ఇస్లామాబాద్ : తాను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పాకిస్థాన్ పదవీచ్యుత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై కావాలనే కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ విషయాలు కూడా త్వరలోనే నిరూపితమవుతాయని అన్నారు. పనామా కుంభకోణం కేసులో పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కూడా ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవాజ్ కూతురుకు కూడా హస్తం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయన బుధవారం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'వారిదగ్గర నేను తప్పు చేసినట్లు నిరూపించే ఆధారాలు ఏవీ లేవు. వాస్తవానికి నేను ఏ తప్పు చేయలేదు. ఉద్దేశ పూర్వకంగా కొంతమంది వ్యక్తులు చేసిన కుట్రలే ఆ ఆరోపణలు' అని ఆయన అన్నారు. కాగా, ఈ కేసు విచారణను కోర్టు జనవరి 9కు వాయిదా వేసింది.
'నేను తప్పు చేసినట్లు ఆధారాల్లేవ్'
Published Wed, Jan 3 2018 5:13 PM | Last Updated on Wed, Jan 3 2018 5:13 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment