తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి | Explosion At Fireworks Factory Near Sivakasi In Tamil Nadu: Video Viral | Sakshi
Sakshi News home page

తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి

Published Thu, May 9 2024 5:53 PM | Last Updated on Thu, May 9 2024 6:11 PM

Explosion At Fireworks Factory Near Sivakasi In Tamil Nadu: Video Viral

చెన్నై: భారతదేశంలో ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

విరుదునగర్ జిల్లా శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్‌ అనే వ్యక్తికి చెందిన 'శ్రీ సుదర్శన్' క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచాలో మందు నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మహిళలతో సహా 8 మంది మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 6కు పైగా గదులు కూలిపోయాయి.

ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement