తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై పాడుబడిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని స్థానిక వ్యాపారవేత్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు.
నామనసముద్రం గ్రామ సమీపంలో పార్క్ చేసిన వాహనం మంగళవారం సాయంత్రం నుంచి అదే స్థలంలో ఉండడం స్థానికుల పోలీసులకు సమాచారం వచ్చారు. దీంతోప రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మృతులను మణికందన్ (50) కుటుంబ సభ్యులగా గుర్తించారు. చనిపోయిన వారిలో అతని భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నివాసముండే సేలానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు కనిపించాయి. మెటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కారులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి దారితీసాయా అనే కోణంలో చర్యకు నెట్టివేసి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment