
శివకాశిలో అగ్ని ప్రమాదం
నిత్యం అగ్ని ప్రమాదాలతో వార్తల్లో నిలిచే శివకాశిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. తాయిల్ పట్టిలోని ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారణాలు మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి ఘటనకు కారణాలను శోధిస్తున్నామని చెప్పారు.