సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, గ్యాంగ్‌టక్ : ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డు ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేసిన జ్యోతి బసు సొంతం కాగా, ఇప్పుడా రికార్డును సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ చెరిపివేశారు. పాలక సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) వ్యవస్థాపకుడు పవన్ చామ్లింగ్ సిక్కిం సీఎంగా 23 ఏళ్ల నాలుగు నెలల 17 రోజల నిరాంటక సర్వీసును ఆదివారంతో పూర్తిచేసుకున్నారు. 68 ఏళ్ల పవన్ చార్మింగ్ సిక్కిం సీఎంగా తొలిసారి 1994 డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.
మెట్రిక్యులేషన్ వరకూ చదివిన పవన్ 32 ఏళ్లకే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1992లో నార్ బహదూర్ భండారి క్యాబినెట్‌లో పలు హోదాల్లో మంత్రిగా పనిచేశారు. రాజకీయ ఎగుడుదిగుళ్లను చవిచూసిన అనంతరం 1993లో ఆయన ఎస్‌డీఎఫ్‌ను స్ధాపించారు. 23 ఏళ్లకు పైగా సీఎం పదవిలో విధులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఇక విశ్రాంతి తీసుకోవాలని సిక్కిం ప్రజలు భావిస్తే సీఎం పదవి నుంచి వైదొలుగుతానని, తన సేవలు వారు కోరితే తాను కొనసాగుతానని పవన్ చామ్లింగ్ స్పష్టం చేశారు. తనకు ప్రజా సేవ మినహా సొంత ఎజెండా ఏమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment