కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారన్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున ట్రెడ్‌మిల్‌పై నడకతో రోజును ప్రారంభించే మమత... తొలిసారిగా డార్జిలింగ్ కొండలపై ఉత్సాహంగా జాగింగ్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్’ సందర్భంగా ఏకంగా పది కిలోమీటర్ల పాటు జాగింగ్ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. డార్జిలింగ్‌లోని కూర్సేయాంగ్ నుంచి పరుగెత్తుతూ మధ్య మధ్యలో స్థానికులను పలకరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలను మమత ప్రస్తావించారు.
ఇక జాగింగ్ చేస్తున్న సమయంలో మమత వెంట ఆమె భద్రతా సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మమత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్ సందర్భంగా మన భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిఙ్ఞ చేద్దాం. పచ్చదనాన్ని కాపాడండి. పరిశుభ్రంగా ఉండండి’అని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment