ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్ ఏఎస్ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు.