Samantha Gives Counter to Producer Chitti Babu - Sakshi
Sakshi News home page

Samantha: కెరీర్‌ ముగిసిందన్న నిర్మాత.. గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన సమంత

Published Sun, Apr 23 2023 11:14 AM | Last Updated on Sun, Apr 23 2023 11:57 AM

Samantha Gives Counter to Producer Chitti Babu - Sakshi

సమంత ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ కాదని, అసలు హీరోయిన్‌ రేంజ్‌ కూడా తనకు లేదని నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్‌ అవడానికి ముందు సమంత కావాలని ఏడుస్తూ సింపథీ డ్రామాలు ఆడి పిచ్చి వేషాలు వేసిందని తీవ్ర ఆరోపణలు చేశాడు సదరు నిర్మాత. ఆమె ఎన్ని డ్రామాలు ఆడినా స్టార్‌డమ్‌ రావడం కష్టమని, ఆల్‌రెడీ తన కెరీర్‌ ముగిసిపోయిందని దారుణ వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా తనపై విమర్శలు గుప్పించిన నిర్మాతకు పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చింది సమంత. చెవిలో వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? అని గూగుల్‌లో సెర్చ్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఆమె ప్రశ్నకు టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎదుగుదల వల్లే చెవిలో వెంట్రులకు పెరుగుతాయి అన్న సమాధానం వచ్చింది. దీనికి ఇఫ్‌ యు నో యు నో అని క్యాప్షన్‌ ఇచ్చింది. నిర్మాత చిట్టిబాబుకు చెవిలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో సమంత సదరు నిర్మాతకే కౌంటరిచ్చిందని అభిప్రాయపడుతున్నారు ఆమె ఫ్యాన్స్‌.

ఇదిలా ఉంటే సమంత చివరిగా శాకుంతలం చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌​ దగ్గర చతికిలపడింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి: హీరోకు 23 సర్జరీలు.. కాలు తీసేయాలన్న డాక్టర్స్‌!
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement