కొండచరియలు పడి 45 మంది మృతి | At Least 45 killed, Houses Swept Away in Darjeeling Landslides | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 2 2015 11:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

శ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, కలింపాంగ్, కర్సెవోంగ్ సబ్ డివిజన్లలో 38 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడగా 15 మంది గల్లంతయ్యారు. ఒక్క మిరిక్ ప్రాంతంలోనే 21 మంది మృతిచెందగా, 13 మంది గల్లంతయ్యారు. కలింపాంగ్, లావా, సుఖియా బ్లాక్, గోరుబతన్‌లలో మరో 17 మంది చనిపోయారని రాష్ట్ర విపత్తు సహాయక శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిని, బురదలో కూరుకుపోయాయి. 10వ, 55వ నంబరు జాతీయ రహదారులు దెబ్బతినడంతో సిలిగురి, మటిగరా, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. 55వ నంబర్ జాతీయ రహదారిపై నింబుజోరా వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోయింది. సెవోక్, కాలిబరి తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై చిక్కుకుపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement