Nawaz Sharief
-
మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పాక్ ప్రధాని పదవి ఊడింది!
అది జులై 13, 2018 లాహోర్ ఎయిర్ పోర్ట్. పాకిస్తాన్లో శక్తివంతమైన నేత, ఆ దేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్(72), ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ తీవ్ర ఉద్రికత్త, ఉత్కంఠతల మధ్య అధికారులు అరెస్ట్ చేశారు. పనామా పత్రాల స్కామ్‌లో ఎవెన్ ఫీల్డ్ హౌజ్ అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ సుప్రీం కోర్టు వీళ్లిద్దరిని దోషులుగా ప్రకటించింది. అయితే, నవాజ్ షరీఫ్, కుమార్తె నవాజ్ మరియం షరీఫ్‌లు కేవలం మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పట్టుబడ్డారనే విషయం మీకు తెలుసా? ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన కుటుంబం కోసం ప్రభుత్వ నిధులు కాజేశారంటూ ఏప్రిల్3, 2016న జర్మన్ వార్తాపత్రిక Süddeutsche Zeitung ( SZ ) 11.5 మిలియన్ల రహస్య పత్రాలు లీక్ అయినట్లు ప్రకటించింది. పనామా పేపర్స్ అని పిలవబడే ఈ డాక్యుమెంట్లలో క్లయింట్లు ఆయా ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా బిలియన్ డాలర్లు ఎలా దాచుకున్నారో వెల్లడించింది. వెలుగులోకి వచ్చిన పనామా డాక్యుమెంట్లలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గర ఉన్న ఆస్తులు కన్నా చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. అంతేకాదు, ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసేలా షరీఫ్ తన కుమార్తె కోసం లండన్‌లో ఓ విలావంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై 2017లో పాక్ సుప్రీం కోర్టు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ షరీఫ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. అనేక వాయిదాల తర్వాత నవాజ్ షరీఫ్ కూతురు మరియం కొన్ని డాక్యుమెంట్లను సాక్షాలుగా చూపించింది. ఈ డాక్యుమెంట్స్‌లో ఉన్న డేట్ ఫిబ్రవరి 2006, వాడిన ఫాంట్ మైక్రోసాఫ్ట్ కాలిబ్రి. అయితే కాలిబ్రి అనే ఫాంట్ ను మైక్రోసాఫ్ట్ 2007లో అందరికి అందుబాటులో వచ్చింది. కానీ ఆ విషయం తెలియక షరీఫ్ - మరియంలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇదే అంశంపై 15 సంవత్సరాల క్రితం కాలిబ్రిని డిజైన్ చేసిన డచ్ టైప్‌ఫేస్ డిజైనర్ లుకాస్ డి గ్రూట్, షరీఫ్ కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. తాను డిజైన్ చేసిన ఈ కాలిబ్రి ఫాంట్ 2007లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. కానీ 2006లో ఎలా వినియోగించారనే అనుమానం లేవనెత్తారు. దీని బట్టి మరియం ఇచ్చింది దొంగ సాక్ష్యాలని కోర్టుకు తెలిసింది. ఒక ఫారెన్సిక్ హ్యాండ్ రైటింగ్ కంపెనీ తప్పును పట్టేసింది. నవాజ్‌కు వ్యతిరేకంగా ఇదొక పెద్ద సాక్ష్యంగా మారింది. రెండు కేసుల్లో న్యాయస్థానాలు ఆయనకు 2018లో శిక్ష విధించాయి. లండన్‌లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పదేళ్లు; సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 2019, నవంబరులో షరీఫ్ లండన్ వెళ్లి, ఇప్పటివరకూ తిరిగి రాలేదు! అయితే, తన సోదరుడు షెహ్బాజ్ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో..షరీఫ్ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ క్రమంలోనే భారత్ చంద్రుణ్ని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోందని విచారించారు. అంతేకాదు, తన ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతోపాటు ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నారని ఆరోపించారు. -
అధ్యక్షుడు అరీఫ్ తొలగింపు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గద్దె దిగిపోవడానికి సమయం దగ్గరకొస్తోంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఆఖరి బాల్ వరకు పోరాడుతానంటూ ఇమ్రాన్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక ఇమ్రాన్ గద్దె దిగిపోతే అధ్యక్షుడు అరిఫ్ అల్వీని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాయి. అదే విధంగా యూకేలో ప్రవాసానికి వెళ్లిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని తిరిగి పాక్‌కి తేవాలని భావిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లింమ్ లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ (70) కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారమయ్యాక ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వెల్లడించే అవకాశాలున్నాయని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ తారిక్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీధుల్లో నిరసన తెలపండి: ఇమ్రాన్ పాకిస్తాన్లో ‘దిగుమతి అయిన ప్రభుత్వాన్ని’ ఎంతమాత్రం అంగీకరించబోనని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ‘బెదిరింపు లేఖ’ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శనివారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తనతో కలిసి వీధుల్లో నిరసన తెలపాలని మద్దతుదారులకు సూచించారు. దీన్నిబట్టి పదవి నుంచి దిగిపోక తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చి నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి, పదవి నుంచి తప్పుకున్న తొలి పాక్ ప్రధానిగా చరిత్రకెక్కుతారు. -
పాకిస్తాన్లో విపక్ష కూటమి
పాకిస్తాన్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎట్టకేలకు ఉమ్మడి కార్యా చరణ ప్రకటించాయి. ఈ నెల 16తో మొదలుపెట్టి డిసెంబర్ 13 వరకూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించాలని అవి నిర్ణయించాయి. గత నెలలో 11 పార్టీలు కలిసి పాకిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమం(పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసినప్పటినుంచీ ఆ పార్టీల మధ్య సంప్రదింపులు సాగుతూ వున్నాయి. వాస్తవానికి ఈ పార్టీల ఆగ్రహం ఇమ్రాన్‌పై కాదు. ఆ చాటున పెత్తనం చలాయిస్తున్న పాకిస్తాన్ సైన్యంపై. కనుకనే ఇమ్రాన్ ప్రభుత్వం చురుగ్గా కదిలింది. పాకి స్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లపై కేసులు మొదలయ్యాయి. జర్దారీపై రెండు అవినీతి కేసుల్లో పాకిస్తాన్ కోర్టు నేరారోపణలు ఖరారు చేయగా... నవాజ్ షరీఫ్‌పై పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ రాజకీయ కార్యకలాపాల్లో అక్కడి సైన్యం జోక్యం చేసుకుంటున్నదంటూ షరీఫ్ గత వారం ఆన్లైన్లో చేసిన ప్రసంగంపై ఒక పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో సైన్యం రిగ్గింగ్ వల్లే ఇమ్రాన్ అధికారంలోకొచ్చారన్నది షరీఫ్ ప్రసంగం సారాంశం. ఈ కేసులో నేరం రుజువైతే ఉరిశిక్ష ఖాయం. అసలు షరీఫ్ ఆ ప్రసంగం చేసిన రోజే ఇమ్రాన్ ఆయన్ను భారత్ చేతిలో కీలు బొమ్మగా అభివర్ణించారు. ఆ వెనకే షరీఫ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. (చదవండి: ... అయినా మారని ట్రంప్!) పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రపై షరీఫ్ చేసిన ఆరోపణ కొత్తది కాదు. పాకిస్తాన్ ఏర్పడి 73 సంవత్సరాలవుతుంటే అందులో సగభాగం సైనిక పెత్తనమే సాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సైనిక బలంతో కూలదోయడం, సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం పాక్‌లో రివాజు. 1958లో అయూబ్‌ఖాన్‌తో ఇది మొదలైంది. జనరల్ యాహ్యాఖాన్, జనరల్ జియా వుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు. సైనిక దళాల చీఫ్‌లే పాలకులు కావడం, వారే ఏళ్ల తరబడి పాలన పేరుతో అణచివేతను సాగించడం, ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తాక నిష్క్రమించడం పాక్ చరిత్రలో మామూలే. జనరల్ జియా వుల్ హక్ తన పాలనను శాశ్వతం చేసుకోవడానికి మత సంస్థలను రంగంలోకి దింపి, వారి ద్వారా రాజకీయ రంగాన్ని శాసించే యత్నం చేసి ఆ దేశాన్ని శాశ్వతంగా మత ఛాందసవాద శక్తుల చేతుల్లో పెట్టారు. చిత్రమేమంటే... పార్టీల నేతలుగా అవతారమెత్తిన జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్ వంటివారు సైతం సైనిక పాలకుల ఆశీర్వాదంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సైన్యంతో బాగున్నంతకాలం వారు సజావుగా పాలన సాగించారు. సైన్యం ఆగ్రహిస్తే పదవులు కోల్పోయారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) స్థాపించిన భుట్టో అంతక్రితం జనరల్ అయూబ్‌ఖాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1977లో భుట్టో ప్రధానిగా వున్న సమయంలో ఆయన్ను కూలదోసి జనరల్ జియావుల్ హక్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. చివరకు ఆయన బతికుంటే తనకు ఎప్పటికైనా సవాలుగా నిలుస్తాడని భావించి హత్యానేరం ఆరోపణలో ఉరిశిక్ష పడేలా చేసి ప్రాణం తీశారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాకే బేనజీర్ భుట్టో అయినా, నవాజ్ షరీఫ్ అయినా అధికారంలోకొచ్చారు. అయితే వారిద్దరూ పదవిలో కొనసాగింది మాత్రం సైన్యం దయాదాక్షిణ్యాలపైనే. బేనజీర్ భుట్టో మూడు దఫాలు, నవాజ్ షరీఫ్ రెండు దఫాలు కొంతకాలం చొప్పున ప్రధానులుగా పనిచేశారు. 2008 తర్వాత సైన్యం కాస్త వెనక్కు తగ్గింది. తొలిసారి పౌర ప్రభుత్వాన్ని అయిదేళ్లూ అధికారంలో సజావుగా సాగనిచ్చింది. ఆ తర్వాత 2013లో అధికారంలోకొచ్చిన నవాజ్ షరీఫ్ సైతం అయిదేళ్లూ పాలించారు. 2018లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్(ఎన్)ను ఓడించి, అధికారంలోకొచ్చిన ఇమ్రాన్ ఖాన్ వెనక మళ్లీ పాకిస్తాన్ సైన్యం ప్రధాన పాత్ర పోషించింది. ఆయన నవాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన ఉద్యమంలోనూ, ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా సాగిన రిగ్గింగ్లోనూ ప్రధాన వాటా సైన్యానిదే. (చదవండి: ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!) కనుక రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదన్న నవాజ్ ఆరోపణల్లో వైపరీత్యమేమీ లేదు. కానీ పాకిస్తాన్లో చిన్న ఆరోపణ కూడా ప్రాణాంతకమైన నేరంగా మారడంలో వింతేమీ లేదు. అలాగే తమ వ్యతిరేకుల్ని భారత్ ఏజెంట్లుగా ముద్రేయడం, వారిని భారత్‌కు పోవాలని బెదిరించడం కూడా అక్కడ సర్వసాధారణమే. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత పాకిస్తాన్ విపక్షాలు చేతులు కలిపాయి. 2006లో అప్పటి సైనిక పాలకుడు ముషార్రఫ్‌కు వ్యతిరేకంగా బేనజీర్, నవాజ్ షరీఫ్లిద్దరూ లండన్‌లో సమావేశమై ‘ఛార్టర్ ఆఫ్ డెమొక్రసీ’పై సంతకాలు చేసి సమష్టి ఉద్యమం నడిపారు. చివరికది 2008లో ఎన్నికలకు దారితీసింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఆర్థికంగా ఒడిదుడుకుల్లో వుంది. కరోనా వైరస్ పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థితులవల్ల నిరుద్యోగ సమస్య మరింత ఉగ్రరూపం దాల్చింది. వచ్చే మార్చిలో పార్లమెంటు ఎగువసభ సెనేట్‌కు ఎన్నికలు జరగ బోతున్నాయి. ఎగువసభలో ఇమ్రాన్‌కు మెజారిటీ రానీయకూడదనుకుంటే దేశంలో ఇప్పటినుంచీ ఉద్యమం ఉధృతం చేయాలి. కీలక రాష్ట్రమైన పంజాబ్‌లో పీఎంఎల్(ఎన్)కు ఇప్పటికే పట్టుంది. ఇతర రాష్ట్రాల్లో సైతం దృఢంగా ఉద్యమాన్ని నిర్వహిస్తే ఇమ్రాన్‌ఖాన్ సర్కారు పునాదులు కదిలిం చడం సులభమన్నది విపక్షాల అంచనా. కానీ సైన్యం అండదండలున్న ఇమ్రాన్‌ను పడగొట్టడం అంత సులభం కాదు. అయితే పాకిస్తాన్ చరిత్ర చూస్తే ఎంతో బలహీనంగా కనబడ్డ ఉద్యమాలే కాలం గడిచేకొద్దీ పదునెక్కాయి. పాక్ విపక్ష కూటమి పీడీఎం ఎంత బలంగా ఉద్యమం నిర్మిస్తుందో మున్ముందు చూడాలి. -
మేడమ్ క్యూరీ కూతురిని చంపినట్టుగా..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ - ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్(69) శరీరంలో పోలోనియమ్ అనే రేడియో ధార్మిక మూలకాన్ని ఇంజెక్ట్ చేశారని ఎమ్‌క్యూఎమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఆరోపించారు. పోలోనియమ్ అనే రసాయనం నెమ్మది నెమ్మదిగా విషంగా మారుతుందని తెలిపారు. పాలస్తీనా ఉద్యమ కారుడు యాసిర్ ఆరాఫత్‌ను 2004లో ఇలాగే చంపేశారని తెలిపారు. అలాగే రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మేడమ్ క్యూరీ కూతురు, నోబెల్ గ్రహీత ఇరెనె జోలియట్ క్యూరీని కూడా 1956లో ఇలాంటి విషమే ఇచ్చి చంపేశారని ఉదాహరణగా చూపించారు. ఈ విషాన్ని అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్రత్యేక ప్రయోగ శాలల్లో మాత్రమే కనుగొనగలమని తెలిపారు. పోలోనియమ్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట అది రక్త కణాలను నాశనం చేస్తుంది. తర్వాత డీఎన్ఏపై దాడి చేసి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అనంతరం లివర్, కిడ్నీ, ఎముక మజ్జలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. పోలోనియమ్ రసాయనం గురించి, దాని దుష్ప్రభావాల గురించిన పరిశోధనాత్మక ఆర్టికల్‌ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అల్ అజీజియా కేసులో లాహోర్‌లోని కోట్ లక్పత్ జైల్లో ఏడేళ్ల ఖైదును అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్‌ను అక్టోబర్ 22న అనారోగ్య కారణాల వల్ల లాహోర్‌లోని సిమ్స్ (సర్వీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ కారణాలతో కోర్టు నవాజ్‌కు అక్టోబరు 29న బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడకముందే ఆయనను బుధవారం తన స్వగృహం జతి ఉమ్రాకు తరలించారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటలు ఆయన్ను డాక్టర్లు కనిపెట్టుకుని ఉంటారు. ఇందుకోసం ఆయన ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు చేశారు. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముండడంతో కుటంబసభ్యులను తప్ప బయటి వారిని ఎవ్వరినీ కలవనివ్వటం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మర్రియుమ్ ఔరంగజేబ్ ప్రజలకు తెలియజేశారు. -
ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని కుమార్తె!
లాహోర్ : తన తండ్రిని చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తండ్రికి చికిత్స చేస్తున్న ఆస్పత్రిలోనే చేర్పించారు. అనేక పరిణామాల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియమ్ నవాజ్‌కు కూడా స్థానిక కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవాజ్ షరీప్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సోమవారం రాత్రి లాహోర్ ఆసుపత్రిలో చేర్పించారు. బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే నవాజ్ కుమారుడు మాత్రం జైలులో నవాజ్‌పై విష ప్రయోగం జరిగినందువల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న నవాజ్ కుమార్తె మరియమ్ తండ్రిని చూడాలని కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో ఒక గంట పెరోల్‌పై ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాగా నవాజ్‌ను చూడటానికి వెళ్లిన ఆమె అస్వస్థతకు గురికావడంతో తనను కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు... నవాజ్ షరీఫ్‌కు మెరుగైన వైద్యచికిత్సలు అందించవలసిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన సలహాదారు ఫిర్దోస్ ఆశిక్ అవన్ ట్విటర్లో పేర్కొన్నారు. -
పాక్ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ కూతురు మారియమ్ నవాజ్‌ను గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో ఇంతవరకు కారణం చెప్పలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబ్ తెలిపారు. అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్ మిల్స్ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్ సమన్లు జారీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. -
క్షీణించిన నవాజ్ షరీఫ్ ఆరోగ్యం
ఇస్లామాబాద్ : పాక్ బహిష్కృత ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో ఆయనను రావల్పిండిలోని అదియాల జైలు నుంచి పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)కు తరలించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితిని పరీక్షించిన వైద్యులు కరోనరీ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స అందిస్తున్నారని జియో న్యూస్ వెల్లడించింది. రావల్పిండిలోని జైలులో ఆయనకు నిర్వహించిన కార్డియోగ్రామ్ పరీక్షలో లోటుపాట్లు గుర్తించిన వైద్యులు ఆయనను ఆస్పత్రికి తరలించాలని సూచించారని పంజాబ్ ప్రావిన్స్ హోంమంత్రి షౌకత్ జావేద్ తెలిపారు. వైద్యుల సూచనపై జైల్ సూపరింటెండెంట్ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించిన మీదట షరీఫ్‌ను పిమ్స్కు తరలించారు. నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 24న వైద్య మండలిని నియమించిన సంగతి తెలిసిందే. షరీఫ్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య మండలి సూచించింది. -
క్షీణిస్తున్న షరీఫ్ ఆరోగ్యం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని, వెంటనే అతన్ని చికిత్స కొరకు హాస్పిటల్‌కు తరలించాలని జైలు వైద్య సిబ్బంది తెలిపారు. పనామా పత్రాలు కుంభకోణం కేసులో ఈ నెల 13న అరెస్ట్ అయిన షరీఫ్ ప్రస్తుతం అదీలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జైలు వైద్య సిబ్బంది ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన ఆనంతరం షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. డీహైడ్రేషన్, రక్తహీనత ప్రమాదకర స్థాయికి పెరిగాయని, మరింత ఆలస్యం చేస్తే హార్ట్ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ లండన్ నుంచి పాక్ వచ్చిన వెంటనే లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. -
గాడిదపై రాజకీయ చిత్ర హింసలు
-
ప్రధాని పేరు తెలియదని చెంప ఛెళ్లుమనిపించారు
కోల్‌కతా : ప్రధాని పేరు తెలియక పోవడం కూడా నేరంగా మారింది. అదే ఓ అమాయకుడైన ప్రయాణికుడిపై దాడికి కారణమయ్యింది. ముక్కూ మొహం తెలియని తోటి ప్రయాణీకులు ప్రధాని పేరేమిటన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ మైనారిటీ వ్యక్తిపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చింబెంగాల్లోని ఓ రైలులో జరిగింది. వలస కూలీ అయిన బాధితుడు హౌరా నుంచి మాల్దా జిల్లా కాలియాచక్కి వెళుతుండగా రైల్లో తన పక్కసీట్లో కూర్చుని వున్న నలుగురు వ్యక్తులు భారత ప్రధాని పేరేమిటి అని ప్రశ్నించడంతో అక్షరం ముక్కరాని ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేసాడు. గుచ్చి గుచ్చి అగడగడంతో తనకు తెలిసిన ఒకే ఒక పేరు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీయే మన ప్రధాని అని సమాధానమిచ్చాడా నిరక్షరాస్యుడు. దీంతో మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్రపతి పేరేమిటి అంటూ ఆ తరువాత కూడా ఆ నలుగురూ ప్రశ్నలతో వేధించడమే కాకుండా అతని పై చేయిచేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా జాతీయగీతాన్ని ఆలపించమని ఆ నలుగురూ ఒత్తిడిచేయడంతో తనకు తెలిసినంతవరకూ భయం భయంగా పాడివినిపించాడా వ్యక్తి. దీంతో ‘‘నీకు నమాజ్ చదవడం తెలుసు కదా? మరి జాతీయ గీతం ఎందుకు రాదు?’’ అని నిలదీయడం, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి తెలుసా అంటూ ఎద్దేవా చేయడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. బందేల్ స్టేషన్ లో ఆ అగంతకులు దిగిపోయినట్టు పోలీసు అధికారులు తెలియజేసారు. బంగ్లా సంస్కృతి మంచ్ స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రయాణికుడిపై దాడి ఘటన వీడియో ఆధారంగా కాలియచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమన్ చటర్జీ తెలిపారు. -
చదువు రాదన్నా.. చెంప పగలగొట్టారు
-
‘అతను దేశద్రోహి’
న్యూఢిల్లీ: ముంబై దాడులపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ముంబై దాడుల్లో పాకిస్తాన్ పాత్ర ఉందని, పాక్ తలచుకుని ఉండి ఉంటే 20/11 దాడులను అడ్డుకుని ఉండేదని నవాజ్ షరీఫ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నవాజ్ షరీఫ్ తన కుమారుడి కంపెనీలోని అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ భాష మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయన్న షరీఫ్ వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. షరీఫ్‌ను మధ్యముగంలో రాజ్యద్రోహం చేసిన మీర్ జాఫర్‌తో పోల్చారు. ‘మీర్ జాఫర్ బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్దౌలా సైన్యంలో సిఫాయిగా ఉండేవాడు. బ్రిటిష్‌వారితో రహస్యం ఒప్పందం కుదుర్చుకుని వారికి అనుకూలంగా వ్యవహరించి, 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ ఓటమికి కారకుడయ్యాడు. షరీఫ్ కూడా మీర్ జాఫర్‌లా తన సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులు అనుకూలంగా మాట్లాడుతున్నారు’. అని ఇమ్రాన్ ఖాన్ విమర్మించారు. -
పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడు..సుప్రీం తీర్పు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడు అంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. పార్టీ అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయాలు శూన్యమైనవని, పనికి రానివని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సకిబ్ నిస్సార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా షరీఫ్ ఎవరికైనా టిక్కెట్లు కేటాయించడం చట్టవిరుద్ధం కిందకు వస్తుందని తెలిపారు. ఎలక్షన్ యాక్ట్-2017 ప్రకారం షరీష్ పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడని పేర్కొంది. పనామా పేపర్స్ కుంభకోణంలో నవాజ్ షరీఫ్ పేరు బయటికి రావడంతో ఆయన లండన్ పారిపోయిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండి పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. -
'నేను తప్పు చేసినట్లు ఆధారాల్లేవ్'
ఇస్లామాబాద్ : తాను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పాకిస్థాన్ పదవీచ్యుత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై కావాలనే కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ విషయాలు కూడా త్వరలోనే నిరూపితమవుతాయని అన్నారు. పనామా కుంభకోణం కేసులో పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కూడా ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవాజ్ కూతురుకు కూడా హస్తం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయన బుధవారం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'వారిదగ్గర నేను తప్పు చేసినట్లు నిరూపించే ఆధారాలు ఏవీ లేవు. వాస్తవానికి నేను ఏ తప్పు చేయలేదు. ఉద్దేశ పూర్వకంగా కొంతమంది వ్యక్తులు చేసిన కుట్రలే ఆ ఆరోపణలు' అని ఆయన అన్నారు. కాగా, ఈ కేసు విచారణను కోర్టు జనవరి 9కు వాయిదా వేసింది. -
నెమలి హత్య, పిల్లి దోషి, పోలీసుల సస్పెన్షన్
అనగనగా ఒక నెమలి. అది రాజుగారింట్లో హాయిగా ఆడుకుంటుంది. ఒక రోజు ఎక్కడినుంచో ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది. రెండూ కాసేపు పలకరించుకున్నాయి. ఆ తరువాత కొద్ది సేపటికి పిల్లికి ప్రేమ ఎక్కువైపోయి నెమలి గొంతును కసక్కుమని కొరికేసింది. ఆ నెమలి కాస్తా చచ్చి ఊరుకుంది. రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది. నా ప్రియమైన నెమలిని చచ్చిపోనిస్తారా. 'ఠాఠ్... వీల్లేదు' అని ఆయన హుంకరించారు. అయితే పిల్లి దొరకలేదు. దాంతో ఆయన కాపలా కాస్తున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి పారేశారు. 'పాడు పిల్లి ఇంతపని చేస్తుందనుకోలేదు,' అని పాపం ఆ పోలీసులు లబోదిబో మంటున్నారు. ఈ సంఘటన జరిగింది పాకిస్తానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారి ఫార్మ్ హౌస్ లో. ఈ ఫార్మ్ హౌస్ రాయ్విండ్ అనే చోట ఉంది. ఆ మధ్య మనదేశంలో ఒక మంత్రిగారి గేదెలు చెప్పాపెట్టకుండా టూర్ కి వెళ్లిపోతే పోలీసులను సస్పెండ్ అయ్యారు. మరి పొరుగుదేశంలోని ప్రధానమంత్రి గారింట్లో నెమలి చనిపోతే ఆ మాత్రం శిక్ష పడకూడదా మరి?