ప్రియుడికి సిఫారసు? | gossips on nayana tara in koliwood | Sakshi
Sakshi News home page

ప్రియుడికి సిఫారసు?

Published Tue, Nov 8 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ప్రియుడికి సిఫారసు?

ప్రియుడికి సిఫారసు?

తాను నాయకిగా నటించాలంటే తన ప్రియుడికి దర్శకత్వం అవకాశం ఇవ్వాలన్నది నటి నయనతార తంతుగా మారిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయకి నయనతార అన్నది తెలిసిన విషయమే.దాదాపు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ క్రేజీ భామను ఇళయదళపతితో మరోసారి రొమాన్‌‌స చేరుయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపొస్తోంది. నయన్ తొలుత విజయ్‌తో శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేశారు.ఆ తరువాత విల్లు చిత్రంలో ఆయనతో నాయకిగా నటించారు.ఆపై వీరి కాంబినేషన్‌లో చిత్రం రాలేదు.

విజయ్ భైరవా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్‌‌స సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.ఆయనతో తెరి చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో కథానాయకిగా ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది.అందులో భాగంగా నటి నయనతార పేరు చర్చకు వచ్చిందని సమాచారం. విజయ్‌తో నయనతార అంటే ఆ క్రేజే వేరని, అదే విధంగా ఆమె నాయకి అయితే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వ్యాపారం జరుగుతుందనే ఆలోచనతో నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నయనతార ఇప్పుడు తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివకు సిఫార్సు చేసే పనిలో ఉన్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. నటుడు సూర్య హీరోగా నటించనున్న తాజా చిత్రం తానా సేర్న్‌ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నారు. నయనతార సిఫార్సు కారణంగానే విఘ్నేశ్‌శివకి అవకాశం వచ్చిందని ఒక వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇందులో నాయకిగా నయనతారనే నటించనున్నట్లు టాక్ వినిపించింది.

అయితే చివరికి ఆ అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించింది. ఇకపోతే విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నయనతార నటించడానికి అంగీకరిస్తే తదుపరి విజయ్ తన భర్త దర్శకత్వంలో నటించాలనే షరతును విధించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు దోరా అనే స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైక్కా నోడిగళ్ చిత్రం చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో శివకార్తికేయన్‌తో జత కడతానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement