ప్రత్యేక గుర్ఖాల్యాండ్‌ డిమాండ్‌కు సీఎం మద్దతు! | Sikkim CM Pawan Chamling extends support for separate Gorkhaland state | Sakshi
Sakshi News home page

ప్రత్యేక గుర్ఖాల్యాండ్‌ డిమాండ్‌కు సీఎం మద్దతు!

Published Thu, Jun 22 2017 6:47 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

ప్రత్యేక గుర్ఖాల్యాండ్‌ డిమాండ్‌కు సీఎం మద్దతు! - Sakshi

ప్రత్యేక గుర్ఖాల్యాండ్‌ డిమాండ్‌కు సీఎం మద్దతు!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న గూర్ఖాల్యాండ్‌ ప్రజలకు అనూహ్య మద్దతు లభించింది. పొరుగున ఉన్న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌ గురువారం ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికారు. సిక్కిం అధికార పార్టీ ఎస్డీఎఫ్‌ కూడా గూర్ఖాల్యాండ్‌ ఉద్యమానికి సంఘీభావం పలికింది. గూర్ఖాల్యాండ్‌ ఏర్పాటు కోసం గత ఎనిమిది రోజులుగా జీజేఎం నేతృత్వంలో బంద్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది.

గూర్ఖాల్యాండ్‌ జనముక్తి మోర్చా (జీజేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వవధిక బంద్‌తో డార్జిలింగ్‌ లోయ ప్రాంతంలో ప్రజాజీవనం దాదాపు స్తంభించిపోయింది. అంబులెన్స్‌ వంటి అత్యవసర సేవలు సైతం నిలిపివేయడం, టీవీ కేబుళ్ల ప్రసారాలు ఆగిపోవడంతో డార్జిలింగ్‌ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement