Producer Dil Raju Opens Up About Shaakuntalam Movie Failure, Deets Inside - Sakshi
Sakshi News home page

Dil Raju: శాకుంతలం మిస్ ఫైర్ అయింది: దిల్‌ రాజు

Published Fri, Apr 28 2023 1:47 PM | Last Updated on Fri, Apr 28 2023 2:00 PM

Producer Dil Raju Open About Shaakuntalam Movie Failure  - Sakshi

టాలీవుడ్‌ నిర్మాతల్లో దిల్‌ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు నిర్మిస్తుంటారు. ఫ్లాపులు ఎదురైన వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి దిల్​ రాజును భారీగా దెబ్బతీసింది ఆ చిత్రం. ఇటీవలే ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, మధుబాల, అల్లు అర్హ నటించారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఓ ఇంటర్వ్యూలో దిల్‌ రాజు స్పందించారు. 

(ఇది చదవండి: సర్ఫ్‌తో స్నానం.. టాయిలెట్ వాటర్‌తో కాఫీ తాగా: నటి ఆవేదన)

దిల్ రాజు మాట్లాడుతూ.. 'శాకుంతలం మూవీ మిస్‌ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలి. రియలైజేషన్‌ రావాలి. శాకుంతలం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్‌లో ఇది ఊహించలేదు.'అని అ‍న్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్ అందుకున్న దిల్‌ రాజుకు శాకుంతలం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాగా.. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టులు ఓకే అయ్యాయని దిల్ రాజు తెలిపారు. 

(ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్‌ వర్షిణి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement