Samantha Strong Counter To Producer Chitti Babu Comments About Shaakuntalam - Sakshi
Sakshi News home page

Samantha: 'ఆ కామెంట్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది'.. సమంతకు స్ట్రాంగ్ కౌంటర్!

Published Tue, Apr 25 2023 4:08 PM | Last Updated on Tue, Apr 25 2023 8:57 PM

Samantha Strong Counter On Producer Chitti Babu Comments about Shaakunthalam - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత, నిర్మాత చిట్టిబాబు మధ్య మొదలైన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇటీవల సమంత ఆయన కామెంట్స్‌పై కౌంటర్ ఇవ్వడంతో.. అయితే తాజాగా నిర్మాత చిట్టిబాబు స్పందించారు. ఆమె గురించి నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదంటూ సమంతను ఉద్దేశించి మాట్లాడారు. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన కామెంట్స్‌ గురించి మాట్లాడితే బాగుండేదని చురకలంటించారు.
(Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!)

చిట్టిబాబు మాట్లాడుతూ.. 'ఇవన్నీ చాలా తెలివితేటలు అనుకుంటారు. నేను కౌంటర్ ఇస్తే ఆమె తల ఎక్కడా పెట్టుకోవాలో తెలియదు. నా పేరు చెప్పలేదు కాదు కాబట్టి సమంత అని నేను మాట్లాడడం లేదు. కానీ నేను కౌంటర్ ఇస్తే రిప్లై ఇవ్వలేదు. నా వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను చేసిన కామెంట్స్‌లో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుంది.'అని అన్నారు. 

సమంత సినిమా ప్రమోషన్స్‌ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని.. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. శాకుంతలం చిత్రంలో సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం వేసిందంటూ విమర్శించారు. 

కాగా.. సమంత ఇటీవల 'శాకుంతలం' సినిమాతో అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్ సిరీస్‌ ప్రమోషన్లతో బీజిగా ఉంది. ఇటీవల లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఇండియన్‌ వర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈనెల 28న స్ట్రీమింగ్ కానుంది. 
(జియో సినిమా ఉచితం కాదు.. ఇకపై డబ్బులు కట్టాల్సిందే!)

సమంత స్ట్రాంగ్ కౌంటర్

అయితే సమంత కెరీర్‌పై నిర్మాత చిట్టిబాబు తీవ్రమైన ఆరోపణలకు సమంత గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్ చేసింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది.

ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది. కాగా.. సమంత నటించిన శాకుంతలం అంతగా మెప్పించకపోవడంతో సమంతపై చిట్టిబాబు తీవ్ర విమర్శలు చేశారు.
 
చిట్టిబాబు ఏమన్నారంటే?

చిట్టిబాబు మాట్లాడుతూ..' సినిమా ప్రమోషన్స్‌ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసింది. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయా. శాకుంతలం ప్రమోషన్లలో మాటలు కూడా రావడం లేదంటూ సానుభూతి పొందాలని చూసింది.'  అంటూ విమర్శించారు. 
(Kiran Abbavaram: స్టార్‌ హీరోతో కిరణ్‌ అబ్బవరం మల్టీస్టారర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement