people killed
-
అమెరికాలో సుడిగాలుల బీభత్సం
వ్యాలీ వ్యూ (టెక్సాస్): అమెరికాలో టెక్సాస్, ఒక్లహామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ట్రక్కుల పార్కింగ్ స్టేషన్, ఇళ్లను తుడిచిపెట్టేస్తూ సాగిన విధ్వంసకాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్లహామాలో టోర్నడోలు భీకర వినాశనానికి కారణమయ్యాయి. భీకర గాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో జనం అంధకారంలో మగ్గిపోయారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం
బరాసత్: పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 8 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. దుత్తపుకుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీల్‌గుంజ్‌లోని కర్మాగారంలో ఘటన జరిగిన సమయంలో పలువురు సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కలున్న 50 నివాసాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వివరించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కర్మాగారం యజమాని కొడుకు కూడా పేలుడులో చనిపోయాడన్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా నడుపుతున్న ఈ కర్మాగారంలో బాణాసంచా పేరుతో బాంబులు తయారు చేస్తున్నారా అన్న అనుమానాలకు దర్యాప్తులోనే సమాధానం దొరుకుతుందని చెప్పారు. పేలుడు అనంతరం స్థానికులు కర్మాగారం యజమాని ఇంటిని ధ్వంసం చేశారు. గత మేలో పూర్వ మేదినీపూర్ జిల్లాలోని ఈగ్రాలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 12 మంది చనిపోయారు. -
మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..
రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ). సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్లోని వీక్లీ మార్కెట్‌కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. -
విశాఖలో భవనం కూలి ముగ్గురు దుర్మరణం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలవగా.. మరో ఐదుగురు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని 29వ వార్డు పరిధి రామజోగిపేటలో 40 ఏళ్ల కిందట నిరి్మంచిన భవనం 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి బుధవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఘటనలో భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన రామ్‌విలాస్ (30) (అలియాస్ ఛోటు), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి దుర్గాప్రసాద్ (17), సాకేటి అంజలి (14) మృతి చెందారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ (29), మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సాకేటి రామారావు (39), సాకేటి కల్యాణి, రెండో ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న సన్నాపు కృష్ణ (30), పి.రోజారాణి గాయాలతో బయటపడ్డారు. 5 గంటల పాటు రాష్ట్ర విపత్తులు, ఫైర్ సర్వీస్ విభాగం, పోలీసులు శ్రమించి శిథిలాలోంచి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కల్యాణి పరిస్థితి విషమంగా ఉంది. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఘటన ప్రాంతానికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు. -
నదిలో పడ్డ బస్సు.. రాజస్తాన్‌లో 24 మంది మృతి
కోటా: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాజస్తాన్‌లోని బుండి జిల్లా కోటా–దౌసా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సవాయి మాధోపూర్ నగరంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 29 మంది బుధవారం ఉదయం కోటా నుంచి బస్సులో బయల్దేరారు. పాన్డీ గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. ఈ బ్రిడ్జికి గోడ కానీ రెయిలింగ్ కానీ లేకపోవడంతో దాదాపు 20–25 అడుగుల ఎత్తు నుంచి బస్సు మెజ్ నదిలో పడిపోయింది. -
ఒడిశాలో బస్సుకు షాక్..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ బస్సుపై 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గంజాం జిల్లా గోళాంతర ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో జంగల్పాడు నుంచి చికరాడ వెళ్తున్న బస్సు మందరాజ్పూర్ వద్ద విద్యుదాఘాతానికి గురైంది. బస్సులోని వారంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నారని బెర్హంపూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో) సర్దార్ జయంత్‌కుమార్ మహాపాత్ర వెల్లడించారు. మృతులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పద్మనాభ బెహరా తెలిపారు. -
టర్కీలో భారీ భూకంపం
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. -
కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం
అల్మేటీ: కజకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద నగరం అల్మేటీ నుంచి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సుమారు వంద మందితో టేకాఫ్ తీసుకున్న విమానం ఆ తరువాత కొద్దిసేపటికే కూలిపోయింది. బెక్ ఎయిర్ అనే విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం రాజధాని నూర్ సుల్తాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం రాడార్‌లో కనిపించకుండా పోయిందని, అల్మేటీ సరిహద్దుల్లోని ఓ రెండంతస్తుల భవనంపై కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విమానం కూలిపోయిన ధాటికి విమానం రెండు ముక్కలైందని, ప్రాణాలతో ఉన్న వారిని శకలాల నుంచి వెలికి తీసేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా కెప్టెన్‌తోపాటు 11 మంది మరణించినట్లు ఆ ప్రకటన వివరించింది. ఈ దుర్ఘటనలో 53 మంది గాయపడ్డారని, వీరిలో తొమ్మిది మంది పిల్లలూ ఉన్నారని తెలిపింది, ఘటనపై విచారణ జరపడంతోపాటు, బెక్ ఎయిర్ సంస్థ వాడుతున్న ఫొక్కర్ మోడల్ విమానాలపై కజకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనే దాని తోకభాగం రన్‌వేను రెండుసార్లు తాకిందని, ఇది పైలట్ తప్పిదమా? లేదా సాంకేతికపరమైన సమస్య? అన్నది తేల్చాల్సి ఉందని ఉప ప్రధాని స్కైలార్ చెప్పారు. -
బుర్కినాఫాసోలో రక్తపాతం
ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్‌లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్‌లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి. -
జపాన్‌లో టైఫూన్ బీభత్సం
టోక్యో: జపాన్ను హగిబీస్ టైఫూన్ వణికిస్తోంది. టైఫూన్ ధాటికి 33 మంది మృతిచెందగా.. 15 మంది జాడ తెలియకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. చికుమా నది పొంగిపొర్లడంతో సెంట్రల్ జపాన్‌లోని నాగానో సహా పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు 1.10 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మిలటరీ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఆదివారం నమీబియా–కెనడా దేశాల మధ్య జరగాల్సిన రగ్బీ వరల్డ్ కప్ మూడో టోర్నమెంట్ మ్యాచ్‌ను రద్దు చేశారు. తుపాను ధాటికి జపాన్‌లోని హోన్షు ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ గంటకు 216 కి.మీ వేగంతో పెనుగాలులు వీశాయి. ఇటీవలి కాలంలో జపాన్‌లో వచ్చిన తీవ్రమైన టైఫూన్లలో హగిబీస్ ఒకటి. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జపాన్ ప్రధాని షింజో అబేతెలిపారు. టైఫూన్ మృతులకు భారత ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. జపాన్‌లోని కకుడాలో ధ్వంసమైన రోడ్డు -
యానిమేషన్ స్టూడియోకు నిప్పు
టోక్యో: జపాన్‌లోని ప్రముఖ యానిమేషన్ స్టూడియోకు ఓ వ్యక్తి నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని 33 మంది చనిపోగా దాదాపు అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ వాసులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటన క్యోటోలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ దుండగుడు స్థానిక క్యోటో యానిమేషన్ స్టూడియోలోకి ప్రవేశించాడు. ‘మీరు చస్తారు’ అని అరుచుకుంటూ ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి, ఆ వెంటనే నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా ప్రాణ భయంతో పైనున్న మూడంతస్తులకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు మంటల తీవ్రత నుంచి తప్పించుకోలేకపోయారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది 33 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 20 మృతదేహాలు మూడో ఫ్లోర్‌లోనే పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 36 మంది కాలిన గాయాలపాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధితుల్లో చాలా మంది కంపెనీ ఉద్యోగులేనని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడి(41)ని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడు కంపెనీ ఉద్యోగి కాదని మాత్రమే పోలీసులు వెల్లడించారు. తన వస్తువును క్యోటో యానిమేషన్ కంపెనీ దొంగతనం చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదానికి అతడు గ్యాసొలిన్ను వాడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలి నుంచి పోలీసులు కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి నిందితుడివేనా కాదా అనేది తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లకీ స్టార్, కె–ఆన్, హరుహి సుజుమియాతోపాటు పోకెమాన్, విన్నీది పూహ్ వంటి యానిమేషన్ చిత్రాలతో క్యోటో యానిమేషన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కాగా, జపాన్‌లో ఇటువంటి విద్రోహ చర్యలు జరగడం చాలా అరుదు. 2001లో టోక్యోలో అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఓ వ్యక్తి టోక్యోలోని నర్సింగ్ హోం వద్ద కత్తితో దాడి చేసి 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు. స్టూడియో వద్ద సహాయక చర్యలు -
‘హిమాచల్’ మృతులు14
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 14కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 28కి చేరింది. మరణించిన వారిలో 13 మంది సైనికులు ఉన్నారు. వారితో పాటు మృతి చెందిన ఓ పౌరుడి మృతదేహాన్ని శిధిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన 28 మందిలో 17 మంది ఆర్మీ సైనికులు కాగా మరో 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా నాలుగు అంతస్తుల రెస్టారెంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భవనం కూలిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శివ్ కుమార్ తెలిపారు. భవనాన్ని నిబంధనలకు లోబడి నిర్మించకపోవడం వల్లే కూలిపోయిందని పోలీసులు గుర్తించారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆదివారం నుంచే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోహిత్ రాథోర్‌ను ఈ ఘటన వివరాలు సేకరించేందుకు నియమించామని డిప్యూటీ కమిషనర్ కేసీ చమాన్ అన్నారు. మొదట అది భూకంపం అనుకున్నామని గాయపడిన ఓ సైనికుడు చెప్పారు. -
ఈశాన్యంలో వరదలు
గువాహటి: ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతల మవుతున్నాయి. వరదలు, కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లో అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో 16 మంది చనిపోయారు. అస్సాంలోని 21 జిల్లాల్లోని 8.7 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది. శనివారం నాటికి రాష్ట్రంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తోంది. 2,168 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 51 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. లుండింగ్–బాదర్పూర్ పర్వత ప్రాంత రైల్వే లైను దెబ్బతినడంతో ఆ మార్గంలో రైళ్లు రద్దయ్యాయి. అస్సాం ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఆయన సీఎం సోనోవాల్‌తో ఫోన్లో మాట్లాడారు. నీటమునిగిన కజిరంగ నేషనల్ పార్క్ సమీపంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సాయపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, వరదల్లో మేఘాలయలో ఐదుగురు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. -
చైనాలో వరుస భూకంపాలు
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో 12 మంది మృతి చెందగా 125 మంది గాయపడ్డారని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 10:55 గంటలకు (స్థానిక కాలమానం) రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి భూకంపం రాగా, రెండవది మంగళవారం సంభవించిందని చైనా భూకంప విభాగం తెలిపింది. చాంగింగ్ కౌంటీలోని యిబిన్ నగరానికి దగ్గర్లో భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు యిబిన్, జుయోంగ్ పట్టణాల మధ్య ఉన్న రహదారి బీటలు వారడంతో ఆ దారిని మూసివేశారు. దాదాపు ఒక నిమిషం పాటు భవనాలు ఊగాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఊగిసలాట కారణంగా పలు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మరణాల్లో అత్యధిక శాతం భవనాల కింద చిక్కుకొన్నవారివే ఉన్నాయన్నారు. గాయాలపాలైన 53 మందిని చాంగింగ్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని రక్షక బృందం తెలిపింది. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రద్దీ ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 30 మంది మరణించగా.. 40 మందికి గాయాలయ్యాయి. నైజీరియా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కి.మీ దూరంలో ఉన్న కొండుగ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన తీరును బట్టి ఇది బొకో హరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నామని ఆ దేశ అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఫుట్‌బాల్ అభిమానులందరూ కలిసి ఓ హాల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని సదరు హాల్ యజమాని నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయిం దని.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక ఆత్మరక్షణ దళ నేత హాసన్ వెల్లడించారు. అప్పటికే జనాల్లోకి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు సహా ఈ వ్యక్తి తమను తాము పేల్చుకున్నారని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే మరణించగా మిగతా వారు చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పారు. ఎమర్జెన్సీ దళాలు ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని అత్యవసర విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. -
బాంబు పేలుడు : 28 మంది మృతి
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 28 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టర్కీ ఉప ప్రధాని గురువారం వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉప ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని చెప్పారు. అయితే బాంబులు నింపిన వాహనాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని అంకారా గవర్నర్ తెలిపారు. మిలటరీ సిబ్బంది నివసించే ప్రాంతంలో ఈ కారు బాంబు పేలుడు చోటు చేసుకుందన్నారు. టర్కీ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించిందని మీడియా పేర్కొంది. కాగా ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. ఈ దారుణం చోటు చేసుకున్న సమయంలో టర్కీ దేశాధ్యక్షుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రత సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ పేలుడును టర్కీ ప్రభుత్వం ఖండించింది. ఈ పేలుడు బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. టర్కీలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. -
వేర్వేరు ప్రమాదాలు : 20 మంది మృతి
ఢాకా : బంగ్లాదేశ్‌లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. సిరాజ్గంజ్ జిల్లాలో జమునా నది బ్రిడ్జ్‌పై శనివారం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే శుక్రవారం రాత్రి భారీ వర్షాల కారణంగా చిట్టిగాంగ్లో మట్టి చరియలు పడి మూడు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురు మరణించారని పోలీసులు వెల్లడించారు. -
కొండచరియలు పడి 45 మంది మృతి