పెద్దల సభకు డిస్కోడాన్సర్
మమతా దీదీ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు గతంలో ఎన్నో ఉదాహరణ ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మిధున్ చక్రవర్తిని పెద్దల సభకు పంపాలని మమత దీదీ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఐదు ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో వాటిలో ఒకదానిని మిధున్ చక్రవర్తికి కేటాయించాలని నిర్ణయించారు.
ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ శనివారం వెల్లడించింది. మిధున్ తన జీవితాన్ని సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలకు పూర్తిగా వినియోగించి, అందులో సంపూర్ణ ఫలితాలను పొందారని ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రశంసలతో ముంచెత్తారు. అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున మిధున్ చక్రవర్తిని రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక చేసేందుకు ఇప్పటికే మమత దీదీని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మిధున్ చక్రవర్తి గతంలో బాలీవుడ్ చిత్రం డిస్కోడాన్సర్ లో నటించిన విషయం తెలిసిందే.