మరియం నవాజ్ (ఫైల్ ఫోటో)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ కూతురు మారియమ్ నవాజ్‌ను గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో ఇంతవరకు కారణం చెప్పలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబ్ తెలిపారు. అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్ మిల్స్ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్ సమన్లు జారీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment