వరదల్లో భవనం కూలి ముగ్గురి మృతి | Three killed in building collapse as uttarakhand floods raise further | Sakshi
Sakshi News home page

వరదల్లో భవనం కూలి ముగ్గురి మృతి

Published Sat, Jul 23 2016 1:41 PM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Three killed in building collapse as uttarakhand floods raise further

డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో సంభవించిన వరదల్లో ఒక భవంతి కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డార్జిలింగ్ ఏరియాలోని హుస్సేన్ మురికివాడలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు నాలుగంతస్థుల భవంతి కుప్పకూలింది. ఇందులో మరి కొంతమంది చిక్కుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఉదయం అధికారులు ఆర్మీ సహాయం కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement