సాక్షి,చెన్నై: ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్ ఏఎస్ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు.
బాణసంచా తయారు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఆ మంటల్లో నలుగురు కార్మికలు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాణాసంచా తయారీ ఆ కార్మికుల పాలిట మృత్యువుగా మారింది. మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment