
తమిళనాడులో విషాదం
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా శివకాశీలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం సాయంత్రం శివకాశీ పట్టణం పులిచపాల్యం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో కాలిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.