చెన్నై : శివకాశిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.