
కడప రాయుడిని దర్శించుకున్న డార్జిలింగ్ యువతులు
కడప కల్చరల్ : కడప నగరం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని శుక్రవారం డార్జిలింగ్‌కు చెందిన పలువురు యువతులు దర్శించుకున్నారు. దాదాపు 10 మంది యువతులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తాము డార్జిలింగ్ నుంచి కడప నగరంలో బీఈడీ పరీక్షలు రాసేం దుకు వచ్చామని, శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వామికి కల్యాణోత్సవం జరుగుతుందని తెలుసుకుని వచ్చామన్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం తమకెంతో ఆనందం కలిగిందని, ఇది అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.