ilayadalapati
-
సమంత యూటర్న్ తీసుకోనున్నారా?
నటి సమంత యూ టర్న్ తీసుకోనున్నారా? ఇందుకు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్ సమంత. తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ తరువాత కొత్త చిత్రం ఏదీ చేయని ఈ బ్యూటీ త్వరలో కోలీవుడ్‌లో ఇళయదళపతి 61వ చిత్రంలో జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనితో పాటు ఇరుంబు కుదిరై, అనీతి కథైగళ్ చిత్రాలకు పచ్చజెండా ఊపిన సమంత తెలుగులోనూ యువ స్టార్ నటుడు రామ్‌చరణ్‌కు జంటగా నటించే అవకాశం వరించినట్లు తెలిసింది. త్వరలో తన ప్రియుడు నాగచైతన్యతో వివాహ నిశ్చితార్థానికి సిద్ధం అవుతున్న ఈ చెన్నై చిన్నది నిర్మాతగా అవతారమెత్తనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్రం సమంతకు బాగా నచ్చేసిందట. అందులో నాయకిగా నటించాలని ముచ్చట పడుతున్న సమంత ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తానే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు, ఈ విషయమై తన కాబోయే భర్త నాగచైతన్యతో పాటు ఆ చిత్ర దర్శకుడు పవన్ కుమార్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. సమంత నాయకిగా ఆమె నిర్మాణంలోయూ టర్న్ చిత్రాన్ని రీమేక్చేయడానికి పవన్ కుమార్ అంగీకరించినట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక వార్త త్వరలో వెల్లడయ్యే ఆవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. -
విడుదలకు ముందే రికార్డులు
ఇళయదళపతి చిత్రం వస్తుందంటే ఇటు పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా విజయ్ నటించిన ఆయన 60వ చిత్రం భైరవా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్ దివంగత ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం భైరవా. విజయ్ సరసన తొలిసారిగా కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ముఖ్య పాత్రను పోషించారు. భరతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతుంది. 2017లో తెరపైకి రానున్న తొలి భారీ చిత్రంగా నమోదవుతున్న భైరవా చిత్ర ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొంటున్నాయి. దీంతో చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వారానికి పైగా ఫుల్ అయిపోయింది. భైరవా చిత్రం విడుదలలో మరో రికార్డు సాధించింది. ఈ చిత్రం ఐరోపా దేశాలు సహా 55 దేశాల్లో విడుదల కానుంది. భైరవా చిత్ర ఓవర్సీస్ విడుదల హక్కులను పొందిన ఏ అడ్ పీ సంస్థ చిత్రాన్ని 55 దేశాల్లో విడుదల చేయనుంది. అందులో నైజీరియా, ఘనా, కెన్యా, ఉంగాండా, జాంజియా, టాంజానియా, కాంగో, ఉక్రెయిన్, అల్బేనియా, మెక్సికో, లితేనియా, పోలెండ్, మాస్కో దేశాలు చోటు చేసుకోవడం విశేషం. ఇన్ని దేశాల్లో ఒక తమిళ సినిమా విడుదల కావడం ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం. -
ప్రియుడికి సిఫారసు?
తాను నాయకిగా నటించాలంటే తన ప్రియుడికి దర్శకత్వం అవకాశం ఇవ్వాలన్నది నటి నయనతార తంతుగా మారిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయకి నయనతార అన్నది తెలిసిన విషయమే.దాదాపు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ క్రేజీ భామను ఇళయదళపతితో మరోసారి రొమాన్స చేరుయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపొస్తోంది. నయన్ తొలుత విజయ్‌తో శివకాశి చిత్రంలో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేశారు.ఆ తరువాత విల్లు చిత్రంలో ఆయనతో నాయకిగా నటించారు.ఆపై వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. విజయ్ భైరవా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్స సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.ఆయనతో తెరి చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో కథానాయకిగా ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది.అందులో భాగంగా నటి నయనతార పేరు చర్చకు వచ్చిందని సమాచారం. విజయ్‌తో నయనతార అంటే ఆ క్రేజే వేరని, అదే విధంగా ఆమె నాయకి అయితే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వ్యాపారం జరుగుతుందనే ఆలోచనతో నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నయనతార ఇప్పుడు తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివకు సిఫార్సు చేసే పనిలో ఉన్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. నటుడు సూర్య హీరోగా నటించనున్న తాజా చిత్రం తానా సేర్న్ద కూటం చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నారు. నయనతార సిఫార్సు కారణంగానే విఘ్నేశ్శివకి అవకాశం వచ్చిందని ఒక వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇందులో నాయకిగా నయనతారనే నటించనున్నట్లు టాక్ వినిపించింది. అయితే చివరికి ఆ అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించింది. ఇకపోతే విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నయనతార నటించడానికి అంగీకరిస్తే తదుపరి విజయ్ తన భర్త దర్శకత్వంలో నటించాలనే షరతును విధించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు దోరా అనే స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైక్కా నోడిగళ్ చిత్రం చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో శివకార్తికేయన్‌తో జత కడతానికి సిద్ధం అవుతున్నారు. -
విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా
తమిళ ఇళయదళపతి అభిమానులిప్పుడు పుల్ జోష్‌లో ఉన్నారు. విజయ్ తన 60వ చిత్రం భైరవా టీజర్‌ను గురువారం విడుదల చేసి అభిమానులకు దీపావళి కానుకగా అందించారు. ఈ టీజర్ వారిని యమ ఖుషీ పరుస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భైరవా. ఇంతకు ముందు విజయ్ హీరోగా అళగీయతమిళ్మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ ఈ భైరవా చిత్రానికి దర్శకుడు.ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స పతారంపై బి.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్‌కు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారం విడుదల చేసిన చిత్ర టీజర్‌కు సినీ ప్రేక్షకులు, విజయ్ అభిమానుల మధ్య అనూహ్య స్పందన వస్తోంది. ఫుల్ యాక్షన్, పంచ్డైలాగ్సతో కూడిన ఈ టీజర్లో విజయ్ నీటితో ఉన్న భూమిపై అడుగు పెట్టే సన్నివేశంతో మొదలై రౌడీని ఎత్తి గాలిలో తిప్పి కిందపడేసే దృశ్యం. అది చూసిన జగపతిబాబు యార్డా అవన్(ఎవడురా అతను)అని ఆవేశంగా గర్జించే దృశ్యం, తెరింజ ఎదిరియై విడ తెరియాద ఎదిరిక్కుదాన్ ఆళు అధికమాగ ఇరుక్కమ్(తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువుకే మంది ఎక్కువగా ఉంటారు), నెరియపేరుకిట్ట ఇల్లాద కెట్ట పళక్కం ఎన్‌కిట్ట ఉరుక్కు( చాలా మందికి లేని చెడ్డ గుణం నాకు ఉంది) లాంటి పంచ్ డైలాగ్సతో కూడిన భైరవా టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్‌ను 20 గంటల్లోనే 22 లక్షల మంది తిలకించారని, 1.53 లక్షల మంది లైక్ చేశారని నెటిజన్లు గణాంకాలు చెబుతున్నారు. అంతే కాదు 24 గంటల్లో మూడు మిలియన్లు దాటే అవకాశం ఉందంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంతో ఫుల్జాయ్లో ఉన్నారు. -
విలన్‌గా చేయను
ఇళయదళపతి వయసు 30 ఏళ్లు అంటే ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది ఆయన సినిమా వయసండి. అంటే విజయ్ సినీ రంగంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారా? అంటే ఇది అక్షరాల నిజం. విజయ్ బాల నటుడిగానే తెరంగేట్రం చేశారు. 1984లో వెట్రి అనే చిత్రం ద్వారా మాస్టర్ విజయ్‌గా నటనకు శ్రీకారం చుట్టిన నేటి సూపర్‌స్టార్ 1992లో నాళయ తీర్పు చిత్రంతో కథా నాయకుడిగా అవతారమెత్తారు. ఆ విధంగా హీరోగా రెండు పుష్కరాలను పూర్తి చేసుకున్న ఇళయదళపతితో చిట్‌చాట్. మీకు ఎవరు పోటీ అని భావిస్తున్నారు? ప్రేక్షకుల ప్రశంసలు పొంది విజయాన్ని సాధించిన చిత్రాలనే నేను పోటీగా భావిస్తాను. బయట సీరియస్‌గా ఉంటూ సినిమాల్లో మాత్రం నవ్విస్తుంటారు? నాకు హాస్యం అంటే ఇష్టమే. జాలీగా మాట్లాడటం, ఆట పట్టించడం లాంటి అంశాలను ఎంజాయ్ చేస్తాను. ఎప్పటి నుంచో ఇప్పటి వరకు సరదాగా ఉండే నలుగురు స్నేహితులు నాతోనే ఉన్నారు. అదే విధంగా నా అభిమానులను నవ్వించడానికి నేను హాస్య సన్నివేశాల్లో నటిస్తుంటాను. విలన్‌గా నటించాలనే కోరిక ఉందా? ఇంతకుముందు ప్రియముడన్ చిత్రం లో ప్రేయసి కోసం హత్యలు చేసే పాత్రను పోషించాను. ఆ చిత్రం చూసిన మా అమ్మ ఇకపై అలాంటి పాత్రలు చేయవద్దని చెప్పారు. అందువలనే నెగటివ్ పాత్రలకు దూరంగా ఉంటున్నాను. మీకు మానసిక గురువు ఎవరు? ఇంకెవరు మా నాన్నే. ప్రేయసి ఉందా? ఒకటి సినిమా, రెండు నా భార్య. మీకు అసూయ కలిగించే నటుడెవరు? కమల్ హాసన్. ఒక చిత్ర జయాపజయాలను నిర్ణయించేదెవరు? కథ, దర్శకత్వం దర్శకత్వం వహిస్తారా? దర్శకత్వం అంటే అందరి హక్కులను పర్యవేక్షిస్తూ చేసేది. అంత సహనం, సమయం నాకిప్పుడు లేవు. ప్రస్తుతానికి దర్శకత్వం అనేది నాకు సరిపడదు. మీరు తరచూ విదేశీయానం చేసే ప్రదేశం? లండన్. మీరు సీఎం అయితే తొలిసారిగా జారీ చేసే ఉత్తర్వులు? ఇలాంటి అడ్డదిడ్డ ప్రశ్నలు వేసే వాళ్లకు ఆరు నెలలు జైలులో పెట్టాలని ఉత్తర్వులు జారీ చేస్తాను. మిమ్మల్ని ఏడిపించిన సంఘటన ఉందా? నాకు ఏడవడం అన్నా, ఏడ్చేవాళ్లన్నా నచ్చరు. నేను ఒకే ఒక్కసారి కంటతడిపెట్టాను. అది నా చెల్లెలు విద్య ఈ లోకాన్ని విడిచి పోయినప్పుడు. కడుపుబ్బ నవ్విన సంఘటన? బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో ఆర్య, సంతానం నటించిన హాస్య సన్నివేశాలు చూసి కడుపుబ్బ నవ్వాను. ముఖ్యంగా ఆ చిత్రంలో సంతానం ఒక్కొక్కరు పదిమంది స్నేహితులతో సంతోషంగా ఉంటుంటే. నేను ఒక్క స్నేహితుడితో పడుతున్న బాధలు ఉన్నాయే అనే సంభాషణలు చెప్పే సన్నివేశాన్ని చాలా ఎంజాయ్ చేశాను. జయలలిత, కరుణానిధిలలో మీకు నచ్చిన విషయం? జయలలితలో నచ్చిన విషయం ఆమె ధైర్యం. కరుణానిధిలో నచ్చిన అంశం సాహిత్యం.