దేశంలో రాజకీయ సమీకరణాలు జెట్ స్పీడ్‌లో మారుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీకి మారుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకయ్యారు.
వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రక్ మోర్చా (బీజీపీఎం) ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడంపై మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ ఆయన పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, డార్జిలింగ్ మున్సిపాలిటీలో ఓట్లేసిన ప్రజలను అవమానించేలా అక్రమంగా అధికార మార్పిడి జరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే బీజీపీఎం తీరును తీవ్రంగా ఖండించారు.
కాగా, అంతకుముందు.. తృణమూల్ మిత్రపక్షం, అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం బుధవారం.. అమ్రో పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్‌లను కొనుగోలు చేసింది. అనంతరం.. మున్సిపాలిటీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. దీన్ని బినోయ్ తమాంగ్ తప్పుబట్టారు. ఈ సందర్బంగా డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సంచలన కామెంట్స్ చేశారు. టీఎంసీ తనపై ఎలాంటి చర్యలు తీసుకున్న ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో డార్జిలింగ్ మున్సిపాలిటీలో అజయ్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని అమ్రో పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దానికి విరుద్దంగా నేడు బీజీపీఎం అధికారాన్ని కైవసం చేసుకుంది.
Binoy Tamang says that he has "secluded" himself from All India Trinamool Congress from today.
"Democracy in Darjeeling is under great threat now...I am ready to accept any disciplinary action if the party impose on me at anytime," he writes in his statement.
(file pic) pic.twitter.com/hzeRdbvMOO— ANI (@ANI) December 28, 2022
Comments
Please login to add a commentAdd a comment