తోటలకు రాజధాని’గా అభివర్ణిస్తారు. సందర్శన కోసం: జొర్హ్హాట్కు దగ్గరలో గల గటూంగా టీ ఎస్టేట్‌కు చేరుకోవాలి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లుగా పర్యాటకుల కోసం గెస్ట్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి సదుపాయాలు పొందుతూనే తేయాకు తోటల పెంపకాన్ని వీక్షించవచ్చు. ఇక్కడి తేయాకు పరిశ్రమలో టీ పొడులు ఎలా తయారవుతున్నదీ తెలుసుకోవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చంటే: మే నుంచి జూన్ చివరి వరకు ఇక్కడి తేయాకు తోటల సందర్శనకు మంచి అనువైన కాలం. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇక్కడ తోయాకు తోటల పెంపకాన్ని మొదలుపెడతారు. ప్రతి యేటా నవంబర్‌లో జొర్హాట్‌లో ‘తేయాకు ఉత్సవం’ జరుపుతారు. మది దోచే తేనీటి పరిమళం... మున్నార్... భూతల స్వర్గంగా అంతా అభివర్ణించే రాష్ట్రం కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం మున్నార్! మైళ్ల కొద్ది విస్తారంగా ఉండే ఇక్కడి తేయాకు తోటల వీక్షణకు పర్యాటకులు అధికంగా వెంచేస్తుంటారు. సందర్శన కోసం: మున్నార్‌లోని ‘నల్లతన్ని ఎస్టేట్ టీ మ్యూజియమ్’ అత్యద్భుతమైనదిగా పేరుగాంచింది. సోమవారం మినహా మిగతా అన్ని రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎస్టేట్‌ను సందర్శించవచ్చు. కుండలే టీ ప్లాంటేషన్ చుట్టూ అందమైన సరస్సు, రిసార్టులు ఉన్నాయి.ఎప్పుడు వెళ్లవచ్చంటే: ఆగస్టు నుంచి మే వరకు మంచి అనువైన సమయం. డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు ఇక్కడ చలి చాలా ఎక్కువ. నిగారింపైన తోటలు... నీలగిరి పర్వతాలు... దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో నీలగిరి పర్వతశ్రేణులు దట్టమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సువాసనభరితమైన తేయాకు తోటల పెంపకానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. సందర్శన కోసం: ఇక్కడి సిమ్స్ పార్క్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ‘హై ఫీల్డ్ టీ ఫ్యాక్టరీ’ ఉంది. ఇది కూనూర్‌లోని అత్యద్భుతమైన తేయాకు పరిశ్రమగా పేరొందింది. ఇక్కడ ఇళ్లలో తయారు చేసిన తేయాకు పొడులు లభిస్తాయి. ‘తేయాకు గూడు’ అనే పేరు పొందిన ‘సింగర టీ ఎస్టేట్’ కూనూరులోనే ఉంది. నీలగిరి పర్వతశ్రేణులలోని తేయాకు తోటలను వీక్షించడానికి ఇక్కడ టాయ్ ట్రైన్ సౌలభ్యం ఉంది. కోయంబత్తూరు నుంచి కూనూర్ వెళ్లి, తిరిగి కోయంబత్తూరు చేరుకోవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చంటే: నీలగిరిలో సంవత్సరం పొడవునా తేయాకు తోటల పెంపకం ఉంటుంది. మంచి తేయాకు కావాలనుకుంటే మాత్రం చలికాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి) అనువైన సమయం. తేయాకు దేశం... వయనాడ్ కొండలపై వ్యవసాయానికే కాదు తేయాకు తోటలకూ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్. (ఇక్కడ అదనంగా కాఫీ ఇతర సుగంధ ద్రవ్యపు తోటలు కూడా ఉన్నాయి.) దక్షిణ కల్పెట్టలో ఎక్కువ తేయాకు తోటలు ఉన్నాయి. రోడ్డు మార్గాన చెంబ్రా పర్వత ప్రాంతంలో గల ప్రైవేట్ ఎస్టేట్‌నూ సందర్శించవచ్చు. సందర్శన కోసం: వయనాడు తేయాకు దేశంలో మనంతవాడిలోని ప్రియదర్శిని టీ ఎస్టేట్ పర్యాటకులకు విడిది కేంద్రంగా ఉంది. ఇక్కడి కొండలలో చెట్ల మీద గిరిజనుల ఇళ్లు కనిపిస్తాయి. అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ తప్పనిసరి. అత్యంత ఎత్తులో ఉండే గిరిజనుల ఇళ్లు మనల్ని విస్మయానికి లోనుచేస్తాయి. ఎప్పుడు వెళ్లవచ్చంటే: సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం. మిగతా రుతువుల్లో ఈ ప్రాంతం సందర్శనకు అనువైనది. మణిరామ్ దేవన్ అనే వ్యాపారి అస్సాంలో తేయాకు పరిశ్రమను నెలకొల్పాడు. విదేశాలకు ఎగుమతి చేయాలని ఇక్కడ మొదటిసారి తోటల పెంపకం చేపట్టాడు. ఆ విధంగా 19వ శతాబ్దిలో మనకు తేయాకు పరిచయం అయ్యింది.తేయాకు పరిశ్రమలో అగ్రగామిగా చలామణి అవుతున్న చైనాకు బ్రిటన్ అడ్డుకట్టవేసింది. తేయాకు తోటల పెంపకంలో చైనా విత్తనాలు, వారి పెంపకం పద్ధతులనే ఆంగ్లేయులు అవలంబించారు. తేనీరు... నోరూరు ఈ నెల 10న ఓస్లోలో ప్రపంచ ప్రముఖులంతా ఏడాదికొకసారి కలిసి చేసే విందు భోజనంలో మన దేశ పరిమళం గుబాళించింది. నోబెల్ ప్రైజ్ వేడుకల గొప్పదనం అందరికీ తెలిసిందే! ఈ ప్రత్యేక వేడుకలో ఓప్రత్యేక తేనీటిని అక్కడి అతిరథులందరికీ సర్వ్ చేశారు. ఆ ప్రత్యేకత గల తేనీరు మన దేశంలోని ఈశాన్యరాష్ట్రమైన అస్సాంకు చెందినది. ఆ విధంగా ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వేడుకలో అస్సాం టీ వార్తల్లోకెక్కింది. ఈ విందులో వడ్డించిన ప్రపంచంలోని పేరెన్నికగన్న 10,000 రకాల పదార్థాలలో మన దేశ సౌరభం అందరి ప్రశంసలు అందుకోవడం గర్వకారణం. -
ఏపీ తరహా కుట్రలు బెంగాల్ లో సాగవు:మమతా
గూర్ఖాలాండ్పై బీజేపీ, కాంగ్రెస్‌లకు మమత హెచ్చరిక ఇటాహర్ (పశ్చిమబెంగాల్): ఆంధ్రప్రదేశ్ తరహాలో పశ్చిమబెంగాల్‌ను ముక్కలు కానిచ్చేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. తాను ప్రాణాలతో ఉన్నంతకాలం రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూభాగాన్నికూడా వదిలిపెట్టే ప్రశ్నేలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో చేసిన కుట్రలను ఇక్కడ సాగనిచ్చేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ సారి ఆ పార్టీలు సఫలంకావని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం తమ భూమిని వదులుకోమని అన్నారు. బుధవారం ఇటాహర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను ఎండగట్టారు. డార్జిలింగ్ సీటునుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎస్.ఎస్. అహ్లూవాలియా, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుకు తమ పార్టీ మద్దతునిస్తుందని విలేకరుల సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో మమత ఈ రెండు పార్టీలపై మండిపడ్డారు. తెలంగాణ బిల్లు విషయంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. -
డార్జిలింగ్
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్ నుంచి ప్రతియేటా పిల్లలు భారీ సంఖ్యలో మాయమైపోతున్నారు! 'చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ (సిని)' అనే సంస్థ విడుదల చేసిన నివేదికను బట్టి చూస్తే, ఇలా పిల్లలు మాయమైపోతున్న ప్రదేశాలలో డార్జిలింగ్ అగ్రస్థానంలో ఉంది. 2012 సంవత్సరంలో డార్జిలింగ్ జిల్లాలో 924 మంది పిల్లలు మాయమైతే, 2010లో 430 మందే అదృశ్యం అయ్యారు. పైపెచ్చు, తప్పిపోతున్న వారిలో సగానికి పైగా ఆడపిల్లలే ఉంటున్నారు. డార్జిలింగ్ ప్రాంతం సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడినుంచి నేపాల్ మీదుగా వేరే దేశాలకు పిల్లలను తరలించే అవకాశం ఎక్కువగా ఉందని సిని అదనపు డైరెక్టర్ రాజీవ్ కె. హల్దర్ తెలిపారు. ఇలా సరిహద్దులకు దగ్గరగా ఉన్న జిల్లాల్లోని మారుమూల గ్రామాల నుంచి పిల్లలను ఎత్తుకుపోయి విదేశాలకు అమ్మేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఇల ఎత్తుకుపోయి వారిని ఫ్యాక్టరీలు, పొలాలు లేదా ఇళ్లల్లో పనివారిగా చేరుస్తున్నారు. ఇక ఆడపిల్లలనైతే బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలించడం, చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేయడం, లేదా వారిని భిక్షాటనలోకి దించడం లాంటివి చేస్తున్నారు. దేశంలోనే ఇలా పిల్లలు మాయమైపోతున్న రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉంది. నేపాల్, బంగ్లాదేశ్‌లతో ఈ రాష్ట్రానికి సరిహద్దు ఉండటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మొత్తం ఎంతమంది పిల్లలు తప్పిపోయినా, గట్టిగా ఆ కేసుల్లో 4 శాతం ఫిర్యాదులు కూడా రావట్లేదు. పిల్లలు తప్పిపోతే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, ఆ కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 2012 సంవత్సరంలో ఏకంగా 19 వేల మంది పిల్లలు మాయమైపోయినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది!! -
బెంగాల్ విభజన జరగదు: మమత
పశ్చిమ బెంగాల్ విభజన జరగబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. డార్జిలింగ్ కొండల్లో నిర్వహిస్తున్న నిరవధిక బంద్‌ను ఉపసంహరించుకోవాలని గుర్కా జనముక్తి మోర్చా(జీజేఎం)ను మరోసారి కోరారు. జీటీఏకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జీజేఎంకు అన్నివిధాలా సహకరిస్తామని మమత హామీయిచ్చారు. జీటీఏకు ద్వారా భూములు పంపిణీ చేశామని, వైద్యం- విద్య అందించామని, వంద రోజుల ఉపాధి కల్పన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గుర్కాలాండ్ పేరు మీదే ఇవన్నీ చేస్తున్నామని ఇంకా ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. రాష్టం విడిపోయే పరిస్థితి లేదని మమత బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ పేరుతో డార్జిలింగ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను జీజేఎం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. రోగులను తరలిస్తున్న వాహనాలకు కూడా నిప్పు పెడుతున్నారని ఆమె విమర్శించారు. -
జీజేఎం అగ్రనేత అరెస్ట్
గూర్ఖా జనమూక్తి మోర్చా (జీజేఎం) అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్‌ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతధికారులు గురువారం డార్జిలీంగ్లో వెల్లడించారు. అతనితోపాటు మరో అరుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. పశ్చిమ బెంగాల్- సిక్కిం రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్‌కు బియన్ తమంగ్ ముఖ్య అనుచరుడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో గృహదహానాలతోపాటు పలు కేసులు బిమల్ పై నమోదు అయిన సంగతిని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీజేఎం ఉద్యమిస్తుంది. అయితే జులై 30న యూపీఏ సర్కార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం అని ప్రకటించింది. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట ఉద్యమం ఊపందుకుంది. అందులోభాగంగా పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్ ప్రాంతాన్ని కూడా ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దాంతో నిత్యం ఉద్యమాలతో ఆ ప్రాంతం నిరసన సెగలు కక్కుతుంది. అయితే ఇప్పటికే జీజేఎం నేత బిమల్ గురుంగ్‌ను మమత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జులై 30 నుంచి నేటి వరకు 710 మంది జీజేఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
72 గంటల్లోగా బంద్ విరమించాలి
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఎనిమిది రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక బంద్‌ను చట్టవిరుద్ధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రకటించారు.బంద్‌ను విరమించుకునేందుకు జీజేఎంకు 72 గంటల గడువు విధించారు. బంద్‌లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రిగా తనకు కొన్ని రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నాయని మమత కోల్‌కతాలో ఏర్పాటైన మీడియా సమావేశంలో అన్నారు. ‘ఎనిమిది రోజులు సహనం వహించాను... నేను చాలా కఠినురాలిని. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పించవద్దు’ అని హెచ్చరించారు. డార్జిలింగ్ తన గుండె అని, రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని మమత తేల్చి చెప్పారు. బంద్‌ను విరమించుకుంటే, చర్చలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చర్చల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లేదా హోంశాఖ కార్యదర్శిని సంప్రదించవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా మమత విమర్శలు కురిపించారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సూచించారు. డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గంపై కన్నేసి ఎవరూ జీజేఎంతో అవగాహన కుదుర్చుకోరాదని హెచ్చరించారు. అయితే, మమత అల్టిమేటంపై గురుంగ్ తీవ్రంగా స్పందించారు. నిరంకుశత్వంతో తమను లొంగదీయాలని ఆమె భావించినట్లయితే, అది పొరపాటే అవుతుందని అన్నారు. ్ర ఆమె తన అల్టిమేటంను ఉపసంహరించుకోకుంటే ‘జనతా కర్ఫ్యూ’ను అమలు చేస్తామని హెచ్చరించారు. మమత అల్టిమేటం నేపథ్యంలో స్థానిక పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు డార్జిలింగ్‌లో భారీ ఎత్తున మోహరించాయి. జీజేఎం మద్దతుదారులు పలువురిపై అరెస్టు వారంట్లు ఉన్నాయని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డార్జిలింగ్ ఎస్పీ కునాల్ అగ్రవాల్ చెప్పారు. ఇదిలా ఉండగా, జీజేఎం కీలక నేతలు ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పాత కేసులకు సంబంధించి గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ (జీటీఏ) పాలక మండలి సభ్యుడు మహేంద్ర ప్రధాని, జీజేఎం డార్జిలింగ్ పట్టణ శాఖ అధ్యక్షుడు నారాయణ్ ప్రధాన్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డార్జిలింగ్‌లో కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత... గూర్ఖాలాండ్ ఉద్యమంపై మమత సర్కారు అణచివేత కొనసాగిస్తోంది. తాజాగా, డార్జిలింగ్ పట్టణంలోని కేబుల్ ఆపరేటర్ల సేవలను నిలిపివేసింది. తగిన పత్రాలు లేనందునే ఈ చర్య తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా, మరోవైపు కేబుల్ ప్రసారాలు నిలిచిపోవడంతో ప్రజలు ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోలేని పరిస్థితిలో పడ్డారు. అస్సాంలో ‘ప్రత్యేక’ డిమాండ్లను ఆలకించిన పాండే గువాహటి/దిఫు: అస్సాంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే శనివారం ఆలకించారు. కర్బీ ఆంగ్లాంగ్ను తెలంగాణ తరహాలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరగా, దీనిని అస్సాంలోనే స్వయంప్రతిపత్తి గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కర్బీ ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్తి రాష్ట్ర డిమాండ్ కమిటీ (కేఏఏఎస్డీసీఓఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోనియాను ఉద్దేశించి రాసిన వినతిపత్రాన్ని పాండేకు అందజేసింది. -
32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులు అరెస్ట్
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారుల చేపట్టిన బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. అయితే 32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులను గతరాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వారందరిపై గతంలోనే కేసు నమోదు అయ్యాయని, అలాగే శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉద్యమకారుల సంఖ్య 143 మందికి చేరిందని తెలిపారు. అయితే గూర్ఖాలాండ్ జనమూక్తి మోర్చ అధ్యక్షుడు బిమల్ గురంగ్ అనిత్ ధపాను ఈ నెల మొదట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ బాసుదేబ బెనర్జీ డార్జిలింగ్ హిల్స్‌లోని స్థానిక అధికారులతో కలసి శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన డార్జిలింగ్‌లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన ముఖ్యకార్యదర్శి రామదాస్ మీనాతో సమావేశమైనారు. స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఆయనకు బెనర్జీకి సూచించారు. కొల్కత్తా వెళ్లగానే డార్జిలింగ్‌లోని పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీకి నివేదిక సమర్పిస్తానని ఆయన తెలిపారు. అయితే డార్జిలింగ్ జిల్లా కలెక్టర్‌గా ఆర్థిక శాఖ సంయూక్త కార్యదర్శి పునీత్ యాదవ్‌ను నియమిస్తు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటివరకు ఆ పదవిలో ఉన్న సౌమిత్ర మోహన్‌ను బృద్వన్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
డార్జిలింగ్‌లో ఆగని ‘ప్రత్యేక’ మంటలు
డార్జిలింగ్/న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం ప్రకటించిన దరిమిలా దేశంలో పలుచోట్ల ‘ప్రత్యేక’ మంటలు వ్యాపించాయి. గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం మూడోరోజూ బంద్ కొనసాగింది. అస్సాంలో ‘ప్రత్యేక’ వాదాన్ని వినిపిస్తున్న పలు సంఘాలు సోమవారం నుంచి 1,500 గంటల బంద్ ప్రారంభించాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కలింపాంగ్‌లో గూర్ఖాలాండ్ డిమాండ్‌తో ఆత్మాహుతి చేసుకున్న గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుదారు మంగళ్‌సింగ్ అంతిమయాత్రలో జీజేఎం కార్యకర్తలు మౌనప్రదర్శనగా పాల్గొన్నారు. అట్టుడుకుతున్న అస్సాం: ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాం అట్టుడుకుతోంది. కర్బీ-అంగ్లాంగ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల్లో చెదురు మదురు ఘటనలు జరిగాయి. ‘బోడోలాండ్’ డిమాండ్ కూడా ఊపందుకుంది. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, యునెటైడ్ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ సోమవారం 1,500 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. కర్ణాటకలోనూ డిమాండ్లు: కర్ణాటకలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు మొదలయ్యాయి. 1956 వరకు సి-కేటగిరీ రాష్ట్రంగా ఉన్న కొడుగుకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్యూ నాచప్ప కొడవ హెచ్చరించారు. కాగా, కర్ణాటకలో అత్యంత వెనుకబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలని హైదరాబాద్-కర్ణాటక జనపర సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తోంది. -
ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లో 'ప్రత్యేక' హింస
ఈశాన్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యేక హింస రగులుతూనే ఉంది. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా శనివారం నుంచి ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్, కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రామమ్-రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు. మరోవైపు... అసోంలో ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. దిపు-దోల్డోలి స్టేషన్ల మధ్య పట్టాలను తొలగించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అసోంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. -
ఆగని ‘ప్రత్యేక’ హింస
దిఫు/గువాహటి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలంటూ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు హింసకు పాల్పడుతూనే ఉన్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో వివిధ బోడో సంఘాల ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అలాగే దిఫు, దోల్డోలి స్టేషన్ల మధ్య మరోసారి పట్టాలను తొలగించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం శనివారం వరుసగా రెండో రోజు కూడా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కవాతు నిర్వహించింది. మరోవైపు ప్రత్యేక బోడోలాండ్‌ను ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అస్సాంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రాష్ట్రం నుంచి తమ ప్రాంతాన్ని విభజించి కామత్పుర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆల్ కోచ్-రాజ్‌బోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్ శనివారం గవర్నర్ జె.బి. పట్నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాగా, కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో తిరిగి శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పంపిన ఇద్దరు మంత్రులు దిఫు పట్టణం చేరుకొని వివిధ రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులతో చర్చలు చేపట్టారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌ను కేంద్రానికి తెలియజేస్తామని రాజకీయ నేతలకు హామీ ఇచ్చినట్లు అనంతరం వారు విలేకరులకు తెలిపారు. కాగా, అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆందోళనకారుల డిమాండ్లను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శనివారం నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రజలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్తంభించిన డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ర్టంగా ప్రకటించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) శనివారం ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్‌తోపాటు కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, మూతపడ్డాయి. రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డార్జిలింగ్‌కు సమీపంలోని రామమ్, రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో రోజుకు 80-100 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు.