బరాసత్: పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 8 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. దుత్తపుకుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీల్‌గుంజ్‌లోని కర్మాగారంలో ఘటన జరిగిన సమయంలో పలువురు సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కలున్న 50 నివాసాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వివరించారు.
శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కర్మాగారం యజమాని కొడుకు కూడా పేలుడులో చనిపోయాడన్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా నడుపుతున్న ఈ కర్మాగారంలో బాణాసంచా పేరుతో బాంబులు తయారు చేస్తున్నారా అన్న అనుమానాలకు దర్యాప్తులోనే సమాధానం దొరుకుతుందని చెప్పారు. పేలుడు అనంతరం స్థానికులు కర్మాగారం యజమాని ఇంటిని ధ్వంసం చేశారు. గత మేలో పూర్వ మేదినీపూర్ జిల్లాలోని ఈగ్రాలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 12 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment