All India Trinamool Congress
-
మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్ నేత రాజీనామా!
దేశంలో రాజకీయ సమీకరణాలు జెట్ స్పీడ్‌లో మారుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీకి మారుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకయ్యారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రక్ మోర్చా (బీజీపీఎం) ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడంపై మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ ఆయన పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, డార్జిలింగ్ మున్సిపాలిటీలో ఓట్లేసిన ప్రజలను అవమానించేలా అక్రమంగా అధికార మార్పిడి జరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే బీజీపీఎం తీరును తీవ్రంగా ఖండించారు. కాగా, అంతకుముందు.. తృణమూల్ మిత్రపక్షం, అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం బుధవారం.. అమ్రో పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేసింది. అనంతరం.. మున్సిపాలిటీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. దీన్ని బినోయ్ తమాంగ్ తప్పుబట్టారు. ఈ సందర్బంగా డార్జిలింగ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సంచలన కామెంట్స్ చేశారు. టీఎంసీ తనపై ఎలాంటి చర్యలు తీసుకున్న ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో డార్జిలింగ్ మున్సిపాలిటీలో అజయ్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని అమ్రో పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దానికి విరుద్దంగా నేడు బీజీపీఎం అధికారాన్ని కైవసం చేసుకుంది. Binoy Tamang says that he has "secluded" himself from All India Trinamool Congress from today. "Democracy in Darjeeling is under great threat now...I am ready to accept any disciplinary action if the party impose on me at anytime," he writes in his statement. (file pic) pic.twitter.com/hzeRdbvMOO — ANI (@ANI) December 28, 2022 -
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
సొంతిల్లు,సొంత వాహనం లేని పశ్చిమ బెంగాల్ సీఎం
-
మమత కోసం రంగంలోకి శరద్ పవార్
ముంబై: శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద ఎప్పుడూ విమర్శలు ఎక్కుపెట్టే శరద్ పవార్ ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీకి సపోర్ట్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. వచ్చేవారం పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమవడంతో పాటు భారీ ర్యాలీకి సైతం ప్లాన్ చేస్తున్నారు. పవార్ బెంగాల్ టూర్ కోసం మూడు రోజుల పర్యాటన ఖరారైనట్లు ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇదివరకే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఎలాగైనా మమతను గద్దె దింపి రాష్ట్రంలో పార్టీ జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మిథున్ చక్రవర్తి, గౌతమ్ గంభీర్‌తో రోడ్‌షో కూడా చేయించనుంది. చదవండి: అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయరు: శరద్ పవార్ వాళ్లే ‘పరాయి శక్తులు’! -
దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి
కోల్‌కతా: పార్టీ సైద్ధాంతిక భావజాల వ్యాప్తికే కాక, దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు కూడా బీజేపీ బెంగాల్లో గెలిచి తీరాలని, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవడంపై ఘోష్ మాట్లాడుతూ కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల నుంచి చేరికలు అవసరమని అంగీకరించారు. బీజేపీ భావజాలం, ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ బీజేపీకి బలమని, అయితే వివిధ స్థాయిల్లో పాపులర్ వ్యక్తులు లేకపోవడం రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటోన్న లోపమని దిలీప్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలోని పలు అంశాలు ఆయన మాటల్లోనే.. తృణమూల్ విఫలం.. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఈ గడ్డపై పుట్టినవాడు కనుక పశ్చిమబెంగాల్లో గెలుపు బీజేపీకి కీలకం. దేశ భద్రత గెలుపుతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చాలాకాలం ఎదురుచూశాం. ఇక్కడ గెలుపు మా లక్ష్యం, అదే మాకు సవాల్ కూడా. కశ్మీర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం శాంతిని స్థాపించగలిగింది. అయితే దేశంలో అశాంతిని సృష్టించే ఉగ్రవాదుల చొరబాటుకి తూర్పుసరిహద్దులు కేంద్రంగా మారాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. 2011 ఎన్నికల్లో ఓటు వేసి, గెలిపించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. తృణమూల్ పార్టీ ప్రజలకు ద్రోహం చేసింది. పాపులర్ ఫేసెస్ కావాలి.. వందలాది మంది పార్టీ కార్యకర్తల త్యాగాలూ, రాష్ట్రంలో కార్యకర్తల తిరుగులేని స్ఫూర్తి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. అయితే పార్టీలో వివిధ స్థాయిల్లో పాపులర్ ముఖాలు లేకపోవడం పార్టీకి లోపం. రాష్ట్రంలో అధికార పార్టీకి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అయితే అది ఆ పార్టీ సమర్థత మాత్రం కాదు, గత పదేళ్ళుగా వారు అధికారంలో ఉన్నందువల్లనే. పార్టీలో పాత తరం వారికీ, కొత్తవారికీ మధ్య విభేదాలు పార్టీని ప్రభావితం చేయవు. పార్టీ నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. రాజకీయాల్లో కొన్ని తప్పవు.. పశ్చిమబెంగాల్లో బీజేపీ రోజు రోజుకీ బలోపేతం అవుతోంది. తృణమూల్ కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారని, ఒకవేళ మేం వారిని చేర్చుకోకపోతే, మేం ఎలా పురోగతిని సాధిస్తాం. అందరికీ టిక్కెట్రాదు. కొందరు మాత్రమే అభ్యర్థులుగా నిలబడతారు, మిగిలిన వారు వారికి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. అయితే ఏ ఒక్కరూ పార్టీకన్నా గొప్ప వాళ్ళు కాదు. ఎన్నికల రాజకీయాల్లో కొన్ని తప్పవు. ప్రజాస్వామ్యంలో నంబర్ కీలకపాత్ర పోషిస్తుంది. మేం ఆ సంఖ్యను పొందాలంటే పార్టీలో చేరికలు అవసరం, వారి మద్దతుదారులు కూడా మా పార్టీలోకి వస్తారు. టీఎంసీ అవినీతి పార్టీ... 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ కంటే కేవలం నాలుగు సీట్లు తక్కువగా బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి 26 మంది శాసన సభ్యులు, ఇద్దరు ఎంపీలు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)నుంచి ముగ్గురు శాసన సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరికలు పార్టీ అవినీతి రహిత పోరాటంపై ఎటువంటి ప్రభావం చూపవు. గతంలో వారున్న పార్టీ అవినీతి పార్టీ, అందుకనుగుణంగానే వారు ఆ పార్టీలో పని చేశారు. అయితే బీజేపీలో చేరాక, మా పార్టీ సూత్రాలకనుగుణంగా వారు పనిచేస్తారు. పార్టీలో చేరిన వాళ్ళందరికీ టిక్కెట్టు ఇవ్వరు. వారి గెలుపు అంచనాలను బట్టి మాత్రమే పార్టీ టిక్కెట్టు ఇస్తారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులం దరికీ టిక్కెట్టు ఇవ్వాలని ఏమీ లేదు. కేవలం పార్టీ సిద్దాంతాలను, భావజాలాన్ని, బీజేపీ విధానాలను చూసే ప్రజలు పార్టీకి ఓటేస్తారు తప్ప, పార్టీలో చేరిన వారిని చూసి కాదు. తృణమూల్ కాంగ్రెస్ కారణంగా రాష్ట్రంలో మత రాజకీయాలు పెరిగాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. అయితే మాకు బలమున్న రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించం, ఎక్కడైతే మేం బలహీనంగా ఉంటామో అక్కడ కొన్నిసార్లుసీఎం అభ్యర్థిని ముందుకు తెస్తాం, యిప్పుడు పశ్చిమబెంగాల్లో మాది బలమైన పార్టీ. మిథున్ చక్రవర్తి సీఎం అభ్యర్థి కాదు ‘ఇటీవల పార్టీలో చేరిన మిథున్ చక్రవర్తి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. నేను బీజేపీలో నమ్మకస్తుడైన సైనికుడిని, నాకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. పశ్చిమ బెంగాల్లో స్థానికులు, స్థానికేతరులు అనే చర్చపై టీఎంసీకి మాట్లాడేందుకు ఏమీ లేదు. మాది ఒక జాతీయ పార్టీ, మాకు సాయం చేయడానికి మా నాయకులు ఇక్కడకు వస్తారు’ అని ఘోష్ సర్దిచెప్పుకున్నారు. -
‘ఆపరేషన్ బెంగాల్’
సాక్షి , న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి మొదలుకావడంతో ప్రచారం జోరందుకుంది. అధికారపీఠంపై కాషాయ జెండా ఎగరనీయకుండా అడ్డుకొనేందుకు దీదీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు మమతా బెనర్జీ దూకుడును ఆపేందుకు కమలదళం తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. సీపీఐ(ఎం) కంచుకోట సిలిగురిపై తమ జెండాలను ఎగురవేసేందుకు ఒకవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన సిలిగురి అసెంబ్లీ నియోజవర్గంపై ప్రతీ పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ 6 సార్లు, వామపక్షాలు తొమ్మిదిసార్లు, టీఎంసీ ఒకసారి విజయం సాధించింది. ఇప్పటివరకు సిలిగురిలో బీజేపీ ఇంకా బోణీ కొట్టలేదు. భిన్న రాజకీయ వాతావరణం.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి అసెంబ్లీతో సహా డార్జిలింగ్ జిల్లాలోని మొత్తం 5 స్థానాల్లో ఐదవ దశలో ఏప్రిల్ 5 న ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సీటును ఎవరు ఆక్రమించుకుంటారనే అంశంపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 1951కి ముందు సిలిగురి, కుర్సేంగ్లతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. 1951 నుండి 2016 వరకు ఈ అసెంబ్లీ స్థానంలో వామపక్షాల అభ్యర్థులు 9 సార్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది. పశ్చిమ బెంగాల్లో మొదటి అసెంబ్లీ ఎన్నిక 1951 లో జరిగింది. అప్పుడు ఈ సీటు నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన టెన్జింగ్ వాగ్డి గెలిచారు. అయితే, 1957 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు సిపిఐ (ఎం) అభ్యర్థిగా సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి జరిగిన ఎన్నికల్లో సత్యేంద్ర నారాయణ్ మజుందార్ విజయం సాధించారు. 1962, 1967 ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా గూర్ఖా లీగ్‌కు చెందిన ప్రేమ్ థాపా 1969 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అధికార మార్పిడి..: 1977 కి ముందు, సిలిగురిలో కాంగ్రెస్ తమ హవా కొనసాగించింది. 1977 లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వామపక్షాలు అధికారాన్ని చేపట్టాయి. జ్యోతి బసు నాయకత్వంలో సిపిఐ (ఎం) బలమైన పార్టీగా అవతరించింది. 1977 ఎన్నికల తరువాత, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ హవా దాదాపుగా ముగిసింది. 1977 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి రాలేకపోయింది. 1977, 1982 ల్లో సిపిఐ–ఎం అభ్యర్థి వీరెన్ బోస్ సిలిగురి అసెంబ్లీ సీటు నుంచి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన 1987 ఎన్నికల్లో సిపిఐ(ఎం)కు చెందిన గౌర్ చక్రవర్తి విజయం సాధించారు. అనంతరం 1991 నుండి 2006 వరకు అశోక్ భట్టాచార్య సిపిఐ (ఎం) అభ్యర్థిగా వరుసగా నాలుగుసార్లు అధికారపీఠంపై కూర్చున్నారు. అప్పటి వామపక్ష ప్రభుత్వంలో అశోక్ భట్టాచార్య 20 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. ఎత్తుకు పై ఎత్తులు..: అయితే, 2011 ఎన్నికల్లో అశోక్ భట్టాచార్య టీఎంసీ హవా ముందు నిలబడలేక ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. భట్టాచార్యను తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ రుద్రనాథ్ భట్టాచార్య ఓడించారు. అయితే 2016 ఎన్నికల్లో అశోక్ భట్టాచార్య మళ్ళీ సిలిగురి అసెంబ్లీ సీటు నుండి విజయం సాధించారు. ఏప్రిల్ 7న జరుగబోయే ఐదో దశ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మిశ్రా బరిలో దిగనున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సిలిగురి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు ఒకవైపు టీఎంసీ, బీజేపీ పోటీపడుతుండగా, మరోవైపు తమ పట్టును కొనసాగించేందుకు సీపీఐ(ఎం) ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. -
ఎక్కువ శాతం మహిళలకు టిక్కెట్లు సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి 33 శాతం మంది మహిళలకు టెకెట్లు కేటాయించగా, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా 40 శాతం ఎంపీ టిక్కెట్లను మహిళలకు కేటాయించిన విషయం తెల్సిందే. ఎందుకు వారు మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? మహిళల్లో అక్షరాస్యతతోపాటు రాజకీయ అవగాహన పెరిగిందా ? వారయితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా ? ఉంటే ఎందుకు ఉంటాయి ? వారు తీసుకున్న నిర్ణయం సబబేనా? నేడు భారత దేశంలో ప్రాథమికే కాదు, మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం దేశంలో మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య 75.8 శాతం కాగా, పురుషుల సంఖ్య74.59 శాతం ఉంది. ఆ మహిళల్లో ప్రతి పది మందిలో ఏడుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక వారిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు ఏ వత్తిని చేపట్టాలో ముందుగానే నిర్ణయానికి వస్తున్నారు. మహిళలు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని మహిళల్లో 68 శాతం మంది కోరుకుంటున్నట్లు ‘లోక్‌నీతి–సీఎస్డీఎస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. వారిలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్ర నిర్ణయం మేరకు అభ్యర్థులకు లేదా పార్టీలకు ఓటు వేస్తామని చెప్పారు. పంచాయతీ రిజర్వేషన్లతోనే చైతన్యం పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 40 శాతానికిపైగా సీట్లను మహిళలకు కేటాయిస్తూ 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలను తీసుకరావడం వల్ల మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. పంచయతీరాజ్ లెక్కల ప్రకారం నేడు పంచాయతీరాజ్ సంస్థల్లో 46 శాతం సీట్లకు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పంచాయతీ రాజ్ పదవులకు పోటీచేసి విజయం సాధించగా, మరో 20 లక్షల మంది మహిళలు పోటీచేసి ఓడిపోయారు. ఓటర్ల చైతన్యం గురించి గ్రామ స్థాయిలో జరగాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యల గురించి నేడు మహిళలకు ఎక్కువ అవగాహన ఉందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విమెన్స్ స్టడీస్ డివిజన్‌కు నాయకత్వం వహిస్తున్న బిద్యుత్ మొహంతీ తెలిపారు. స్వచ్ఛందంగా మహిళా పోలింగ్ నేడు మహిళా ఓటర్లలో కూడా ఎంతో చైతన్యం పెరిగిందని, ఎవరి ప్రభావం వల్లనో కాకుండా మహిళా సాధికారితను సాధించడంలో భాగంగా స్వచ్ఛందంగా మహిళా ఓటర్లు ముందుకు వచ్చి ఓటేస్తున్నారని బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్ శామిక రవి చెప్పారు. 1962 నాటి ఎన్నికల్లో పురుషులు, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం 15 శాతం ఉండగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి 1.5 శాతానికి పడిపోయింది. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకన్నా మహిళల పోలింగ్ శాతం పెరిగింది. ‘బీమారు’గా వ్యవహరించే వెనకబడిన రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరగడం విశేషం. 1960 దశకంతో పోలిస్తే 2000 దశకం నాటికి దేశంలో దేశంలో లింగ నిష్పత్తి బాగా పెరగ్గా, పోలింగ్‌లో నిష్పత్తి బాగా తగ్గడం గమనార్హం. హింస తగ్గడం, సదుపాయాలు పెరగడం పోలింగ్ కేంద్రాల వద్ద హింస తగ్గడం, మహిళలకు సదుపాయాలు పెరగడం, మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం 1990 నుంచి ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ కొనసాగించడం తదితర కారణాల వల్ల మహిళల పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో కొంత మంది మహిళలు విఫలమవుతున్నప్పటికీ వారి సంఖ్య పురుషులకన్నా తక్కువగా ఉండడం విశేషం. ఎన్నికల కమిషన్ మార్చి నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 4.35 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా 3.80 కోట్ల మంది పురుషులు కొత్తగా ఓటు హక్కు పొందారు. లోక్‌సభలో 12.1 శాతం మహిళల ప్రాతినిధ్యం దేశం మొత్తం జనాభాలో 48.1 శాతం మంది మహిళలు ఉండగా, లోక్‌సభలో మాత్రం ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం మాత్రం 12.1 శాతం మాత్రమే. పార్లమెంట్ ఉభయ సభలతోపాటు రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బిజూ జనతాదళ్, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం ఎంతో హర్షనీయం. -
ప్రధాని పేరు తెలియదని చెంప ఛెళ్లుమనిపించారు
కోల్‌కతా : ప్రధాని పేరు తెలియక పోవడం కూడా నేరంగా మారింది. అదే ఓ అమాయకుడైన ప్రయాణికుడిపై దాడికి కారణమయ్యింది. ముక్కూ మొహం తెలియని తోటి ప్రయాణీకులు ప్రధాని పేరేమిటన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ మైనారిటీ వ్యక్తిపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చింబెంగాల్లోని ఓ రైలులో జరిగింది. వలస కూలీ అయిన బాధితుడు హౌరా నుంచి మాల్దా జిల్లా కాలియాచక్కి వెళుతుండగా రైల్లో తన పక్కసీట్లో కూర్చుని వున్న నలుగురు వ్యక్తులు భారత ప్రధాని పేరేమిటి అని ప్రశ్నించడంతో అక్షరం ముక్కరాని ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేసాడు. గుచ్చి గుచ్చి అగడగడంతో తనకు తెలిసిన ఒకే ఒక పేరు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీయే మన ప్రధాని అని సమాధానమిచ్చాడా నిరక్షరాస్యుడు. దీంతో మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్రపతి పేరేమిటి అంటూ ఆ తరువాత కూడా ఆ నలుగురూ ప్రశ్నలతో వేధించడమే కాకుండా అతని పై చేయిచేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా జాతీయగీతాన్ని ఆలపించమని ఆ నలుగురూ ఒత్తిడిచేయడంతో తనకు తెలిసినంతవరకూ భయం భయంగా పాడివినిపించాడా వ్యక్తి. దీంతో ‘‘నీకు నమాజ్ చదవడం తెలుసు కదా? మరి జాతీయ గీతం ఎందుకు రాదు?’’ అని నిలదీయడం, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి తెలుసా అంటూ ఎద్దేవా చేయడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. బందేల్ స్టేషన్ లో ఆ అగంతకులు దిగిపోయినట్టు పోలీసు అధికారులు తెలియజేసారు. బంగ్లా సంస్కృతి మంచ్ స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రయాణికుడిపై దాడి ఘటన వీడియో ఆధారంగా కాలియచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమన్ చటర్జీ తెలిపారు. -
చదువు రాదన్నా.. చెంప పగలగొట్టారు
-
పెద్దల సభకు డిస్కోడాన్సర్
మమతా దీదీ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు గతంలో ఎన్నో ఉదాహరణ ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మిధున్ చక్రవర్తిని పెద్దల సభకు పంపాలని మమత దీదీ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఐదు ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో వాటిలో ఒకదానిని మిధున్ చక్రవర్తికి కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ శనివారం వెల్లడించింది. మిధున్ తన జీవితాన్ని సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలకు పూర్తిగా వినియోగించి, అందులో సంపూర్ణ ఫలితాలను పొందారని ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రశంసలతో ముంచెత్తారు. అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున మిధున్ చక్రవర్తిని రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక చేసేందుకు ఇప్పటికే మమత దీదీని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మిధున్ చక్రవర్తి గతంలో బాలీవుడ్ చిత్రం డిస్కోడాన్సర్ లో నటించిన విషయం తెలిసిందే.