సమంత యూటర్న్‌ తీసుకోనున్నారా? | Samantha is a remake U-turn movie | Sakshi
Sakshi News home page

సమంత యూటర్న్‌ తీసుకోనున్నారా?

Published Sun, Jan 29 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

సమంత యూటర్న్‌ తీసుకోనున్నారా?

సమంత యూటర్న్‌ తీసుకోనున్నారా?

నటి సమంత యూ టర్న్‌ తీసుకోనున్నారా? ఇందుకు కోలీవుడ్‌ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో టాప్‌ హీరోయిన్ సమంత. తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌ తరువాత కొత్త చిత్రం ఏదీ చేయని ఈ బ్యూటీ త్వరలో కోలీవుడ్‌లో ఇళయదళపతి 61వ చిత్రంలో  జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనితో పాటు ఇరుంబు కుదిరై, అనీతి కథైగళ్‌ చిత్రాలకు పచ్చజెండా ఊపిన సమంత తెలుగులోనూ యువ స్టార్‌ నటుడు రామ్‌చరణ్‌కు జంటగా నటించే అవకాశం వరించినట్లు తెలిసింది. త్వరలో తన ప్రియుడు నాగచైతన్యతో వివాహ నిశ్చితార్థానికి సిద్ధం అవుతున్న ఈ చెన్నై చిన్నది నిర్మాతగా అవతారమెత్తనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూ టర్న్‌ చిత్రం సమంతకు బాగా నచ్చేసిందట.

అందులో నాయకిగా నటించాలని ముచ్చట పడుతున్న సమంత ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తానే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు, ఈ విషయమై తన కాబోయే భర్త నాగచైతన్యతో పాటు ఆ చిత్ర దర్శకుడు పవన్ కుమార్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. సమంత నాయకిగా ఆమె నిర్మాణంలోయూ టర్న్‌ చిత్రాన్ని రీమేక్‌చేయడానికి పవన్ కుమార్‌ అంగీకరించినట్లు టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక వార్త త్వరలో వెల్లడయ్యే ఆవకాశం ఉన్నట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement