crackers factory
-
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
చెన్నై: భారతదేశంలో ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.విరుదునగర్ జిల్లా శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్ అనే వ్యక్తికి చెందిన 'శ్రీ సుదర్శన్' క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచాలో మందు నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మహిళలతో సహా 8 మంది మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 6కు పైగా గదులు కూలిపోయాయి.ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow— ANI (@ANI) February 17, 2024 -
క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉన్న హార్దా ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పక్కనే ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Madhya Pradesh, India. Fire department vehicles present on the spot. There is a possibility of many people being trapped in the factory. #Explosion #Blast #MadhyaPradesh #Harda #BREAKING #Fire #India #Breakingnews pic.twitter.com/VoCJkSEl9F — Mangli Mundhan (@KRISHAN95411687) February 6, 2024 -
థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి
బ్యాంకాక్: సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణమేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది. ఇదీచదవండి.. కెనడానకు తగ్గిన భారత యువత -
తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుకొండలు (37), నాగేంద్రబాబు (35) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది. కళ్యాణ్ (22) వీరయ్య (48) అనే ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
తమిళనాడులో ఘోరం: 11 మంది మృతి
-
తమిళనాడులో ఘోరం: 15 మంది మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించటంతో 15 మంది సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన విరుద్‌నగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ఈ మధ్యాహ్నం విరుద్‌నగర్ జిల్లా అచన్‌కులమ్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న నాలుగు షెడ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 15మంది మృత్యువాతపడగా.. ఇరవైకి పైగా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బాణసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్‌లోని బాణసంచా కర్మాగారంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బాణసంచా అక్రమంగా నిర్వహాకులు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.