Sivakasi
-
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
చెన్నై: భారతదేశంలో ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.విరుదునగర్ జిల్లా శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్ అనే వ్యక్తికి చెందిన 'శ్రీ సుదర్శన్' క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచాలో మందు నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మహిళలతో సహా 8 మంది మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 6కు పైగా గదులు కూలిపోయాయి.ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow— ANI (@ANI) February 17, 2024 -
TN: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డవారిని శివకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ఆదేశించారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ -
శివకాశీలో భారీ పేలుళ్లు.. 10 మంది మృతి
సాక్షి, తమిళనాడు: విరుదునగర్ జిల్లా శివకాశీలోని రెండు బాణా సంచా తయారీ కేంద్రాల్లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటలో 10 మంది కార్మికులు మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషయంగా ఉంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణా సంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివకాశీ సమీపంలోని రెంగపాలయంలో ఒక బాణా సంచా తయారీ కేంద్రం నడుస్తోంది. ఆ కేంద్రానికి ముందు వైపు ఉన్న షాపులో బాణాసంచా అమ్మకాలు జరుపుతారు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో భారీగా బాణా సంచాను నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చడంతో ఒక క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. దీంతో మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించాయి. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి..
భోపాల్: ఆడపిల్లలనే కంటోందని.. అత్తామామలు కోడలిని తీవ్రంగా వేధించారు. ఒక మగబిడ్డకు జన్మనివ్వడం లేదనే ఆగ్రహంతో కోడలిని దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. శివపురి జిల్లా దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్‌సింగ్ భార్యాభర్తలు. ఇంతకుముందే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ఇటీవల సావిత్రి నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భర్త రతన్‌సింగ్, అతడి తల్లిదండ్రులు కిలోల్డ్ సింగ్, బేను భాయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలను కనడంపై తీవ్రంగా దూషిస్తూ దాడి చేస్తుండేవారు. తాజాగా నాలుగో బిడ్డ కూడా ఆడపిల్ల కావడంతో సావిత్రిని గురువారం భర్తతో పాటు అత్తామామ ఆమె గొంతు నులిమి హత్య చేశారు. తన సోదరి మృతి చెందడంపై సావిత్రి సోదరుడు కృష్ణ భగేల్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తామామ, భర్త చేసిన అఘాయిత్యం బయటపడింది. దీంతో రతన్‌సింగ్, కిలోల్డ్ సింగ్, బేను భాయ్‌లను అరెస్ట్ చేశారు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన సోదరిని వేధించేవాడని కూడా అతడు పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఈ-పాస్ కోసం అప్లై..‘సిక్స్’ తెచ్చిన తంటాతో పరేషాన్ చదవండి: అడవిలో 18 ఏనుగుల అనుమానాస్పద మృతి -
బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, ఆరుగురు మృతి
చెన్నై : తమిళనాడులోని శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో ఓ ప్రైవేటు బాణాసంచా తయారీ పరిశ్రమలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృత్యువాతపడగా.. 14 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మధురై హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ రోజు మధ్యాహ్నమే ఆదేశించింది. చదవండి: బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూతో ఉడాయించిన డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
చీకటి వెలుగుల శివకాశి
దీపావళిలోని వెలుగునీడలు జీవితానికి సంకేతంగా భావిస్తారు. అందుకనే చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి అన్నారో సినీకవి..! కటిక చీకట్లకి కొలమానం అమావాస్య అయితే.. వెలుగుల వెల్లువకు పతాక సన్నివేశంగా దీపావళిని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒకేసారి కలగలిపి మనముందు ప్రజ్వలించే పండుగే దీపావళి. సుఖదుఃఖాలకు, జయాపజయాలకు, మంచిచెడులకు నిండైన ప్రతీకే దీపావళి. జీవితంలో తారసిల్లే మంచిచెడులను కలగలిపి దీపావళి సరంజామాతో పోల్చిచూస్తారు. అందులోనూ దీపావళి అందరి పండుగ. దీపావళి అంటే మనందరికీ ఎంత సరదానో..! మరి ఆ సరదా వెనుకు దాగి ఉన్న నిజాల వెలుగులు కూడా తెలుసుకోవాలి కదా..! జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. గువ్వలా బతకమని తారాజువ్వ చెబుతుంది. నిప్పుతోటి చెలగాటం వల్ల ముప్పుతప్పదని తానందుకు ప్రత్యక్ష సాక్ష్యమని టపాకాయ చెబుతుంది'. ఇలా తరచి తరచి చూస్తే దీపావళి నిండా జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చాలానే ఉంటుంది. తమస్సు నుంచి ఉషస్సుకు దీపావళి పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది టపాకాయలు. ఆ టపాకాయలకు దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ప్రాంతం శివకాశి. ఇక్కడ చాలా తక్కువ ధరకు మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. మనకు చౌకగా లభ్యమయ్యేవంటే మక్కువ ఎక్కువ. ప్రపంచ మార్కెట్లో శివకాశి బాణాసంచాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివరాల్లోకెళ్తే.. 1960వ సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే శివకాశిలో ఉన్న నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ది చెందాలని నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. ఈ విషయాలు తెలుసుకున్న అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ ఈ నగరానికి కుట్టి జపాన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది మినీ జపాన్‌గా ప్రశస్తి సాధించింది. కేవలం నెహ్రూ పేరు పెట్టారనే కాదు కానీ.. ఇది నిజంగా మినీ జపానే..! ఎందుకంటే ఇక్కడి వారందరూ కుటీర పరిశ్రమలపై ఆధారపడే జీవనం సాగిస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, నాణ్యత, కలిసికట్టుతనం వంటి లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దీపావళి సమీపించే కొద్దీ ఇక్కడ పనిచేసేవారు ఎక్కువ శ్రమిస్తారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. నేడు ఈ ప్రాంతంలో నిరుద్యోగం కనిపించదు. 100శాతం ఉపాధి ఈ పట్టణం సొంతం. దాదాపు 3లక్షల మంది కార్మికులు బాణాసంచా, అగ్గిపుల్లల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. శివకాశి శివారులోని 15కు పైగా గ్రామాల్లో ఈ పరిశ్రమలు ఉండగా తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాదిమంది కార్మికులు వలసలు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. శివకాశి స్వరూపం రాష్ట్రం - తమిళనాడు జిల్లా -విదూర్నగర్ పట్టణ విస్తీర్ణం - 343.76 జనాభా - 2.6 లక్షలు అక్షరాస్యత - 77శాతం పరిశ్రమలు - 8,000 బాణాసంచా వ్యాపారం - ఏటా దాదాపు 2వేల కోట్లు వెలుగుకు మార్గం శివకాశిలో తయారైన బాణాసంచా దీపావళి రోజున దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి దీపపు కాంతి వెలుగు ప్రసరించడానికి కారణమయ్యే అగ్గిపుల్లలు కూడా 70శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే పర్వం సంధ్యా దీపం నమోస్తుతే జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ఎప్పుడు ఏం జరుగుతుందో..! పుష్కరకాలంగా ఈ ప్రాంతంలో అనేక ఘోరప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్దీ ప్రమాదాలు అధికమవుతూ ఉంటాయి. పండుగ సమయంలో డిమాండ్ రీత్యా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇక్కడ అనుమతి పొందిన 700 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 2లక్షల మంది కార్మికులు, అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్షమంది దాకా పనిచేస్తుంటారు. దేశానికి అవసరమైన బాణాసంచాలు, అగ్గిపుల్లలు 80శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి కార్మికులు పరిశ్రమల్లో రసాయనాల నుంచి తలెత్తే రుగ్మతల నుంచి బయటపడడానికి ఎక్కవగా అరటిపండ్లు తింటుంటారు. ఇక్కడి పొడి వాతావరణం బాణాసంచా తయారీకి అనుకూలం. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుంటాయి. భారీవర్షాలు, నదులు, పచ్చని పంటపొలాలు ఇక్కడ పెద్దగా కనిపించవు. దీపావళి రోజున చీకట్లు తొలగించి వెలుగులు విరజిమ్మాల్సిన బాణసంచా ఇక్కడి అభాగ్యుల జీవితాల్లో చీకట్లను నింపిన సందర్భాలెన్నో..! -
‘శివకాశి’తుస్!
సాక్షి, చెన్నై : తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా విరుదునగర్. ఈ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణాన్ని మినీ జపాన్‌గా పిలుస్తుంటారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రా మాలలో ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచా తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణ సంచాల్ని త యారు చేసేవారు. అనేక కుటుంబాలు వంశపారంపర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చేవారు. అందుకే ఇక్కడ ప్రతి ఏటా దీపావళి వస్తుంటే ప్రజల గుండెల్లో దడ తప్పదు. నిత్యం ప్రమాదాలు, మరణాలు, క్షతగ్రాతులతో ఆస్పత్రుల్లో ఆర్తనాలు మిన్నంటేవి. ప్రమాదాల నివారణ లక్ష్యంగా పాలకులు తీసుకున్న నిర్ణయాలు, కొ రడా ఝుళిపించడంతో కుటీర, వంశపారంపర్య పరిశ్రమలన్నీ కనుమరుగయ్యాయి. వేలల్లో ఉ న్నపరిశ్రమలు, వందలకు పరిమితమయ్యాయి. ఆంక్షల కొరడా శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమా రు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలుండేవి. మరో 400 వరకు పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో జరిగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణసంచా మందుగుండు సామగ్రి కి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేటతెల్లం చేసింది. ఇక్కడి ప్రజల జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యాపరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా ఇక్కడ ప్రతి కుటుం బంలోనూ తల్లిదండ్రులతో పాటుగా యుక్త వయస్సుకు వచ్చిన యువతీ, యువకులు ఏదో ఒక పరిశ్రమలో పనిచేయక తప్పదు. వీరికి రోజు వారీగా పీస్ రేట్(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా వారానికి లేదా నెలకో వేతనాలు ఇవ్వడం జరిగేది. ఈ పరిశ్రమల్లో దినదిన గండంతో కాలాన్ని నెటుకొస్తూ, ప్రమాదాలతో ఛిద్రం అవుతున్న కార్మిక బతుకుల్ని పరిగణలోకి తీసుకున్న పాలకులు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆంక్షలు, కొరడా ఝుళిపించారు. రెండేళ్లుగా ప్రమాదాల సంఖ్య తగ్గించారు. తగ్గిన ఉత్పత్తి ఒకప్పుడు నిత్యం బాణసంచా తయారీ సాగితే, ఆంక్షలు కొరడాల రూపంలో జూన్ లేదా జూలైలో మొదలెట్టి దీపావళి నాటికి ముగించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది నుంచి బాణసంచా ఉత్పత్తి అన్నది క్రమంగా తగ్గించుకోవాల్సిన వచ్చింది. గత ఏడాది 20 శాతం ఉత్పత్తి తగ్గగా, ఈ సారి 40 శాతం ఉత్పత్తి తగ్గడంతో పనులు లేక కార్మికులు కష్టాలు పడాల్సిన పరిస్థితి. గతంలో జరిగిన ఉత్పత్తి, డిమాండ్ మేరకు ఉత్తరాది నుంచి సైతం ఇక్కడికి వచ్చి పనుల్లో నిమగ్నమైన వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో ఆ కార్మికులకు మిగిలింది కన్నీళ్లే. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా కోర్టు బాణ సంచాల తయారీకి కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధలన్ని విధించింది. గ్రీన్ బాణ సంచాల ఉత్పత్తి మాత్రమే చేయాలన్న ఆదేశాలు జారీచేసింది. శివకాశిలో ఈ ఏడాది ఆ దిశగానే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎదురైంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఎదురు చూపులతో ఈ ఏడాది ఉత్పత్తిని మరీ తగ్గించేశారు. ఆర్డర్లు మరీ తక్కువగానే ఉండడంతో ఈ ఏడాది 60 శాతం ఉత్పత్తిని మాత్రమే శివకాశిలోని కొన్ని పరిశ్రమలు పూర్తిచేశాయి. ప్రస్తుతం మార్కెట్లోకి ఈ బాణసంచాల్ని తరలించే పనిలో ఆయా పరిశ్రమలు, ఆర్డర్లు పొందిన వారు నిమగ్నమయ్యారు. బాణసంచాల దుకాణాల ఏర్పాటుకు సైతం ఆంక్షలు మరీ ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తూ వస్తున్నారు. కోర్టులో ఉన్న పిటిషన్ మీద మంగళవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అనుకూలంగా తీర్పు వస్తే సరి లేని పక్షంలో పరిశ్రమల్ని మూసి వేసి రానున్న కాలంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడం మంచిదన్న భావనలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. 40 శాతం తగ్గిన ఉత్పత్తి ఈ ఏడాది 40 శాతం ఉత్పత్తి తగ్గగా, రానున్న కాలంలో క్రమంగా తగ్గి, చివరకు ఒకప్పుడు మోత మోగిన మినీ జపాన్ మున్ముందు తుస్..మనే అవకాశాలు ఎక్కవే కనిపిస్తున్నాయి. ఇదే జరిగిన పక్షంలో బతుకు కోసం వలసలు తప్పవన్న ఆవేదనను వ్యక్తం చేసే లక్షలాది కుటుంబాలు ఇక్కడ కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. సరికొత్త పేర్లు గ్రీన్బాణా సంచా ఉత్పత్తిలో భాగంగా ఈ ఏడా ది సరికొత్త పేర్లను అనేక పరిశ్రమలు ఆయా ప్యాకింగ్ మీద పొందు పరిచి ఉన్నాయి. ట్విట్ట ర్, ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సాప్, వీడియో గేమ్స్,బాహుబలి, జల్లికట్టు పేర్లతో గ్రీన్ బాణా సంచాలను మార్కెట్లోకి దించడం విశేషం. ఇక, ఈ ఏడాది బాణా సంచాల « ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ధరలు అమాంతంగా పెరిగి ఉన్నాయి. పది నుంచి 20 శాతం మేరకు ధరలు పెరగడంతో విక్రయాలు ఏ మేరకు సా గుతాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో వర్షాలు ముంచుకొస్తుండటంతో వ్యాపారుల్లో టెన్షన్ అన్నది మరింతగా పెరిగి ఉన్నది. -
శివకాశి
-
దీపాల చీకట్లలో శివకాశీలు
సంతోషాల వెలుగుల వెనుక లక్షల చీకటి కథలున్నాయి. పండుగల మతాబుల మాటున ఎన్నో కన్నీటి వ్యథలున్నాయి. అవే.. శివకాశి బాణసంచా తయారీ వెనుక కన్నీటి గాథలు. దీపావళి పండుగొస్తుందంటే.. ఆంక్షలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలు శివకాశిలో జీవనంపై అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. శివకాశీల జీవనంపై, దక్షిణ కాశిగా పేరొందిన శివకాశి చరిత్రపై ఫోకస్. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. అదే వారి జీవనాధారం.. అదే వారి జీవితం. తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివకాశి పట్టణంలోనే బాణసంచా కర్మాగారాలు నెలకొనడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. దాదాపు వందేళ్ల బాణసంచా తయారీ కర్మాగారాల చరిత్ర కలిగిన శివకాశికి కుట్టి (చిన్న) జపాన్ అని పేరు ఉంది. 20వ శతాబ్దంలో ఇక్కడ 30 మందితో ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రం, 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమల స్థాయికి ఎదిగింది. నేటికి దాదాపు ఆరులక్షల మందికి ఉపాధిని అందించింది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణసంచా తయారు చేసే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలో 12 యూనిట్లు అయ్యేలా అభివృద్ధి చెందింది. దీనిని చూసి కొందరు ఔత్సాహికులు ఇదే వ్యాపారంగా మొదలుపెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు లక్షలాదిగా ఉపాధి పొందే అవకాశం కలగటం ఈ ప్రాంతం దినదినాభివృద్ధితో ప్రపంచంలోనే బాణసంచా తయారీలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు తక్కువ. సారవంతమైన భూమి కూడా కాదు. భూమిలో రసాయనాలు కలుస్తుండటంతో ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. నదులు, సాగునీరు లేకపోవటంతో చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప మరో మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకు తెరువు కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లేవారు. దీంతో షణ్ముగ నాడార్ టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించటంతో ప్రజలు వీటిని తయారుచేసుకుంటూ జీవనం సాగించడం ప్రారంభించారు. ఒకప్పుడు జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వలస వెళ్లేవారు, ఇప్పుడు బయటి ప్రాంతాల నుండి ఇక్కడి ఉపాధికి వచ్చే స్థాయికి ఎదిగారు. దీంతో శివకాశి చుట్టూ పుట్టగొడుగుల్లా బాణసంచా కర్మాగారాలు పుట్టుకొచ్చాయి. ప్రమాదాలు, ఆంక్షల దృష్ట్యా కర్మాగారాలు విశాలంగా ఊర్లకు దూరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏటా ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల వల్ల వ్యాపారం మూతపడి ఆందోళనకరంగా మారుతోంది. గతేడాది 5 వేల కోట్ల నుండి 6 వేల కోట్ల రూపాయల మేరకు జరిగిన వ్యాపారం, ఈ ఏడాది ఆంక్షల కారణంగా 3 నుండి 4 వేల కోట్లకు తగ్గుముఖం పట్టడం శివకాశి బాణసంచా తయారీదారులపై ప్రభావం చూపుతోంది. ఇక్కడి నుండి ఏటా 80 నుండి 90 శాతం బాణసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుంది. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు జరుగుతుండటం శివకాశి ఘనత. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తయారీదారులు, వ్యాపారం సగానికి పడిపోయేందుకు కారణమైంది. ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. వెలుగు చాటున చీకటి! శివకాశిలో బాణసంచానే వృత్తిగా జీవిస్తున్న లక్షలాది ప్రజలు ఈ పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. ప్రమాదమని తెలిసినా అదే జీవితంగా జీవిస్తారు. వారికదే ఆధారం. అవి లేకపోతే పస్తులుండాల్సిందే. ఏడాదికి పది నెలలు వీటిపైనే ఆధారపడతారు. ప్రమాదమని భయపడితే బతికే మార్గమే లేదు. భయంతో శివకాశిని వదిలేసిన వారెందరో ఉండొచ్చు కానీ ఇదే జీవితం అని నమ్మి వృత్తే దైవంగా భావించేవారే ఎక్కువ. మిగిలిన పనులకన్నా ఇక్కడ పనికి కూలి కాస్తంత అధికంగా దొరకటమే కారణం. జీవితమంతా పోరాటమే... చస్తామనే భయం కన్నా... బతికినన్నాళ్లూ సంతోషంగా కన్నీళ్లను దిగమింగి బతకాలనుకుంటారు. ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు. అధికారులు.. నిబంధనలు, నియమాలు.. ఆంక్షలు సక్రమంగా ప్రమాదాలు ఉండవనేవి అక్కడి కార్మికుల మాట. ఒకవేళ ఆంక్షల పేరుతో పరిశ్రమలు మూతపడితే మళ్లీ వీరి జీవితాలు రోడ్డునపడతాయి. అందుకే వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీలు, కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఉపాధి కల్పించటానికి ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది లక్షల మంది! ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలు మూతపడకుండా కేంద్రాలుగా కొన్ని ఆంక్షలతో నడపాలి. ఏటా పండుగ వెలుగులను అందించే శివకాశీల జీవితాలు వెలుగులోకి రావాలని కోరుకుందాం.. పండుగ వెలుగులను అందరికీ పంచుదాం.. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
ఈ నియంత్రణలైనా ఫలిస్తాయా?
దీపావళి టపాసుల విక్రయాలపై ఉన్న నిషేధం పోయి ఈసారి వాటి వినియోగంపై నియంత్రణ లొచ్చాయి. గత రెండేళ్లుగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివార్లలోనూ టపాసుల విక్రయాలను పండుగకు 20 రోజుల ముందు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈసారి అందుకు భిన్నంగా వాటిని కాల్చడానికి కొన్ని పరిమితులు విధించింది. దీపా వళి నాడు రోజంతా కాకుండా రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకల్లా టపాసులు కాల్చ డాన్ని నిలిపేయాలని ఆంక్షలు విధించింది. అలాగే పరిమితికి మించిన ధ్వని, కాంతి, కాలుష్యం వగై రాలు లేకుండా చూడమని ఢిల్లీ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ నియంత్రణలే రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఇతర ఉత్సవాలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. దీపావళి పండుగ హడావుడంతా చీకటిపడ్డాక మొదలవుతుంది. పోటాపోటీగా రకరకాల బాణసంచా, టపాసులు కాల్చడం పిల్లలతోపాటు పెద్దలకూ సరదాయే. కానీ మరుసటి రోజు ఉదయం వీధులన్నీ యుద్ధ క్షేత్రా లను తలపిస్తాయి. వ్యర్థాలతో వీధులన్నీ నిండిపోతాయి. ఇదంతా కంటికి కనిపించేది. పర్యావరణ చైతన్యం పెరగడం వల్ల కావొచ్చు...ఆ టపాసులు, బాణసంచా తీసుకొచ్చే కాలుష్యంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరంలో సాధారణ దినాల్లోనే కాలుష్యం హద్దులు దాటుతుండగా దీపావళి రోజున అది మరింతగా పెరుగుతోంది. నిరుడు దీపావళి రోజున న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మాములు రోజులతో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువున్నదని తేలింది. ఈసారి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల ద్వారా ‘సురక్షితమైన హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఈసారి ఉత్ప త్తిచేయాలి. వాటినే అమ్మాలి. అవే కాల్చాలి. భారీగా కాలుష్యం వెదజల్లే అన్ని రకాల బాణసంచా, టపాసులు తయారు చేయడం, వాటిని విక్రయించడం, అవి కొనుక్కుని కాల్చడం ఈ తీర్పు పర్యవ సానంగా చట్టవిరుద్ధమవుతాయి. అలాగే బాణసంచా, టపాసులు రాత్రి 8–10 మధ్య మాత్రమే విని యోగించాలి. అంతకు ముందూ, ఆతర్వాత కాలిస్తే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు... వాటిని ఎవరింటి ముందు వారు కాల్చడం కాక అందరూ ఒకచోట చేరి ఆ కార్యక్ర మాన్ని పూర్తి చేసే విధానం అనుసరించాలని సూచించింది. దాంతోపాటు ఆకాశంలోకి రివ్వును దూసుకుపోయి అక్కడ రకరకాల రంగుల్లో కాంతులు వెదజల్లుతూ పెను శబ్దాలతో పేలే టపాసుల్ని కూడా నిషేధించింది. వీటితోపాటు ఆన్లైన్ విక్రయాలు ఉండరాదని చెప్పింది. అయితే ప్రభుత్వాలు, వివిధ సామాజిక సంస్థల క్రియాశీలపాత్ర లేకుండా ఇదంతా సాధ్యమేనా? ముందస్తుగా వివిధ మార్గాల్లో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టకుండా కింది స్థాయికి ఇదంతా చేరు తుందా? పోలీసులు ప్రతి వీధిలోనూ, ఇంటి ముందూ పహారా కాసి అదుపులో పెట్టడం సాధ్యమా? మన దేశంలో ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు మాత్రమే దానిపై చర్చ మొదలవుతుంది. న్యాయస్థానాలు కూడా ఆ మాదిరిగానే స్పందిస్తున్నాయి. రెండు మూడేళ్లుగా దీపావళి టపాసుల విషయంలో విచారణలు సుప్రీంకోర్టులో 15, 20 రోజుల ముందు సాగుతున్నాయి. ఉత్తర్వులు వెలు వడుతున్నాయి. ఈసారి కూడా పండుగ పక్షం రోజులుందనగా న్యాయస్థానం మార్గదర్శకాలొ చ్చాయి. నిజానికి దీపావళి కోసమని బాణసంచా, టపాసులు ఈపాటికే భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఉంటారు. వీటితోపాటు పాత నిల్వలుంటాయి. తమిళనాడులోని శివకాశిలోనూ, దేశంలోని కొన్ని ఇతరచోట్లా బాణసంచా, టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతూనే ఉంటుంది. వీటిని దీపా వళికి మాత్రమే కాక పెళ్లిళ్లు, వేర్వేరు పండుగల్లో కూడా వినియోగిస్తారు. ఇప్పటికే దేశ రాజధానిలో వందల టపాసుల దుకాణాలు వెలిశాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుకావడం సాధ్యమా? అందుకు భిన్నంగా ఏడాది ముందుగానే నిర్ణయం తీసు కుని ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు నిరంతరం ఆ దిశగా పనిచేస్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది. బాణసంచా, టపాసుల తయారీ విషయంలో ఇప్పుడు విధించిన పరిమి తుల వల్ల వ్యర్థాల పరిమాణం తగ్గడంతోపాటు ధ్వనికాలుష్యం, కాంతి తీవ్రత పరిమితమవుతాయని లెక్కలేస్తున్నారు. మంచిదే. కానీ అసలు గ్రీన్ టపాసులకు అవకాశమే లేదని ఉత్పత్తిదారులు చెబు తున్నారు. వాటిల్లో వాడే రసాయనాలను కొంత మేర తగ్గించవచ్చుగానీ దానికి సమయం పడుతుం దంటున్నారు. ఈ ఉత్తర్వులు కనీసం ఏడెనిమిది నెలలక్రితం వచ్చి ఉంటే ఉపయోగం ఉండేదేమో! వాయు కాలుష్యం తీవ్రత వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయి. విపరీతమైన దగ్గు, కఫం, ఊపిరా డనీయని ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధి, అలెర్జీలు, కేన్సర్ వగైరాలు వస్తాయి. ఢిల్లీ నగరంలో ఇప్పుడున్న వాయు కాలుష్యం వల్ల మనిషి ఆయుఃప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. దేశంలో హైదరాబాద్‌తోసహా వివిధ నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లు ఏర్పాటు చేశారుగానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం సిద్ధిస్తున్నదో అనుమానమే. పరిశ్రమల యజ మానుల్లో కాలుష్య నియంత్రణపై అవగాహన పెరిగిందా? కాలుష్య నియంత్రణ బోర్డులు చురుగ్గా వ్యవహరించి చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం తీవ్రతపై అవగాహన పెరిగి జనం ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తుంది. దీపావళి టపాసులు, బాణ సంచా విషయంలో సుప్రీంకోర్టు తాజా నియంత్రణలు హర్షించదగ్గవే. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో ఇవి ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది అనుమానమే. పైగా రాజకీయపార్టీలు, సామాజిక సంస్థల తోడ్పాటు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అది జరిగే పనేనా? జల్లికట్టు, కోడిపందాలు వగైరా అంశాల్లో కోర్టు ఉత్తర్వులు ఎలా అమలయ్యాయో అందరికీ తెలుసు. జనం మనోభావాల పేరిట దేన్నయినా చలామణి చేయించే పార్టీలు, సంస్థలు ఉన్నంతకాలం ఫలి తాలు పరిమితంగానే ఉంటాయి. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురి మృతి
సాక్షి,చెన్నై: ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్ ఏఎస్ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఆ మంటల్లో నలుగురు కార్మికలు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాణాసంచా తయారీ ఆ కార్మికుల పాలిట మృత్యువుగా మారింది. మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
శివకాశి బాణసంచా ఫ్యాకర్టీలో భారీ పేలుడు..
-
శివకాశి నెత్తిన ఢిల్లీ బాంబు
-
శివకాశి నెత్తిన ఢిల్లీ బాంబు
సాక్షి, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచాపై విధించిన నిషేధం శివకాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. బాణసంచా విక్రయాల్లో దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఢిల్లీలో నిషేధం అమల్లోకి రావడంతో శివకాశి బాణసంచా తయారీదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ. 1000 కోట్ల విలువైన సుమారు 50 లక్షల కేజీల బాణసంచా సామగ్రిని గోదాములకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా కాల్చడం మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు విరుదునగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బాణసంచా మార్కెట్లోకి తరలుతుంటాయి. బాణసంచా తయారీకి పెట్టింది పేరుగా , కుట్టి జపాన్‌గా విరుదునగర్ జిల్లాలోని శివకాశి ప్రసిద్ది చెందింది. ఇక్కడ దీపావళిని పురస్కరించుకుని ఏటా రూ.5 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తిదారులకు షాక్‌ల మీద షాక్‌లు తప్పడం లేదు. ఓ వైపు ప్రమాదాల భయం వెంటాడుతుంటే, మరోవైపు చైనా రూపంలో కష్టాలు తప్పడం లేదు. చాప కింద నీరులా చైనా పటాకులు దిగుమతి అవుతోండటం గగ్గోలు రేపుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించాలని శివకాశి బాణాసంచా తయారీదారులు నినదిస్తూ వస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. తాజాగా దీపావళి పర్వదినం సమీపిస్తుండటంతో ఏడాది పొడవునా శ్రమించి ఉత్పత్తి చేసిన బాణసంచాను మార్కెట్లోకి తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఆన్లైన్ ద్వారా కూడా బాణసంచా విక్రయాలకు అనేక వర్తక సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఏటా ఏదో ఒక రూపంలో కష్టాలు, నష్టాలు ఎదురు అవుతున్న నేపథ్యంలో ఈసారి కూడా తాము ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనన్న ఆందోళన విరుదునగర్ జిల్లా బాణసంచా తయారీదారుల్లో ఉంది. ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో గట్టి భద్రతా చర్యలు చేపట్టి ఉన్నా, మరో వైపు వర్షం రూపంలో తమ వ్యాపారం దెబ్బ తింటుందేమోనన్న బెంగ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రూపంలో ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు వచ్చి పడిందని చెప్పవచ్చు. ఢిల్లీ దెబ్బ ...శివకాశికి షాక్ దేశంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో బాణా సంచాల విక్రయాలు అత్యధికంగా సాగుతున్నాయి. శివకాశి నుంచే ఉత్తరాది నగరాలకు బాణా సంచాలను తరలిస్తున్నారు. ఈ సమయంలో ఢిల్లీలో బాణాసంచా అమ్మకంపై నిషేధం అమల్లోకి రావడం శివకాశి ఉత్పత్తిదారుల నెత్తిన పిడుగు పడ్డట్లయింది. వాయు కాలుష్య ప్రభావం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలపై నిషేధం పడింది. దీంతో శివకాశి నుంచి తరలించాల్సిన బాణా సంచాలు గోడౌన్లకు పరిమితం చేయాల్సిన పరిస్థితి. శివకాశికి చెందిన పరిశ్రమలు ఢిల్లీలో బాణాసంచాల విక్రయాలకు ప్రత్యేక లైసెన్స్‌లను పొంది ఉన్నాయి. ఆ మేరకు 450 వరకు ఓపెన్ టైప్ లైసెన్స్‌లు, వెయ్యి వరకు చిన్న చిన్న దుకాణాల ఏర్పాటుకు తగ్గ లైసెన్స్‌లు కల్గి ఉండగా, ప్రస్తుతం అవన్నీ రద్దు కానుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం విక్రయంలో 20 నుంచి 25 శాతం మేరకు విక్రయాలు ఢిల్లీలో సాగుతాయని, ఈ నిషేధంతో 50 లక్షల కేజీల మేరకు బాణాసంచా గోడౌన్‌కు పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సరకును బయటకు పంపించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏమి చేయాలో తోచడం లేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. నిషేధం కారణంగా రూ. వెయ్యి కోట్ల మేరకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఇతర ప్రాంతాలకు బాణసంచా రవాణాపై సైతం ప్రభావాన్ని చూపుతుందని, నిషేధం ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునర్ పరిశీలించాలని పరిశ్రమల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
ప్రియుడికి సిఫారసు?
తాను నాయకిగా నటించాలంటే తన ప్రియుడికి దర్శకత్వం అవకాశం ఇవ్వాలన్నది నటి నయనతార తంతుగా మారిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయకి నయనతార అన్నది తెలిసిన విషయమే.దాదాపు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ క్రేజీ భామను ఇళయదళపతితో మరోసారి రొమాన్స చేరుయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపొస్తోంది. నయన్ తొలుత విజయ్‌తో శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేశారు.ఆ తరువాత విల్లు చిత్రంలో ఆయనతో నాయకిగా నటించారు.ఆపై వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. విజయ్ భైరవా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్స సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.ఆయనతో తెరి చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో కథానాయకిగా ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది.అందులో భాగంగా నటి నయనతార పేరు చర్చకు వచ్చిందని సమాచారం. విజయ్‌తో నయనతార అంటే ఆ క్రేజే వేరని, అదే విధంగా ఆమె నాయకి అయితే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వ్యాపారం జరుగుతుందనే ఆలోచనతో నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నయనతార ఇప్పుడు తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివకు సిఫార్సు చేసే పనిలో ఉన్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. నటుడు సూర్య హీరోగా నటించనున్న తాజా చిత్రం తానా సేర్న్ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నారు. నయనతార సిఫార్సు కారణంగానే విఘ్నేశ్శివకి అవకాశం వచ్చిందని ఒక వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇందులో నాయకిగా నయనతారనే నటించనున్నట్లు టాక్ వినిపించింది. అయితే చివరికి ఆ అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించింది. ఇకపోతే విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నయనతార నటించడానికి అంగీకరిస్తే తదుపరి విజయ్ తన భర్త దర్శకత్వంలో నటించాలనే షరతును విధించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు దోరా అనే స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైక్కా నోడిగళ్ చిత్రం చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో శివకార్తికేయన్‌తో జత కడతానికి సిద్ధం అవుతున్నారు. -
గ్రౌండ్ రిపోర్ట్@ శివకాశి
-
బతుకు బుగ్గి
► దినదిన గండంగా బతుకులు ► మినీ జపాన్‌లో పేలుళ్లతో కలవరం ► కన్నీటి మడుగులో వందలాది కుటుంబాలు ►జీవితాల్ని మింగేస్తున్న బాణసంచా పరిశ్రమ తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా, ‘విరుదునగర్’ ఈ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణాన్ని మినీ జపాన్‌గా పిలుస్తున్నారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచాల తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణసంచాల్ని తయారు చేస్తూ ఉండే వారు. ఇది నిత్యం ప్రమాదాలకు దారి తీస్తుండేది. ఈ తయారీలో నిమగ్నమై ఒకరిద్దరు గతంలో మృతి చెందే వారు. పలువురు గాయాలతో బయట పడే వారు. అనేక కుటుంబాలు వంశపారం పర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చారంటే, ఏ మేరకు ఇక్కడ ఉత్పత్తి సాగుతున్నదో స్పష్టం అవుతోంది. సాక్షి, చెన్నై: బతుకు బుగ్గి: శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమారు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు. మరో 400 వరకు అతి పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో సాగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణ సంచా మందుగుండు సామగ్రికి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేట్టతెల్లం చేసింది. దీంతో ఇక్కడి వారి జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యా పరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలు బడిబాట పట్టినా, యుక్త వయస్సు వచ్చే సరికి తిరిగి బాణ సంచాల తయారీలో నిమగ్నం కావాల్సిందే. ఈ ఆధునిక యుగంలో సరి కొత్త తరహా బాణ సంచాల తయారీ వేగం పుంజుకోవడంతో పాటు పోటీతత్వం పెరగడంతో వేలాది కుటుంబాలు తమ కుటీర పరిశ్రమలకు తాళాలు వేసుకోక తప్పలేదు. పొట్ట కూటి కోసం పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆశ్రయించక తప్పలేదు.వీరికి రోజు వారిగా పీస్ రేట్(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా వారానికి లేదా నెలకో వేతనాలు ఇచ్చే పరిశ్రమలు ఉన్నాయి. దీంతో అధికంగా పీస్‌లను తయారు చేయాలన్న ఆత్రుతతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. దిన దిన గండంతో కాలాన్ని నెటుకొస్తుంటారు. పరిశ్రమలోకి అడుగు పెట్టాక తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అన్న ఆందోళన కార్మికుల్లో ఉన్నా, బతుకు జీవనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టక తప్పడంలేదు. దీనిపై రాష్ట్ర కార్మిక బోర్డు చూసి చూడనట్టు గతంలో వ్యవహరించడంతో 2012లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. మూల్యంతో కొరడా: శివకాశి పరిసరాల్లోకి అడుగు పెడితే చాలు, ఏదో ఒక గ్రామంలో ఎన్నో కుటుంబాలు బాణసంచా బాధితులుగా కనిపిస్తుంటారు. ఇక్కడి పరిశ్రమల్లో అగ్ని, ప్రమాదాల నియంత్రణకు చర్యలు అంతంత మాత్రంగానే గతంలో ఉండేది. ఓ సంస్థ పేరుతో లెసైన్స్‌లు పొంది, దాని ఆధారంగా మరెన్నో పరిశ్రమలు గతంలో నడిచేవి. ఇక్కడ 1981లో తొలిసారిగా పేలుడు చోటు చేసుకుంది. తదుపరి 2000 సంవత్సరం నాటికి ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య 50గా తేలింది. తదుపరి ప్రతి ఏటా కనీసం 20 నుంచి 50 మంది వరకు మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతుంటాయి. 2002లో కోవిల్ పట్టి వద్ద జరిగిన బాణ సంచా పేలుడులో 16 మంది, 2005లో మానాంపట్టిలో 20 మంది, 2006లో బర్మా కాలనీలో 12 మంది, 2007లో నారాయణ పురంలో నలుగురు, 2009లో శ్రీకృష్ణ ఫైర్ వర్క్‌లో 18 మంది, అనిల్ ఫైర్ వర్క్స్‌లో ముగ్గురు, 2010లో ఏడుగురు, 2011లో 14 మంది చొప్పున ఒకే చోట ప్రమాదాల్లో విగత జీవులయ్యారు. 2009లో పళ్లిపట్టు సమీపంలో, శివకాశిలోని శ్రీకృష్ణ ఫైర్ వ ర్క్స్, అనిల్ ఫైర్ వర్క్‌లలో చోటు చేసుకున్న బాణ సంచా ప్రమాదాలతో ప్రభుత్వం మేల్కొంది. బాణసంచా పరిశ్రమలకు కొత్త నిబంధనల్ని విధించినా ఆచరణలో విఫలమయ్యారు. కొన్ని రకాల పొటాషియం పదార్థాల్ని ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్నా, ఆ పదార్థాలే ఇక్కడి పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి. పాలకులు, అధికారులు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం 2012లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓం శక్తి ఫైర్ వర్క్స్‌లో చోటు చేసుకున్న బాణ సంచా పేలుడుకు నలభై మంది మరణించారు. దీంతో మేలుకున్న అధికార వర్గాలు నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. జూన్ నుంచి తయారీ ఒకప్పుడు నిత్యం తయారీలో నిమగ్నం అయితే, ప్రభుత్వ కొరడాతో జూన్ నుంచి పనుల్ని మొదలెట్టే పనిలో పడ్డారు. దీపావళికి ముందు రోజు వరకు ఈ పనులు కొనసాగించాల్సిందే. ఉత్తరాది నుంచి కూడా కూలీల్ని ఇక్కడికి రప్పించుకోవడం కొంత కాలంగా జరుగుతోంది. ఇక, శివకాశిలోని పరిశ్రమలు వ్యాపార దృక్పథంతో తమ సంస్థలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరించే పనిలో పడ్డాయి. దీంతో 2013 నుంచి ప్రమాదాలు ఒక్క శివకాశినే కాదు, పలు జిల్లాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. 2013లో అరియలూరు, విల్లుపురం, తూత్తుకుడిల్లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 13 మంది బలయ్యారు. 2014లో తంజావూరు జిల్లా కుంభకోణంలో తొమ్మిది మంది ఓ పరిశ్రమలో, 2014లో కాంచీపురం సమీపంలో ఐదుగురు, 2015లో కడలూరులో ఆరుగురు విగత జీవులయ్యారు. ప్రమాదాల సంఖ్య తగ్గడం, మృతుల సంఖ్య కూడా తగ్గినా దీపావళి సమీపంలో ఈ బాణ సంచా రూపంలో దడ అన్నది మాత్రం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో గురువారం శివకాశిలోని రాఘవేంద్ర ఫైర్ వర్క్స్ గోడౌన్లో పేలుడు మరోమారు ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విగతజీవులు కావడం, మరో పది మందికి పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో రెండేళ్లల్లో దీపావళి సందర్భంగా శివకాశిలో జరిగిన అతి పెద్ద పేలుడు ఇదే కావడం గమనార్హం. దీంతో మళ్లీ నిబంధనలకు తిలోదకాలు దిద్దే పనిలో పరిశ్రమల యాజమాన్యాలు ఉండబట్టే, ఈ ప్రమాదాలు అన్న ఆరోపణలు బయలు దేరాయి. ఇక, దీపావళి తర్వాత మూడు నెలల కాలం ఇక్కడి కుటుంబాలకు చేతిలో పనులు లేనట్టే. ఈ కాలంలో పొట్ట కూటి కోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాల్ని ఆశ్రయించడం, అడ్వాన్స్‌లు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ అడ్వాన్స్ చెల్లింపుతో పాటు తాజా బతుకు తెరువు కోసం రేయింబవళ్లు శ్రమించినా చివరకు మిగిలేది కన్నీళ్లే. -
శివకాశీలో భారీ అగ్నిప్రమాదం
-
శివకాశీలో భారీ అగ్నిప్రమాదం
9 మంది మృతి.. 20 మందికి తీవ్రగాయాలు బాణసంచా గిడ్డంగిలో పేలుళ్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని శివకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా గిడ్డంగి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పక్కనున్న స్కాన్‌సెంటర్‌కు దట్టమైన పొగలు వ్యాపించటంతో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. 20మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. శివకాశీ బైపాస్ రోడ్డులోని ప్రయివేటు బాణసంచా గిడ్డంగి వద్ద ఈ ఘటన జరిగింది. రిటైల్ దుకాణాలకు సరుకు చేరవేసేందుకు గురువారం మధ్యాహ్నం 20 మంది కూలీలు బాణ సంచా బండిళ్లను రెండు వ్యాన్లలోకి సర్దుతున్నారు. ఇంతలోనే బండిళ్లలోని టపాసులు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని టపాసులు పేలి మంటలు గిడ్డంగి లోకి వ్యాపించటంతో ఎగసిపడ్డాయి. స్కాన్ సెంటర్లోనే..: గిడ్డంగిలోనుంచి మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవకీ స్కాన్ సెంటర్లోకి దట్టమైన పొగచూరుకుంది. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా రోగులు వైద్య పరీక్షల కోసం స్కాన్ సెంటర్‌కు వచ్చారు. హఠాత్తుగా దట్టమైన పొగ వారిని చుట్టుముట్టడంతో అందులో ఉన్న వారంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. కొందరు స్థానికులు.. స్కాన్ సెంటర్ వెనుకవైపు కిటికీని బద్దలు కొట్టి లోపల చిక్కుకున్న వారిలో కొందరిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కొందరు దట్టమైన పొగకారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడకే చనిపోయారు: గిడ్డంగి సమీపంలో మంటలను మొదట్లోనే ఊహించిన బయటనున్న కూలీలు, స్థానికులు, పక్కనున్న దుకాణ దారులు పారిపోయారు. కానీ ప్రమాదాన్ని గుర్తించని స్కాన్‌సెంటర్లో కూర్చున్న వారు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అయితే మృతులంతా మంటల వల్ల చనిపోలేదని.. దట్టమైన పొగలతో ఊపిరాడకే మృతిచెందారని కలెక్టర్ శివజ్ఞానం తెలిపారు. గిడ్డంగి లోపలినుంచి బయటకెళ్లే ప్రయత్నంలో గాయపడిన కూలీలను శివకాశీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 15 స్కూటర్లు, ఒక జీపు, బాణ సంచా తరలింపునకు సిద్ధం చేసుకుని ఉన్న రెండు మినీ వ్యాన్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ దాదాపు గంటసేపు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చింది. బాణసంచా తయారీ గిడ్డంగి, దుకాణ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణే శివార్లలోని ఓ పత్తి ఫ్యాక్టరీలో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. -
తమిళనాడులో విషాదం
-
తమిళనాడులో విషాదం
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా శివకాశీలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం శివకాశీ పట్టణం పులిచపాల్యం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో కాలిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. -
శివకాశిలో పేలుడు : ఇద్దరు మృతి
చెన్నై : శివకాశిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శివకాశిలో అగ్ని ప్రమాదం
నిత్యం అగ్ని ప్రమాదాలతో వార్తల్లో నిలిచే శివకాశిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. తాయిల్ పట్టిలోని ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారణాలు మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి ఘటనకు కారణాలను శోధిస్తున్నామని చెప్పారు. -
శివకాశి వెలుగుల వెనుక చీకటి సాక్ష్యం...
నిన్నటికి నిన్న తూర్పు గోదావరిలో జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఎందరో అమాయకులు అసువులు బాశారు. దీపావళి అనగానే గుర్తుకు వచ్చే శివకాశిలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో. కన్నీళ్లు ఎన్నో. దీపావళి వెలుగుల వెనుక ఉన్న... శివకాశి గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆ వెలుగులకు కారణమైన శివకాశి కార్మికుల కష్టాల జీవితం, కన్నీటి జీవితం కొద్దిమందికే తెలుసు. దక్షిణ కాశిగా పేరొందిన శివకాశి బాణాసంచా తయారీ కార్మికుల కన్నీటి కథ గురించి తెలుసుకుందాం... దీపావళి పండగ రోజు మనం ఇష్టపడి, పోటీ పడి కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతున్నాయి? ఆ తయారీ వెనుక కార్మికుల కష్టాలేమిటి? ప్రమాదాలేమిటి? ప్రాణ నష్టాలేమిటి...మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే శివకాశికి వెళ్లాల్సిందే. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై, మృత్యువాత పడతారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది శివకాశి పట్టణం. విరుదునగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం వందేళ్ల కిందట అటవీ ప్రాంతం. పేరు ఎలా వచ్చింది? అసలు ఈ ప్రాంతానికి శివకాశి అనే పేరెందుకు వచ్చింది? దాని వెనుక చరిత్రేమిటి? అక్కడే ఎందుకు బాణాసంచా కర్మాగారాలు కొలువయ్యాయి? దీని వెనుక పెద్ద కథే ఉంది. ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథ ఏమిటంటే, క్రీ.శ.1428లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హరికేసరి పరశురామ పాండ్యన్ అనే రాజు పరమ శివ భక్తుడు. మహాశివుడిని తమ ప్రాంతంలో కొలువు దీర్చాలనే ఆలోచనతో ఉత్తర కాశి పట్టణంలో ప్రత్యేక పూజలు చేసిన శివలింగాన్ని దక్షిణ కాశి (తెన్ కాశి)కి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సతీసమేతంగా బంధుగణంతో కాశి నుండి శివలింగాన్ని తీసుకొని తెన్ కాశికి బయలు దేరారు. మరో రోజులో తెన్ కాశి వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం శివకాశిగా చెబుతున్న ప్రాంతంలో చీకటి పడింది. మారేడు చెట్లతో ఆ ప్రాంతం అరణ్యంలాగా ఉండటంతో, శివుని ఇష్టమైన ప్రాంతంగా భావించి రాత్రికి అక్కడ బస చేశారు. తెల్లవారు జామునే శివలింగానికి పూజ చేశారు. త్వరగా వెళ్లి తెన్ కాశిలో ప్రతిష్ఠించాలని బయలు దేరేందుకు సిద్ధమయ్యార పరుశురామ పాండ్యన్. కానీ... వారు వెళ్లాల్సిన గుర్రాలు కాలు కదిపేందుకు మొరాయించాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఏం జరిగిందోనని రాజు ఆరా తీశారు. ఆయన సతీమణి నెలసరి అయినట్టు తెలిసింది. దీంతో మూడు రోజులపాటు అక్కడ నుండి కదలలేని పరిస్థితి. అంతేకాకుండా ఆ రోజుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సిన బ్రహ్మ ముహూర్తం గడువు ముగియనుంది. దాంతో, ఇక ఆ విగ్రహాన్ని వారు బస చేసిన ప్రాంతంలోనే ప్రతిష్ఠించారు. కాశి నుండి వచ్చిన విగ్రహం కావడం, శివుడు తమ దైవం కావటంతో ఆ ప్రాంతానికి పాండ్య రాజు ‘శివకాశి’ అని నామకరణం చేసి, పెద్ద ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. ఆలయం నెలకొనటంతో తదనంతర కాలంలో అదో గ్రామంగా మారింది. మొదటి, చివరి అక్షరాలతో పుణ్యస్థలి! దైవానికి సంబంధించి మొదటి అక్షరం, చివరి అక్షరం కలిసి ఉండే పేరుతో ప్రపంచంలోనే రెండు దైవాంశ ప్రాంతాలున్నాయి. ఒకటి ‘తి’తో ప్రాంరంభమై ‘తి’తో ముగిసే శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతి అయితే, ‘శి’తో మొదలై ‘శి’తో ముగిసే శివకాశి. ఇలా మొదలైంది.... శివకాశి పేరు వెనుక రాచరికపు చరిత్ర ఉన్నట్లే, బాణాసంచా తయారీకి దాదాపు వందేళ్ళ పైగా చరిత్ర ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారీ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలో 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. అది చూసి కొందరు ఇదే వ్యాపారం మొదలు పెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలుగా మారి లక్షల మందికి ఉపాధి కలిగించడంతో ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రముఖమైన ప్రాంతంగా శివకాశి నిలిచింది. 20వ శతాబ్దంలో 30 మందితో ఇక్కడ ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రాలు కాలక్రమేణా 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమలుగా విస్తరించాయి. ప్రస్తుతం దాదాపు ఆరు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి. బాణసంచా తయారీయే అక్కడి ప్రజల జీవనం, జీవనాధారం అయ్యింది. కారణం ఏమిటి? అసలు ఇక్కడే ఎందుకు బాణాసంచా కర్మాగారాలు ఏర్పడ్డాయి? ఎందుకు ఇక్కడే వాటిని తయారు చేయాల్సి వస్తోంది? వేరే వృత్తిని ఎందుకు ఎంచుకోరు? దీనికి భౌగోళిక కారణాలూ ఉన్నాయి. శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు లేవు. సారవంతమైన భూమి తక్కువ. భూమిలో రసాయనాలు కలుస్తుండడంతో వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి. నదులు, సాగునీరు లేకపోవడంతో చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకుతెరువు కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లేవారు. అలాంటి చోట షణ్ముగ నాడార్ టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రజలు టపాసులు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఒకప్పుడు బయటి ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు బయట ప్రాంతాల నుండి ఇక్కడికి ఉపాధికి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో శివకాశి చుట్టూ పుట్టగొడుగుల్లా బాణాసంచా కర్మాగారాలు పుట్టుకొచ్చాయి. మూడు పువ్వులు ఆరు కాయలు ఇక్కడ బాణసంచా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక్కడ తయారీ ఎంత ముఖ్యమో వ్యాపారమూ అంతే! కర్మాగారాల్లో తయారయ్యే బాణాసంచాను ఆయా యాజమాన్యాలు నేరుగా శివకాశి పట్టణంలో తమ ఏజెన్సీల ద్వారా విక్రయాలు జరుపుతారు. తయారీ ఖర్చు, లాభనష్టాలను బేరీజు వేసుకుని విక్రయాలు జరుపుతారు. ఇక విక్రయాలకు ముందే తయారీ సమయంలో బాణాసంచా కవర్‌పై ధరలను నిర్ణయిస్తారు. అయితే కొనుగోలుదారులకు ఆ ధరపై 50 నుండి 60 శాతం తగ్గింపుతో భారీగా విక్రయాలు జరుపుతారు. గత ఏడాది కంటే ఈసారి ధరలు 20 శాతం పెరిగినా ఒక్కో తయారీదారు సుమారు 25 నుండి 30 కోట్ల వ్యాపారం చేస్తున్నారని అంచనా. ఇక ఇక్కడి నుంచి ఏటా 30 నుండి 45 శాతం బాణాసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుండటం గమనార్హం. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు శివకాశి నుంచే జరుగుతుండటం ఈ ప్రాంతపు ఘనతగా చెప్పవచ్చు. చీకటి కోణం దేశంలోని అతిపెద్ద పరిశ్రమ ఇది.. కానీ ఈ పరిశ్రమలోనూ చీకటి కోణాలున్నాయి. కొలిమితో చెలగాటం ఈ పరిశ్రమలో పని చేసే కార్మికుల జీవితం. కడుపునిండా తినాలంటే రోజూ చస్తూ బతకాల్సిందే. ప్రమాదమని తెలిసినా ఏడాదికి పది నెలలు వీటిపైనే ఆధారపడతారు. మిగిలిన పనుల కన్నా ఇక్కడ పనికి కూలి కూడా కాస్తంత అధికంగా దొరకడమే అందుకు కారణం. ‘‘మా బతుకుల్లో కన్నీళ్లున్నా ప్రపంచానికి వెలుగుల ఆనందాన్ని పంచుతాం’’ అంటూ అంటూ కర్మాగారాలకు క్యూలు కడతారు. దినదినగండంగా ముందుకు సాగుతారు. అయితే, ఆంక్షలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు ఉండవనేది అక్కడి కార్మికుల వాదన. ‘‘కర్మాగారాల్లో ప్రమాణాల కోసం.. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో డొల్లతనమే మా పాలిట శాపంగా మారింది’’ అని వారంటారు. బాణసంచా కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం సుమారు 30 కోట్లతో భద్రత బోర్డును ఏర్పాటు చేసినా, పట్టించుకునే నాథుడే లేక నిరుపయోగంగా మారింది. అధికారుల పనితీరూ అంతంతే! వెరసి, శివకాశి వాసులకు మరో పని దొరకదు. వ్యవసాయం లేదు. ఆదుకునే నాథుడు లేడు. అన్నీ కన్నీటి కష్టాలే. నిత్యం బతుకు పోరాటంలో మరణంతో చెలగాటమే. మరి, ఈ దీపావళి అయినా వారి కష్టాల చీకటిని తొలగించి, జీవితాల్లో వెండి వెన్నెల విరబూయిస్తుందా? - సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షి టీవి, చెన్నై బ్యూరో -
శివకాశిలో భారీ పేలుడు
శివకాశిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ బాణసంచాకు చెందిన రెండు పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. 20 గదులు నేల మట్టమయ్యాయి. ఆ సమయంలో సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లా శివకాశి బాణ సంచా తయారీకి పెట్టింది పేరు. కుట్టి జపాన్‌గా పేరుపొందిన ఈ కేంద్రంలో ప్రతి ఏటా దీపావళి సందర్భంగా భారీ ఎత్తున విక్రయాలు జరుగుతాయి. అలాగే ప్రమాదాలూ అధికమే. కుటీర పరిశ్రమ తరహాలో గ్రామ గ్రామాన సాగుతున్న ఈ బాణసంచా తయారీని అక్కడి ప్రజలు దినదిన గండంగా భావిస్తుంటారు. ఏ సమయం లో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్నా అదే వృత్తిలో కొనసాగుతున్న వారు అధికం. గత ఏడాది జరిగిన భారీ పేలుడుతో ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దీంతో ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రాణ నష్టమూ తగ్గింది. దీపావళి సమీపిస్తుండడంతో బాణసంచా ఉత్పత్తి వేగవంతమైంది. ఈ పరిస్థితుల్లో గురువారం భారీ ప్రమాదం జరగడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. శివకాశి సమీపంలోని దురైస్వామిపురంలో కుమరేశన్ అనే వ్యక్తికి చెందిన చిదంబరం ఫైర్ వర్క్స్ పరిశ్రమ ఉంది. ఇక్కడ ఫ్యాన్సీ రకం బాణ సంచా తయారీకి ఉపయోగించే మందుగుండు సామగ్రిని ఆరు బయట ఎండబెట్టారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 1.20 గంటలకు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మందుగుండు సామగ్రి రగిలింది. క్రమంగా మంటలు వ్యాపించాయి. బాణ సంచాలు నిల్వ ఉన్న గదులు, తయారు చేసే గదులకు పాకాయి. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ శబ్దం పది కిలోమీటర్ల దూరం వరకు విన్పించడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్తత బయలుదేరింది. ఈ పరిశ్రమలో పేలుడు ధాటి పక్కనే ఉన్న కృష్ణస్వామి ఫైర్ వర్క్స్‌కు పాకింది. అక్కడ సైతం పేలుళ్లు జరగడంతో ఏ మేరకు ప్రాణ నష్టం సంభంవించనుందోనన్న ఆందోళన బయలుదేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. మూడు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ పేలుళ్లు ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య జరగడం, ఆ సమయం మధ్యాహ్న భోజన విరామం కావడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బతికి బయటపడ్డారు. సుమారు 80 మందికి పైగా కార్మికులు పేలుడు జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో భోజనం చేస్తుండడం, మరికొందరు బయటకు వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ వృద్ధురాలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ రెండు పరిశ్రమల్లోని 20 గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టమైంది. మధ్యాహ్న భోజన విరామ సమయమైనా అందరూ బయటకు వెళ్లారా? లేక ఎవరైనా ఆ శిధిలాల కింద చిక్కుకున్నారా..? అన్న అనుమానాలు బయలుదేరాయి. ఇన్స్పెక్టర్ పార్తిబన్ నేతృత్వంలోని బృందం పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతోంది. అక్కడి సిబ్బంది మాత్రం అందరూ బయటకు వచ్చేశామని పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న విరుదునగర్ కలెక్టర్ హరిహరన్ నేతృత్వంలోని అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపింది. -
శివకాశి టపాసుల తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదం
తమిళనాడులో దీపావళి టపాసుల తయారీకి సుప్రసిద్ధమైన శివకాశిలో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు టపాసు తయారీ కేంద్రాలు కాలిపోయాయి. అయితే, ఈ సంఘటనలో ఎవరైనా చనిపోయారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. చిదంబరం ఫైర్ వర్క్స్ దుకాణంలో చెలరేగిన మంటలు వెనువెంటనే పక్కనే ఉన్న కృష్ణస్వామి ఫైర్ వర్క్స్ దుకాణానికి కూడా అంటుకున్నాయి. సమాచారం తెలియగానే మూడు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మధ్యాహ్నం 1.20 వరకు మంటలను అదుపు చేశాయని శివకాశి అగ్నిమాపక దళం అధికారి ఒకరు తెలిపారు. అయితే, మంటలను అదుపుచేస్తున్న సమయంలోనే పేలుడు శబ్దాలు కూడా వినిపించినట్లు ఆయన చెప్పారు. మంటలు అంటుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుండగా 50 ఏళ్ల మహిళ ఒకరికి కాలిన గాయాలైనట్లు మరనేరి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. పార్తీపన్ చెప్పారు. సరిగ్గా భోజన విరామ సమయంలోనే అగ్నిప్రమాదం జరగడంతో ఎక్కువ మంది కార్మికులు ఆయా దుకాణాలలో లేకపోవడం వల్ల నష్ట తీవ్రత కొంతవరకు తగ్గింది. టపాసుల తయారీ కేంద్రాలు పోలీసు స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోను, శివకాశి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలోను ఉన్నాయి. చిదంబరం ఫైర్ క్రాకర్ యూనిట్లో ఫ్యాన్సీ టపాసులు ఎక్కవుగా తయారుచేస్తారు. దేశంలోనే టపాసుల తయారీ విషయంలో శివకాశి చాలా ప్రసిద్ధి చెందింది. దేశంలోని మొత్తం టపాసులలో 90 శాతం ఇక్కడే తయారవుతాయి. అలాగే 80 శాతం అగ్గిపెట్టెలు కూడా ఇక్కడే రూపొందుతాయి. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటం, పొడి వాతావరణం ఉండటం వల్ల ఏడాది పొడవునా టపాసుల తయారీ కొనసాగుతుంటుంది. టపాసుల వ్యాపారం టర్నోవర్ సుమారు 2వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.