Panama Scam
-
మామాజీ బెదిరింపులు.. దిగొచ్చిన రాహుల్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల జోరు పెంచాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పరం విమర్శల దాడికి దిగాయి. సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న రాహుల్ పనామా పత్రాల కుంభకోణాన్ని ఉటంకిస్తూ ‘ఈ కుంభకోణంలో మామాజీ(శివ్‌రాజ్ సింగ్ చౌహన్ నిక్ నేమ్), మామాజీ కుమారుడి పేరు ఉంది. అక్కడ చౌకీదార్(మోదీ).. ఇక్కడ మామాజీ ఇద్దరు దోచుకుంటున్నారం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ ఆరోపణలపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యాపం నుంచి పనామా కుంభకోణం వరకు నాపై, నా కుటుంబంపై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నేను కోర్టుకు వెళతా. రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తాన’ని చౌహన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Mr @RahulGandhi You have been making patently false allegations of Vyapam to Panama Papers against me and my family. Tomorrow, I am filing a criminal defamation suit for maximum damages against you for frivolous and malafide statements. Let law take its own course now. — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) October 29, 2018 దాంతో చౌహన్‌పై చేసిన అవినీత ఆరోపణల గురించి రాహుల్ దిగొచ్చారు. కానీ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు. ‘బీజేపీలో అవినీతి చాలా ఎక్కవ కదా అందుకే నేను పొరబడ్డాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంపై పనామా కుంభకోణం ఆరోపణలు లేవు. ఆయనపై కేవలం ఈ-టెండరింగ్, వ్యాపం కుంభకోణం లాంటి ఆరోపణలు మ్రాతమే ఉన్నాయంటూ’ అని రాహుల్ చురకలంటించారు. -
క్షీణిస్తున్న షరీఫ్ ఆరోగ్యం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని, వెంటనే అతన్ని చికిత్స కొరకు హాస్పిటల్‌కు తరలించాలని జైలు వైద్య సిబ్బంది తెలిపారు. పనామా పత్రాలు కుంభకోణం కేసులో ఈ నెల 13న అరెస్ట్ అయిన షరీఫ్ ప్రస్తుతం అదీలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జైలు వైద్య సిబ్బంది ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన ఆనంతరం షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. డీహైడ్రేషన్, రక్తహీనత ప్రమాదకర స్థాయికి పెరిగాయని, మరింత ఆలస్యం చేస్తే హార్ట్ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ లండన్ నుంచి పాక్ వచ్చిన వెంటనే లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. -
'నేను తప్పు చేసినట్లు ఆధారాల్లేవ్'
ఇస్లామాబాద్ : తాను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పాకిస్థాన్ పదవీచ్యుత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై కావాలనే కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ విషయాలు కూడా త్వరలోనే నిరూపితమవుతాయని అన్నారు. పనామా కుంభకోణం కేసులో పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కూడా ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవాజ్ కూతురుకు కూడా హస్తం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయన బుధవారం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'వారిదగ్గర నేను తప్పు చేసినట్లు నిరూపించే ఆధారాలు ఏవీ లేవు. వాస్తవానికి నేను ఏ తప్పు చేయలేదు. ఉద్దేశ పూర్వకంగా కొంతమంది వ్యక్తులు చేసిన కుట్రలే ఆ ఆరోపణలు' అని ఆయన అన్నారు. కాగా, ఈ కేసు విచారణను కోర్టు జనవరి 9కు వాయిదా వేసింది. -
పనామా పత్రాల్లో ‘ఏపీ బ్రాండ్ అంబాసిడర్’!
♦ జాబితాలో అజయ్ దేవ్‌గణ్ ♦ ‘బ్రిటిష్‌వర్జిన్ ఐలాండ్స్’ కంపెనీలో వాటాలు న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పనామా పత్రాల్లో బాలీవుడ్ హీరో, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్ దేవగణ్ పేరు ఉన్నట్లు వెల్లడైంది. 2013లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో మేరీలెబోన్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన కంపెనీలో ఆయనకు వాటాలున్నట్లు తెలిసింది. హిందీ సినిమాల విదేశీ హక్కుల కొనుగోలుకు, కొల్లగొట్టడానికి ఈ కంపెనీని స్థాపించినట్లు సమాచారం. పనామా లీకేజీ స్కాంలో కీలకమైన మొసాక్ ఫోన్సెకా సంస్థ ఈ కంపెనీ ఏర్పాటుకు దోహదం చేసిందని, లావాదేవీల్లో మధ్యవర్తిగా సాయం చేసిందని తెలిసింది. తొలుత లండన్‌కు చెందిన హసన్ ఎన్ సయానీ(వెయ్యి షేర్లు) ఆధ్వర్యంలో ఉన్న ఈ కంపెనీలో వాటాను దేవ్‌గణ్ సంస్థ నైసా యుగ్ ఎంటర్టైన్మెంట్ కొన్నది.ఈ సంస్థలో తన భార్య, నటి కాజోల్ భాగస్వామ్యం కూడా ఉంది. కంపెనీని స్థాపించిన ఏడాది తర్వాత 2014 డిసెంబర్లో విదేశీ ట్రస్ట్ అయిన ఈఎఫ్‌జీ ట్రస్ట్ కంపెనీని ఒక నామినీ డెరైక్టర్‌గా నియమించి దేవ్‌గణ్ డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారు. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత రిజర్వ్‌బ్యాంక్ నిబంధల మేరకే ఈ కంపెనీని ఏర్పాటుచేశామని దేవ్‌గణ్ చెప్పారు. తమ కుటుంబ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఈ వివరాలను వెల్లడించామన్నారు. మేరీలెబోన్లో వాటా విషయాన్ని నైనా యుగ్ ఎంటర్టైన్మెంట్ ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన బ్యాలెన్స్షీట్లో చూపినట్లు తెలిపారు.