Chitti babu
-
ఉచిత ఇసుక ప్రజలకు కాదు.. ఎమ్మెల్యేలకు
-
పవన్ పై పార్వతి మిల్టన్ ఫిర్యాదు
-
నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు.. సమంతకు నిర్మాత కౌంటర్!
స్టార్ హీరోయిన్ సమంత, నిర్మాత చిట్టిబాబు మధ్య మొదలైన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇటీవల సమంత ఆయన కామెంట్స్‌పై కౌంటర్ ఇవ్వడంతో.. అయితే తాజాగా నిర్మాత చిట్టిబాబు స్పందించారు. ఆమె గురించి నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదంటూ సమంతను ఉద్దేశించి మాట్లాడారు. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడితే బాగుండేదని చురకలంటించారు. (Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!) చిట్టిబాబు మాట్లాడుతూ.. 'ఇవన్నీ చాలా తెలివితేటలు అనుకుంటారు. నేను కౌంటర్ ఇస్తే ఆమె తల ఎక్కడా పెట్టుకోవాలో తెలియదు. నా పేరు చెప్పలేదు కాదు కాబట్టి సమంత అని నేను మాట్లాడడం లేదు. కానీ నేను కౌంటర్ ఇస్తే రిప్లై ఇవ్వలేదు. నా వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను చేసిన కామెంట్స్‌లో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుంది.'అని అన్నారు. సమంత సినిమా ప్రమోషన్స్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని.. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. శాకుంతలం చిత్రంలో సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం వేసిందంటూ విమర్శించారు. కాగా.. సమంత ఇటీవల 'శాకుంతలం' సినిమాతో అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బీజిగా ఉంది. ఇటీవల లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియన్ వర్షన్లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈనెల 28న స్ట్రీమింగ్ కానుంది. (జియో సినిమా ఉచితం కాదు.. ఇకపై డబ్బులు కట్టాల్సిందే!) సమంత స్ట్రాంగ్ కౌంటర్ అయితే సమంత కెరీర్‌పై నిర్మాత చిట్టిబాబు తీవ్రమైన ఆరోపణలకు సమంత గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్ చేసింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది. కాగా.. సమంత నటించిన శాకుంతలం అంతగా మెప్పించకపోవడంతో సమంతపై చిట్టిబాబు తీవ్ర విమర్శలు చేశారు. చిట్టిబాబు ఏమన్నారంటే? చిట్టిబాబు మాట్లాడుతూ..' సినిమా ప్రమోషన్స్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్గా ఆమె కెరీర్ ముగిసింది. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయా. శాకుంతలం ప్రమోషన్లలో మాటలు కూడా రావడం లేదంటూ సానుభూతి పొందాలని చూసింది.' అంటూ విమర్శించారు. (Kiran Abbavaram: స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం మల్టీస్టారర్!) -
తనవి పిచ్చి వేషాలు, డ్రామాలు అన్న నిర్మాతకు ఇచ్చిపడేసిన సామ్
సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాదని, అసలు హీరోయిన్ రేంజ్ కూడా తనకు లేదని నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ అవడానికి ముందు సమంత కావాలని ఏడుస్తూ సింపథీ డ్రామాలు ఆడి పిచ్చి వేషాలు వేసిందని తీవ్ర ఆరోపణలు చేశాడు సదరు నిర్మాత. ఆమె ఎన్ని డ్రామాలు ఆడినా స్టార్డమ్ రావడం కష్టమని, ఆల్రెడీ తన కెరీర్ ముగిసిపోయిందని దారుణ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తనపై విమర్శలు గుప్పించిన నిర్మాతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది సమంత. చెవిలో వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? అని గూగుల్‌లో సెర్చ్ చేసిన స్క్రీన్‌షాట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆమె ప్రశ్నకు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎదుగుదల వల్లే చెవిలో వెంట్రులకు పెరుగుతాయి అన్న సమాధానం వచ్చింది. దీనికి ఇఫ్ యు నో యు నో అని క్యాప్షన్ ఇచ్చింది. నిర్మాత చిట్టిబాబుకు చెవిలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో సమంత సదరు నిర్మాతకే కౌంటరిచ్చిందని అభిప్రాయపడుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలా ఉంటే సమంత చివరిగా శాకుంతలం చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: హీరోకు 23 సర్జరీలు.. కాలు తీసేయాలన్న డాక్టర్స్! 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ -
సమంత.. ఎందుకు ఈ డ్రామాలు? పిచ్చివేషాలు: నిర్మాత
సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే!. జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని ట్విటర్లో వెల్లడించిందీ హీరోయిన్. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కాదంటూ మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటం సాంగ్ చేసింది. తన బతుకుదెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్గా ఆమె కెరీర్ ముగిసిపోయింది.. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే! మళ్లీ ఆమెకు స్టార్డమ్ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్చేసి ఆ సినిమాను సక్సెస్ చేసుకోవాలనుకుంది. ఇప్పుడేమో.. నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు? ప్రతిసారి సెంటిమెంట్ వర్కవుట్ కాదు. కథ, పర్ఫామెన్స్ నచ్చితే చూస్తారు. అంతేకానీ అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చివేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోంది. అయినా హీరోయిన్ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్టయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకేమాత్రం ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చాడు చిట్టిబాబు. -
‘నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దని లెటర్ రాశాడు’
మహారథి... దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు... బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి వచ్చారు... ఎంతో పోరాటం చేసి సినీ రచయితగా నిలిచారు... రణభేరి, బందిపోటు, పెత్తందార్లు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు.. వంటి అనేక చిత్రాలకు పదునైన లయబద్ధమైన మాటలు రచించి కొత్త పంథాను సృష్టించారు.. క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం వల్ల సినీ పెద్దలకు దూరమయ్యారు.. తను కలలు కన్న అల్లూరి సీతారామరాజు కోసం అడవులకు వెళ్లారు... ఆదర్శ జీవితాన్ని గడిపారు.. పిల్లలకు అదే నేర్పారు.. అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలు ‘సాక్షి’కి వివరించారు మహారథి రెండవ కుమారుడు చిట్టిబాబుగా పరిచితులైన వరప్రసాద్.. నాన్న కృష్ణాజిల్లా పసుమర్రులో పుట్టారు. నాయనమ్మ పుణ్యవతి. తాతయ్య సత్యనారాయణ పసుమర్రు మునసబు. ఆయనకు రైస్ మిల్లులు ఉండేవి. నాన్నగారికి ఒక అక్క ధనలక్ష్మి, ఇద్దరు చెల్లెళ్లు.. జయప్రద, రామలక్ష్మి. తాతగారి రెండో భార్యకు ధనలక్ష్మి, మూడో భార్యకు నాన్నగారు, ఇద్దరు చెల్లెళ్లు పుట్టారు. ఆ రోజుల్లో వారసుడి కోసం తపించేవారు. లేకలేక పుట్టడంతో నాన్న ఎంతో అపురూపంగా పన్నెండు మంది దాసీల మధ్య పెరిగారు. పుట్టినప్పుడే జ్యోతిష్కుడు, ‘పిల్లాడు మహావిద్యావంతుడు అవుతాడు, కాని 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నదంతా హరించుకుపోతుంది’ అని చెప్పిన జాతకం నిజమైంది. నాన్నకు 12 సంవత్సరాలు వచ్చేసరికి తాతగారికి ఉన్న 300 ఎకరాల భూమి 16 ఎకరాల కు వచ్చేసింది. ‘పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకు’ అని వాళ్ల నాయనమ్మ చెప్పిన మాటతో 16 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బుతో నిజామాబాద్ ధర్మారంలో వ్యవసాయం చేసి, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి, సన్యాసం తీసుకుని వింధ్య పర్వతాలకు వెళ్లిపోయారట. నాన్న ఏమయ్యారో తెలియక మా నాయనమ్మ దిగులుపడిపోయిందట. అక్కడ స్వామీజీలు నాన్నతో, ‘నీకు సన్యాసి యోగం లేదు, తల్లి మనసు కష్టపెట్టకు, అమ్మ దగ్గరకు వెళ్లిపో’ అనటంతో వెనక్కు వచ్చి, కాకరాల సీతారామయ్యగారి అమ్మాయి కమలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట. ఎవరు చెప్పినా వినలేదు... నాన్నగారికి మేం నలుగురు సంతానం. సత్య కిశోర్ (సి. ఏ), ఉషారాణి (బి.ఏ.), వరప్రసాద్ (చిట్టిబాబు, నేను, బి. కాం.), రాజేంద్ర అనారోగ్యం కారణ ంగా మధ్యలోనే చదువు ఆపేసి, వ్యాపారం లోకి దిగారు. మా అందరి కంటె ముందు ఒక అమ్మాయి పుట్టింది. పేరు క్రాంతి. ఆ ప్రసవం అయ్యాక అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే రామలక్ష్మి అత్త పెంచింది. నాన్నకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆవిడకు సంతాన యోగం లేదని నాన్న చెప్పారు. అత్తయ్య ఆ బిడ్డను తనకు దత్తతు ఇవ్వమని అడిగితే, ‘శ్రావణ శుక్రవారం పుట్టిన బిడ్డను దత్తతు ఇవ్వద్దు’ అని చెప్పినా వినకుండా, అమ్మకు కూడా చెప్పకుండా అత్తయ్యకు దత్తతు ఇచ్చారు. సొంతవారే అవమానించారు... నాన్నగారి చెల్లెళ్లకు ఐశ్వర్యం వచ్చాక నాన్నను చాలాసార్లు అవమానించారు. ఒకసారి సినిమా హాలు దగ్గర క్రాంతి (దత్తు వెళ్లిన అక్క) నాన్న పలకరిస్తే అవమానించింది. క్రాంతి అక్క పెళ్లి పత్రికలో ‘అభినందనలతో అనే చోట మన పేర్లు వేయమనండి’ అని అమ్మ చెప్పటంతో అత్తయ్యను అడిగారట నాన్న. ఇదంతా ఆస్తికోసం చేస్తున్నారంటూ నాన్నను నిందిస్తూ, నిష్ఠూరంగా మాట్లాడారట. అయినా నాన్న ప్రేమనే చూపారు. నాన్న బోళా శంకరుడు. ప్రశంసిస్తే పొంగిపోతారు. క్రమశిక్షణ తప్పితే... నాన్నగారి వివాహం అయ్యాక హైదరాబాద్ డెక్కన్ రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. ఆ తరవాత కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రికలకు పనిచేశారు. అప్పట్లో బాదర్ పేరు మీద రాసేవారు. రజాకార్ ఉద్యమంలో హిట్ లిస్ట్‌లో ఉండేవారు. కొన్నాళ్ల తరవాత అక్కడ నుంచి చెన్నై వచ్చేశారు. అప్పటికే శతకాలు రాశారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ‘వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్’ అని రాసిన బోర్డును ఇంటి గుమ్మం పైన పెట్టి, బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రతిరోజూ తప్పనిసరిగా చదవమనే వారు. నియమాలు పాటించకపోతే గోడ కుర్చీలు, బెల్ట్ దెబ్బలు. మా స్కూల్‌కి రైల్వే గేట్ దాటి వెళ్లాలి. ఒకరోజు గేట్ ఎక్కి దూకి వెళ్లడం ట్యూషన్ మాస్టర్ చూసి, నాన్నకు చెప్పారు. నాకు ఆ రోజు బడిత పూజ. జీవితంలో మళ్లీ ఆ పని చేయలేదు. మాట తీసుకున్నారు.. మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర, ‘మేం కట్నానికి అమ్ముడు పోము’ అని మాట తీసుకున్నారు. నా వివాహం పెళ్లి చూపులు లేకుండా జరిగింది. నాన్నగారే వెళ్లి చూసి నిశ్చయం చేశారు. అమ్మాయితో, ‘మా అబ్బాయి చూడడు, వాడు కోరుకున్నట్లుగా ఉన్నావు నువ్వు, ఒక్క పైసా కట్నం, బంగారం ఏమీ వద్దు. నీ బట్టల సూట్‌కేసుతో మా ఇంట్లో అడుగు పెట్టు’ అన్నారు నాన్న. నాన్న చూసి వచ్చాక, ‘వృద్ధాప్యం వచ్చాక కూడా గ్లామర్ ఉండేలాంటి అమ్మాయిని చూశాను’ అని చమత్కరించారు. నా భార్య ఉషాలత వాళ్లది అతి సామాన్య కుటుంబం. పోరాడారు.. చెన్నై చేరిన కొత్తల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పనిచేశారు. రచయితగా ప్రవేశించటానికి పెద్ద పోరాటమే చేసి, గెలుపు సాధించారు. ‘బందిపోటు’ చిత్రంతో రచయితగా ప్రవేశం చేసి, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక లయలో డైలాగులు రాసి అంతవరకు ఉన్న ఒరవడి మార్చారు. ఈ విషయంలో ఒక జర్నలిస్టు నాన్నను విమర్శించారు. నాన్న కోపంగా, ‘నేను రైటర్ని, అవసరమైతే ఫైటర్ని కూడా అవుతాను, జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు. సీతారామరాజు లైఫ్ యాంబిషన్. ఆ సినిమా కోసం పరిశ్రమలోని పెద్దవాళ్లు విరోధులయ్యారు. అమ్మతో, ‘ఈ సినిమాను దీక్షతో ఒక యజ్ఞంలాగ, తపస్సులాగ చేయాలి. దీని వల్ల కీర్తి వస్తుంది. చాలా సినిమాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతాం. ఏం చేయమంటావు?’ అని అడిగితే, ‘మీకు ఎటు విశ్వాసం ఉంటే అటే వెళ్లండి’ అని అమ్మ ఇచ్చిన మాటతో తెల్లవారు జాము. మూడు గంటలకు నాన్న చింతపల్లి అడవులకు వెళ్లిపోయారు. ఏకాగ్రతతో అనుకున్నది సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రివ్యూ పెద్దల సమక్షంలో జరిగింది. దానికి పి. పుల్లయ్య గారు కూడా వచ్చారు. సినిమా పూర్తిగా చూసి, నాన్నను కౌగిలించుకుని, ‘సినిమా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆనందంగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తన తపస్సు ఫలించినందుకు నాన్న పరమానందించారు. ‘నా పేరు నిలబడే సినిమాలే రాస్తాను. అదే నా కలం బలం’ అని ఎన్నో కథలు తిరస్కరిం చారు. ఫైవ్‌స్టార్ హోటల్, ప్లాట్‌ఫారమ్... రెండిటినీ సమానంగా చూసేవారు. నిజాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ఓపెన్‌గా ఖండించడంతో విరోధులు పెరిగారు. నాన్నను అందరూ మీసాలాయన అనేవారు. సామాన్య జీవితం... చాలా సాధారణంగా ఉండేవారు. మంచి డ్రెస్ వేసుకోమని అమ్మ చెబితే, ‘ఈ బట్టలు చూసి నన్ను మహారథి కాదంటారా’ అంటూ చిరిగిన వాటితోనే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. కారు, రిక్షా, ఆటో, బస్.. అన్ని ప్రయాణ సాధనాలలోనూ ప్రయాణించేవారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ గా భావించి, కంచంలో పెట్టినది తినేసేవారు. ఇంట్లో అందరికీ ఎవరి కంచం వారిది. ఒకసారి అన్నయ్యకు అల్యూమినియం ప్లేట్లో అన్నం పెట్టింది అమ్మ. ‘ఇందులో నేను తినను’ అని అన్నయ్య పేచీ పెట్టాడు. ఆ విషయం నాయనమ్మ నాన్నకు చెప్పింది. నాన్న ఆ రోజున చాలా కోపంగా, అంట్లు తోముకునే బూడిద పెట్టే పళ్లెం కడిగించి, అందులో వారం రోజుల పాటు అన్నం పెట్టమని చెప్పారు. అన్నయ్య తినలేకపోయాడు. ‘అన్నానికి విలువ ఇవ్వాలి. కంచానికి కాదు’ అని మందలించారు. ఒకసారి స్కూల్లో నేను పెన్ దొంగతనం చేశాను. ఎప్పట్లాగే మా నాయనమ్మ నాన్నకు విషయం చెప్పింది. నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ‘చిట్టి పెద్ద అబద్ధాలకోరు’ అని అందరికీ వినపడేలా మూడు సార్లు అనిపించారు. అంతే ఇంకెన్నడూ ఎవ్వరి వస్తువూ ముట్టుకోలేదు. క్యారెక్టర్ బిల్డింగ్‌లో మైండ్ గేమ్ ఆడారని పెద్దయ్యాక తెలిసింది. ఆ బీజాలు మాలో నాటుకుపోయాయి. అందువల్ల కొంత కోల్పోతున్నాం. అందుకని రోజూ నాన్న ఫొటో చూస్తూ, ‘నాన్నా! మీరు మాకు మంచి చేశారో చెడు చేశారో తెలియట్లే్లదు’ అంటుంటాను. ఈ పేరు ఇలా వచ్చింది... వరంగల్ని త్రిపురనేని వంశీకులు పరిపాలించిన కాలంలో, మహారథి అనే ఒక రాజు పేరున నాణెం ముద్రించారు. అందుకని ఆ పేరు పెట్టుకోమని స్నేహితులు చెప్పటంతో నాన్న మహారథిగా మారారు. నాన్నగారి అసలు పేరు బాలగంగాధరరావు. అలా జరిగిపోయింది... 2011 డిసెంబరు 9 వ తేదీ నాన్నగారి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమం అయ్యింది. ‘పిల్లవాడికి ఆశీర్వాదం ఇస్తాను, తీసుకురా’ అన్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను. డిసెంబరు 21న డిశ్చార్జ్ అయ్యాను. 2011, డిసెంబరు 23న నాన్న కన్నుమూశారు. ‘మూడు రోజుల తరవాత దహనం అవుతుంది. కాని నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దు’ అని రాసిన ఒక లెటర్ నాన్న దిండు కింద కనిపించింది. ఆయన అన్నట్లుగానే మూడు రోజుల దాకా వాహనం రాలేదు. ఆశ్చర్యంగా మూడు రోజులూ వాసన రాలేదు. అలా నాన్న తన జాతకం కూడా చెప్పారు. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి
ఫిలిప్పీన్స్ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆగస్టు 3-4 తేదీలలో ప్రవాసి కార్మికుల కోసం వివిధ దేశాలలో అందుబాటులో ఉన్నసహాయక వ్యవస్థలపై ఆసియా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తున్నారు. మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఎ) నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరవుతున్నారు. ప్రవాసి కార్మికులకు ఆయాదేశాలలో ప్రస్తుతం అందుబాటులోఉన్న సహాయక వ్యవస్థలు, ఉత్తమ పద్ధతుల గురించి ఇందులో పాల్గొనే ప్రభుత్వ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునే వీలు కలుగుతుంది. ఈ సమావేశం ద్వారా ఆసియా దేశాలలోని వలసకార్మికులకు అందుతున్న వివిధ సహాయక వ్యవస్థల గురించి తెలుసుకొని, అర్థం చేసుకోవడం, అమలులో ఉన్న మంచి పద్దతులను అధ్యయనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. వేరే దేశంలో విజయవంతంగా అమలవుతున్న మద్దతు వ్యవస్థలను మనం స్వీకరించడానికి, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రవాసికార్మికులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరుకావడం పట్ల మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా భారతదేశ సభ్యులు పి. నారాయణ స్వామి, మంద భీంరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. నమ్మలేని నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీ రామారావు జీవితకథను తెరకెక్కించాలంటే రాంగోపాల్ వర్మే తీయాలని సీనియర్ జర్నలిస్ట్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నడింపల్లి సీతారామరాజు అభిప్రాయపడ్డారు. రాముడు గురించి సినిమా తీయాలంటే రామూనే తీయాలన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘వెన్నుపోటు’ పాటను విడుదల చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఆడియో కూడా ఈరోజు సాయంత్రమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు, సీతారామరాజు పాల్గొన్నారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన క్షోభపై చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘అధికారంతో పాటు కుటుంబాన్ని తనకు చంద్రబాబు దూరం చేశాడని ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారు. తన కుమారుల్లో అత్యంత ఇష్టుడైన హరికృష్ణను కూడా దూరం చేయడంతో మరింత కుంగిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. కుతూహలమ్మకు వెన్నుపోటు పొడిచి నాయకుడయ్యారు. ప్రజాపోరాటాలు చేసి నాయకుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడంతో గోడ దూకి టీడీపీలోకి వచ్చేశాడు. 30 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఇప్పుడు చేతులు కలిపాడు. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టి, ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చరిత్రలో జరిగిన విషయాలన్నీ బాలకృష్ణకు తెలుసు. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి వంశం నాశనమైపోతుందన్న భ్రమను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు కల్పించారు. పార్టీని, కుటుంబాన్ని కాపాడతానని నమ్మించడంతో ఎన్టీఆర్ వారసులు చంద్రబాబు వెనుక నడిచారు. చంద్రబాబు చేసిన ద్రోహం గురించి తెలిసినా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఎన్టీఆర్ వారసులు ఉన్నార’ని వెల్లడించారు. చివరి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఎన్టీఆర్ మొదటి, చివరి ఇంటర్వ్యూలు తనకు ఇచ్చారని సీతారామరాజు వెల్లడించారు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు తనకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగినప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రకటించకుండా చంద్రబాబు ఒత్తిడి చేసినా, పెద్దాయన వినిపించుకోలేదన్నారు. ‘నేను చేసింది తప్పా అని ఎన్టీఆర్ తర్వాత నన్ను అడిగారు. నేను తప్పేంలేదని చెప్పాను. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కూడా మిమ్మల్ని పిలిచి కుప్పంలో ఎన్నికల ప్రచారం చేయించారు. రాష్ట్రమంతా తిప్పారు. మిమ్మల్ని అభినందించారు. కేబినెట్లో తనకు మంచి పదవిక ఇమ్మని లక్ష్మీపార్వతితో మీకు చెప్పించారు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు మాతో ఒకరని చెప్పారు. పెళ్లి విషయంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఆదర్శమని నాతో చెప్పారు. లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్‌కు ఎటువంటి హాని జరగలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ ఒక్కరికే కాదు ఆయన కుటుంబం మొత్తానికి వెన్నుపోటు జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క బాలకృష్ణ తప్పా ఎవరి ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎన్టీఆర్ ఇళ్లు అన్ని అమ్మేశారు. ఆయనకు సంబంధించినవి ఏవీ లేకుండా చేశారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణను వెన్నుపోటు పొడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ పెళ్లిలో హరికృష్ణను కలిశాను. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయన ఎంతో బాధ పడ్డారు. కథానాయకుడు సినిమాలో హరికృష్ణ కుమారులను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. మలక్‌పేట నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని హరికృష్ణ అనుకున్నారు. కేసీఆర్‌తో మాట్లాడినట్టు కూడా నాతో చెప్పారు. ఆయనకు కేబినెట్ పదవికి కూడా నిర్ణయమైంది. నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను మీకు అదే పదవి ఇస్తానని కేసీఆర్ తనతో అన్నారని హరికృష్ణ చెప్పారు. ఎందుకంటే వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. హరికృష్ణను మళ్లీ పైకి తీసుకువాలన్న భావన ఇంట్లోవారి కన్నా కేసీఆర్‌కే వచ్చింది. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ ఏమీ సంపాదించలేదు. బయోపిక్‌లను తీయడంలో రాంగోపాల్ వర్మ ఎక్స్పెర్ట్. ఆయన తెరకెక్కించే సినిమాలో వాస్తవాలు చూపిస్తారని నమ్ముతున్నాన’ని సీతారామరాజు వివరించారు. -
ఎన్టీవార్
-
వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత చిట్టిబాబు
-
చిట్టిబాబు చెవికి ఆపరేషన్ చేయిస్తా..!
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 1980ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు సుకుమార్.. పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సుకుమార్. రంగస్థలం సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు చెప్పలేనన్న సుక్కు.. ఒక వేళ చేస్తే మాత్రం ఆ సినిమాలో చిట్టిబాబు చెవికి ఆపరేషన్ అయి అన్ని మంచిగా వినిపిస్తున్నట్టుగా చూపిస్తానని తెలిపారు. కేవలం పాత్రలను మాత్రమే తీసుకొని కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తానని తెలిపారు. చిరంజీవితో సినిమా చేయటం తన కల, నేను రాసిన కథ చిరుకు నచ్చితే నా కల నెరవేరినట్టే అన్నారు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. -
అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలి!
-
అవినీతికి మరోఎస్సై బలి!
- దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్య - సర్వీసు రివాల్వర్‌తో భార్యను కాల్చి, తానూ కాల్చుకున్న వైనం - అవినీతి డబ్బు కోసం అధికారుల వేధింపులు? - 20 రోజులుగా మానసిక వేదన అనుభవించిన ఎస్సై - చేయని తప్పుకు సస్పెన్షన్ ఉత్తర్వులపై ఆందోళన - బాసుల తీరుపై పోలీసు వర్గాల్లో నిరసన గళం - ఘటనపై మెదక్ అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ - చిట్టిబాబు ఆత్మహత్యకు పైఅధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు సాక్షి, సిద్దిపేట చూస్తుండగానే మరో ఘోరం జరిగిపోయింది. రాష్ట్రంలో అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలైపోయారు. ఉన్నతాధికారుల వేధిం పులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దుబ్బాక పోలీసు క్వార్టర్స్‌లో శుక్రవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా కడప పట్టణానికి చెందిన చిట్టిబాబు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రాకాసిపేటలో స్థిరపడ్డారు. 1984లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి కొన్నేళ్ల కిందే ఎస్సైగా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య సరోజ (48), ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె స్వర్ణ ఎంబీఏ చదువుతున్నారు. సరోజ హైదరాబాద్‌లోని తమ కుమారుడి వద్ద ఎక్కువగా ఉంటుంటారు. తరచూ దుబ్బాకకు వచ్చి వెళుతుంటారు. అయితే గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లిన చిట్టిబాబు... శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యతో సహా దుబ్బాకలోని తమ పోలీస్ క్వార్టర్‌కు చేరుకున్నారు. తర్వాత రెండు గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా మంచంపై నిద్రపోతున్న భార్య సరోజ (48)ను కణతపై పాయింట్ బ్లాంక్ దూరం నుంచి కాల్చి.. తర్వాత తాను గదమ భాగంలో కాల్చుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఓ హోంగార్డు చూడటంతో.. మధ్యాహ్నం భోజనం కోసం ఏం తీసుకురావాలో అడిగేందుకు ప్రభాకర్ అనే హోంగార్డు ఎస్సై చిట్టిబాబు క్వార్టర్ వద్దకు వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్సైని, ఆయన భార్యను చూసి వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందికి చెప్పారు. పోలీసులు వచ్చేటప్పటికే సరోజ చనిపోయి ఉండగా.. చిట్టిబాబు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పిస్టల్ రక్తపు మడుగులోనే పడి ఉంది. పోలీసులు చిట్టిబాబును సిద్దిపేట సురక్షా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు విచారణాధికారిగా మెదక్ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డిని నియమించారని ప్రకటించారు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం చిట్టిబాబు ఆత్మహత్యకు సంబంధించి ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్ అదనపు ఎస్పీ రాంచంద్రారెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ సైదులు ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. పంచనామా పూర్తయ్యే వరకు డీఐజీ అకున్ సబర్వాల్ అక్కడే ఉన్నారు. చిట్టిబాబు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారని.. కుటుంబ సభ్యులు ఏవిధంగా ఫిర్యాదు చేస్తే అదే విధంగా కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సెట్ కాన్ఫరెన్స్ నుంచి ఆత్మహత్య వరకు.. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఖర్చుల కోసం ప్రతి పోలీసు స్టేషన్ నుంచి నెలకు రూ.ఐదు వేలు, పైఅధికారులు వచ్చినప్పుడు డీజిల్ ఖర్చులు ఇవ్వాలనే నిబంధన అమలవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని చిట్టిబాబు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా పోలీసు బాస్‌తో జరిగిన ఓ సెట్ కాన్ఫరెన్స్‌లో వివాదం తలెత్తి ఆత్మహత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. చిట్టిబాబు తీరును మనసులో పెట్టుకున్న జిల్లా అధికారి.. దుబ్బాక మండలంలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, ఇసుక దందా నడుస్తోందని, వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబును నిలదీసినట్టు సహచర పోలీసులు చెబుతున్నారు. దీనిపై చిట్టిబాబు దీటుగానే స్పందించి... తన పోలీస్‌స్టేషన్ పరిధిలో బెల్టు దుకాణాలు లేవని, దాదాపు 60 మందిపై కేసులు పెట్టానని, మీరు అనుమతిస్తే పీడీ యాక్ట్ పెట్టడానికైనా సిద్ధమేనని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన అనంతరం గత నెల 3న శిక్షణ నిమిత్తం చిట్టిబాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. పనిగట్టుకుని ప్రతీకారం! తిరిగి 20వ తేదీన విధుల్లోకి చేరడానికి వచ్చిన చిట్టిబాబును విధుల్లో చేరకుండా అడ్డుకుంటూ ఐడీ పార్టీకి అటాచ్ చేశారు. ఇదే సమయంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పనిగట్టుకొని దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తనిఖీలు చేయించారు. చివరికి తిమ్మాపూర్ అనే గ్రామంలో ఒక బెల్టు దుకాణాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ దుకాణం, ఇసుక రవాణాలను కారణంగా చూపిస్తూ చిట్టిబాబును సస్పెండ్ చేసినట్టు సమాచారం. గురువారం సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని, కానీ వాటిని తీసుకోవడానికి చిట్టిబాబు నిరాకరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ డైరీలో ఏముందో? చిట్టిబాబుకు నిత్యం తన కార్యకలాపాలు డైరీలో రాసుకునే అలవాటు ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు తనను వేధించిన అంశంపై ఆయన తన డైరీలో, హ్యాండ్ బుక్‌లో రాసే ఉంటారని అంటున్నారు. చిట్టిబాబుకు చెందిన కారులో నలుపు రంగులో ఉన్న స్పైరల్ డైరీ ఒక దానిని గుర్తించారు. కారు లాక్ చేసి ఉండడంతో శుక్రవారం సాయంత్రం వరకు దానిని తీయలేదు. ఆ డైరీని పరిశీలిస్తే కొంత సమాచారం దొరకవచ్చని భావిస్తున్నారు. మా నాన్నను వేధించారు: ఎస్సై చిట్టిబాబు కుమారుడు ప్రేమ్‌కుమార్ ‘‘మా నాన్న చాల ధైర్యవంతుడు. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. కానీ ఆయనను ఉన్నతాధికారులు వేధించారు. ఆయనను దోషి అని చూపడానికి ప్రత్యేక పోలీసులతో గ్రామాల్లో సోదాలు చేయించారు. 30 ఏళ్లు డిపార్టుమెంటుకు సేవ చేసిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే నాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని చెప్పారు..’’మీడియాకు చెప్పారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన కూడా ధర్నాలో కూర్చున్నారు. ఆరోపణలు అవాస్తవం: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ‘‘చిట్టిబాబు మృతిపై సీనియర్ పోలీసు అధికారితో విచారణ చేపట్టాం. ఆయన ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణల్లో నిజం లేదు. 1984లో కానిస్టేబుల్‌గా నియమితుడైన చిట్టిబాబు 2012లో ఎస్సైగా ప్రమోషన్ పొందారు. 2004లో ఒకసారి సస్పెండయ్యారు. ఆరు రోజుల క్రితం ఓ క్రైమ్ దర్యాప్తులో భాగంగా సిద్దిపేటకు అటాచ్ చేశాం. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మూడు రోజుల క్రితం సస్పెండ్ చేశాం. కానీ చిట్టిబాబు ఆ ఆదేశాలను ఇంకా తీసుకోలేదు. ఎస్సైగా విధుల్లోనే ఉన్నారు..’’ పోలీసులు మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు: మంత్రి హరీశ్‌రావు ‘‘శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు మనోస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పాలి. వారి వద్ద కూడా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పోలీసులు రక్షణ కోసం వాడే తుపాకులతోనే తమ ప్రాణాలు తీసుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది..’’ అతినీతి మంచి ఎస్సైని బలి తీసుకుంది: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘‘అవినీతి ఒక మంచి ఎస్సైని బలి తీసుకుంది. దళిత కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి ఇలా అర్ధంతరంగా తనువు చాలించటం తీవ్రంగా కలచివేసింది. నాకు తెలిసినంత వరకు ఎస్సై చిట్టిబాబు మచ్చ లేని పోలీసు అధికారి. ఆయన ఆత్మహత్యపై, పోలీసు శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి..’’ ఎస్సైల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి: చాడ సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ఎస్సై స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిట్టిబాబు తన భార్యను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇలా ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖకు మచ్చ అని విమర్శించారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రశేఖరపాళెంకు చెందిన చిట్టిబాబు(40), చిన్న(44) అనే వ్యక్తులు నార్తురాజుపాళెం వైపు ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ది్వచక్రవాహనాన్ని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయిన లారీని కోవూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. -
టీడీపీ సారథి ఎవరో?
► పర్వత వారసుడి కోసం తర్జనభర్జన ► కాపు సామాజికవర్గానికే మళ్లీ పగ్గాలు! ► బీసీలకు అవకాశం ఇవ్వాలని మరో వాదన ► మొగ్గు మెట్టవైపా? కోనసీమకా? ► పోటీలో సీనియర్ నాయకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆకస్మిక మృతి జిల్లాలో ఆ పార్టీకి పెద్దలోటే. మంత్రుల మధ్య వర్గపోరు నడుస్తున్నా పర్వత పార్టీలో అందరివాడుగా ఉండేవారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేయడం, రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు, కేంద్ర నిధుల సాధనలో వైఫల్యం, మరోవైపు గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం తదితర కారణాలతో ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా సారథిగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయూలంటే అధిష్టానానికి కష్టమే. ఈ పదవి కోసం కొందరు సీనియర్ నాయకులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో లభించే వెసులుబాటును ఉపయోగించుకొని రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే తపన ఉన్న జూనియర్ నాయకులు కూడా తమ వంతు కృషి చేసుకుంటున్నట్టు తెలిసింది. కాగా జిల్లాలో పార్టీ పగ్గాల్ని మళ్లీ కాపు సామాజిక వర్గానికే ఇస్తారా లేక బీసీ, ఎస్సీల్లో ఎవరికైనా ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉన్న దృష్ట్యా కాపు నాయకుడికే టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ కాపులకే ఇచ్చినా మెట్ట ప్రాంతం వారికా లేదా కోనసీమ నేతలకా అనేది మరో చర్చ. చిక్కాలకు దక్కుతుందా..? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ప్రస్తుతం ఎలాంటి పద వీ లేని వ్యక్తి చిక్కాల రామచంద్రరావే కనిపిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వివాదాస్పదం కాని వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుంది. గతంలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగినా అధిష్టానం మొండిచెయ్యి చూపింది. కనీసం నామినేటెడ్ పదవైనా ఇస్తారనుకున్నా అదీ లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కాపు సామాజిక వర్గానికే సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకుంటే చిక్కాలకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే.. ఇప్పటికే ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదంటూ ముద్రగడ కాపు ఉద్యమం తలపెట్టిన దృష్ట్యా సౌమ్యుడు చిక్కాల కన్నా దూకుడుగా ఉండే కాపు నాయకుడు ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చనే వాదనా వినిపిస్తోంది. అదే కోణంలో అయితే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు అవకాశం రావచ్చు. అలా పార్టీ జిల్లా సారథి అయితే మాత్రం తోట మంత్రి పదవి కలలపై నీళ్లు చల్లినట్లే! మరో సీనియర్ నాయకుడు, కోనసీమ ప్రాంతానికి చెందిన బండారు సత్యానందరావు పేరు కూడా వినిపిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డితో పోటీపడి ఓటమి పాలైన ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తే.. బండారుకు మళ్లీ చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పదవి కోసం రాజా యత్నం..! కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నాయకులను ఎదుర్కోవాలంటే మెట్ట ప్రాంతం వారికే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే వాదన కూడా టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. ఈ కోణంలో అవకాశం వస్తుందనే ఆశతో డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేసులో పిల్లి సత్యనారాయణ..! ఇప్పటివరకూ జిల్లాలో బలీయమైన కాపు సామాజిక వర్గానికే జిల్లాలో టీడీపీ సారథ్య బాధ్యతలు దక్కుతున్నాయి. జిల్లాలో బీసీలు కూడా ప్రాధాన్య స్థానంలోనే ఉన్నారు. ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు చాన్స్ ఇవ్వవచ్చనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయనకే ఇస్తే మంత్రి పదవిపై ఆయన ఆశలు దాదాపు ఆవిరైనట్లే! కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ కూడా ఈ రేస్‌లో ఉన్నట్లు తెలిసింది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్న సమయంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏదిఏమైనా అటు అధిష్టానానికి, ఇటు జిల్లాలో మంత్రులిద్దరికీ అనుకూలమైనవారికే టీడీపీ అధ్యక్ష పదవి దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ మారనున్న ప్రసాద్..! ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కూడా పర్వత చిట్టిబాబే వ్యవహరించేవారు. ఆయన మరణంతో టీడీపీ శ్రేణులు అక్కడ కూడా నాయకుడి అన్వేషణలో పడ్డాయి. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాలదే ఇప్పటివరకూ పైచేయి. ఏ పార్టీ అయినా ఆ కుటుంబాల నుంచే రావాలి. ఈ నేపథ్యంలో పర్వత కుటుంబంలోనే ఎవరికైనా ఇవ్వవచ్చనే చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పర్వత ప్రసాద్ పేరు తెరపైకి రావడం గమనార్హం. సోమవారం చిట్టిబాబు కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన సాయంత్రం వరకూ ఆ ఇంటివద్దే ఉన్నారు. పరామర్శకు వచ్చిన ఎంపీ తోట నరసింహంతో ఎక్కువ సమయం మాట్లాడుతూ కనిపించడంతో ప్రసాద్ పార్టీ మారతారని టీడీపీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. -
తవ్వకాల్లో వెలుగుచూసిన బౌద్ధ అవశేషాలు
విశాఖ జిల్లా మాడుగుల మండలం వొమ్మల పంచాయతీ పరిధిలోని ఉర్లోవకొండ సమీపంలో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పది మంది సభ్యుల బృందం ఇక్కడ రెండు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఓ రెండు అడుగుల విగ్రహం, చిన్న చిన్న రాళ్లు, పాత్రలు లభ్యమైనట్టు పురావస్తు శాఖ ఏడీ చిట్టిబాబు తెలిపారు. సుమారు 5 మీటర్ల లోతు తవ్వకాలు జరపగా, మరో 20 మీటర్ల మేర తవ్వకాలు జరపనున్నట్టు ఆయన చెప్పారు. -
బావ చేతిలో మరిది హత్య
పరారీలో నిందితుడు పాడేరు రూరల్ : బావ చేతిలో మరిది హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని గబ్బంగి పంచాయతీ పనసపల్లిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. జి.మాడుగుల మండలం సింగర్భ గ్రామానికి చెందిన కిల్లో చిట్టిబాబు మూడేళ్ల క్రితం పనసపల్లికి వలస వచ్చాడు. అరకులోయ మండలం సుంకరిమెట్టకు చెందిన పాంగి తిరుపతి కూడా ఇక్కడికి పదిహేనేళ్ల క్రితం వలసవచ్చి పశువులు కాస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. తిరుపతి చిన్నాన్న కూతురు పార్వతిని కిల్లో చిట్టిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. దీంతో చిట్టిబాబు కుటుంబం కూడా పనసపల్లిలోనే నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, వరుసకు సోదరి అయిన పార్వతికి, తిరుపతికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కొన్నాళ్లుగా చిట్టిబాబును వెంటాడుతోంది. ఈ విషయంపై వీరిద్దరూ తరచూ తగాదా పడేవారు. దీంతో తిరుపతిని హతమార్చాలని శనివారం ఉదయం నుం కత్తి పట్టుకుని చిట్టిబాబు గ్రామంలో తిరిగాడు. ఈ తెలుసుకున్న తిరుపతి తన ప్రాణానికి ప్రమాదం ఉందని భావించి పూటుగా మద్యం సేవించి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న చిట్టిబాబుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన చిట్టిబాబు కొద్ది సేపటికే మృతి చెందాడు. అతడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు సీఐ ఎన్.సాయి, ఎస్ఐ ధనుంజయ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
భోజన సేవ
ఇడ్లీ తినాలంటే ఇరవై... కాసిన్ని టీ నీళ్లు తాగాలంటే పది. అంతోఇంతో డబ్బున్నవారి మాట సరే... మరి అడ్డా కూలీలు... రిక్షావాలాల వంటి పేదల పరిస్థితి..! రోజంతా కాయుకష్టం చేసినా... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. కడుపు నింపని పని. వారి ఆకలి బాధను అర్థం చేసుకుందో కుటుంబం. తరాలుగా పది రూపాయులకే భోజనం పెడుతోంది. బయుట ధరలు వుండుతున్నా... మసాల నషాలానికి అంటుతున్నా... వీరి మెనూలో ‘షార్టేజ్’ కనిపించదు. రేటులో వూర్పూ ఉండదు. ‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాం. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నిరుపేదలకు కడుపు నిండాలి. మేం చల్లగా ఉండాలి’... ఇదీ గిన్నె బాలకృష్ణ మాట. ఆయున ఉండేది మేడ్చెల్ మండలం కోనాపల్లి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈయన ఇప్పుడు పది రూపాయులకే భోజనం పెడుతున్నారు. ఆయున తాత దాదాపు 70 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చారు. ఆయున మోండా మార్కెట్ సమీపంలో ఎడ్ల బండిపై హోటల్ పెట్టి భోజనం అమ్మేవారు. అప్పట్లో దీని రేటు 25 పైసలు. ఆ తర్వాత బాలకృష్ణ తండ్రి, చిన్నాన్న పెదనాన్నలు కూడా దీన్ని వృత్తిగా మలుచుకున్నారు. వారిని అనుసరిస్తూ... 30 ఏళ్ల కిందట బాలకృష్ణా, ఆయున సోదరులు శ్రీను, చిట్టిబాబు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పుట్‌పాత్ పై తాత్కాలిక హోటళ్లు ఏర్పాటు చేసుకుని రూ. 10లకే భోజనాన్ని అందిస్తున్నారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తుండడంతో క్రమంగా రూ. 3 నుంచి ఇటీవలే రూ. 10కి పెంచారు. దినసరి కూలీలు, కార్మికులే వీరి కస్టమర్లు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కూలీలకు అందుబాటులో ఉంటున్నారు. పప్పు, చారు, చెట్నీ.. కిలో బియ్యం రూ.40 పైవూటే. కూరల ధరలు ఆకాశంలో ఉన్నారుు. పప్పుల వూట వింటేనే వుంట. ఇలాంటి పరిస్థితుల్లో రూ.10కే భోజనం పెట్టడం సావూన్యమైన విషయుం కాదు. ఏదో మొక్కుబడిగా కాకుండా... పప్పు, చారు, చెట్నీ మెనూలో ఉంటారుు. కూరలు కూడా పెట్టిందే పెట్టకుండా రోజుకొక వెరైటీ వడ్డిస్తారు. గ్యాస్‌పై కాకుండా... పూర్తిగా కట్టెల పొరుు్యమీదే వంట. వీళ్లు వాడే బియ్యుం ఖరీదు కిలో రూ.35. అయినా చికెన్ రైస్ కూడా రూ.20కే అందిస్తున్నారు. బోటి రైస్ రూ. 25. వీరి చలవతో తక్కువ ధరలో రుచికరమైన భోజనంతో కడుపు నింపుకుంటున్నారు దినసరి కూలీలు. - మహి అదే పదివేలు.. గరీబోళ్ల పొట్ట నిండి... వారు ఆనందంగా ఉంటే అదే పదివేలు. వాళ్లిచ్చే రూ.10లో మాకు కొంత మిగిలినా చాలు. మాకు పుణ్యం కూడా దక్కుతుంది. దీని మీద వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే నా ముగ్గురు ఆడపిల్లల్ని, ఒక బాబుని చదివిస్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి. నేను ఒక్కడినే కాదు.. మా అన్నదమ్ములు కూడా ప్యారడైజ్, మహబూబ్ కాలేజ్, జైల్కానా దగ్గర హోటళ్లు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ల వద్ద కూడా రూ.10కే భోజనం దొరుకుతుంది. - బాలకృష్ణ