బ్యాంకాక్: సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణమేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment