రాజ్యసభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటుడు!
రాజ్యసభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటుడు!
Published Mon, Jan 27 2014 8:54 PM | Last Updated on Tue, May 28 2019 10:05 AM
పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ బరిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి బరిలో దిగారు. ఫిబ్రవరి 7 తేదిన జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు మిథున్ తోపాటు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ చక్రవర్తి రాజ్యసభకు పోటీ చేయనున్నారు.
ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇక భవిష్యత్ లో కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాను. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తృణమూల్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిథున్ అన్నారు.
తృణమూల్ పార్టీ తరపున పెయింటర్ జోగెన్ చౌదరీ, బెంగాలీ దిన పత్రిక కలామ్ ఎడిటర్ ఆహ్మద్ హసన్, కేడీ సింగ్ లు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఐ పార్టీ తరపున స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ, కాంగ్రెస్ మద్దతుతో ఉర్దూ దిన పత్రిక ఆజాద్ హింద్ మాజీ ఎడిటర్ మలిహబడి పోటీలో ఉన్నారు.
Advertisement
Advertisement