సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే!. జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని ట్విటర్‌లో వెల్లడించిందీ హీరోయిన్. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కాదంటూ మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటం సాంగ్ చేసింది. తన బతుకుదెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసిపోయింది.. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే! మళ్లీ ఆమెకు స్టార్‌డమ్ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్చేసి ఆ సినిమాను సక్సెస్ చేసుకోవాలనుకుంది.
ఇప్పుడేమో.. నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు? ప్రతిసారి సెంటిమెంట్ వర్కవుట్ కాదు. కథ, పర్ఫామెన్స్ నచ్చితే చూస్తారు. అంతేకానీ అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చివేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోంది. అయినా హీరోయిన్ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్టయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకేమాత్రం ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చాడు చిట్టిబాబు.
Comments
Please login to add a commentAdd a comment