ప్రధాని పేరు తెలియక పోవడం కూడా నేరంగా మారింది. అదే ఓ అమాయకుడైన ప్రయాణికుడిపై దాడికి కారణమయ్యింది. ముక్కూ మొహం తెలియని తోటి ప్రయాణీకులు ప్రధాని పేరేమిటన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ మైనారిటీ వ్యక్తిపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చింబెంగాల్‌లోని ఓ రైలులో జరిగింది.